హీరో (1984 సినిమా)

1984 సినిమా

హీరో 1984, ఏప్రిల్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, రాధిక, రావు గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[2][3]

హీరో
హీరో సినిమా పోస్టర్
దర్శకత్వంవిజయ బాపినీడు
నిర్మాతఅల్లు అరవింద్
తారాగణంచిరంజీవి,
రాధిక,
రావు గోపాలరావు
ఛాయాగ్రహణంలోక్ సింగ్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
గీతా ఆర్ట్స్
విడుదల తేదీ
1984 ఏప్రిల్ 23 (1984-04-23)
సినిమా నిడివి
129 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

పురావస్తు శాస్త్రవేత్త కృష్ణ (చిరంజీవి), సముద్రపు కనకరాజు ఉన్న గ్రామానికి వస్తాడు. అక్కడ అందరూ కనకరాజును వారి తత్వవేత్త, మార్గదర్శిగా చూస్తుంటారు. గ్రామ అమ్మాయి రాధిక, కృష్ణ పేమలోపడి ఆమెను వివాహం చేసుకోమని బలవంతం చేస్తుంది. దానికి కృష్ణ నిరాకరించగా, తనను కృష్ణ అత్యాచారం చేశాడని గ్రామస్తులతో చెబుతుంది. గుప్త నిధుల కోసం విక్రమ్ ను కనకరాజు చంపాడని, కనకరాజు అసలు పేరు కొండబాబు అని కృష్ణ తెలుసుకుంటాడు. కృష్ణ ఎలాంటి పథకం వేసి కనకరాజు నిజస్వరూపాన్ని బయటపెట్టాడన్నది మిగతా కథ.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • దర్శకత్వం: విజయ బాపినీడు
 • నిర్మాత: అల్లు అరవింద్
 • సమర్పణ: అల్లు రామలింగయ్య
 • సంగీతం: కె. చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: లోక్ సింగ్
 • నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్

పాటలు మార్చు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[4][5]

 1. దేవతలారా (గానం: ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
 2. కాసిలోనే పుట్టాను (గానం: ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
 3. మొన్న రాత్రి (గానం: ఎస్. జానకి)
 4. రామ లక్ష్మణులు (గానం: పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
 5. ఎట్టెట్టా (గానం: ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు మార్చు

 1. Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 9781135943257.
 2. "Hero (1984)". Indiancine.ma. Retrieved 2020-09-06.
 3. "Chiranjeevi movie list - Telugu Cinema hero". www.idlebrain.com. Archived from the original on 2018-01-29. Retrieved 2018-01-22.
 4. SenSongs (2018-11-13). "Hero Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-06.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
 5. "Hero Mp3 Songs". SenSongsMp3.Co.In (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-07-12. Retrieved 2020-09-06.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలు మార్చు