హేమా హేమీలు

(హేమాహేమీలు నుండి దారిమార్పు చెందింది)

హేమా హేమలు చిత్రం 1979 ,మార్చి 23 న విడుదల. ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించగా, అక్కినేని నాగేశ్వరరావు, సుజాత, ఘట్టమనేని కృష్ణ, విజయ నిర్మల, జంటలుగా నటించారు.సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు.

హేమా హేమీలు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
కృష్ణ,
సుజాత,
విజయనిర్మల
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణ మూవీస్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

ఒక జమీందారు దగ్గర కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటం ఉంటుంది. జమీందారు బావమరిది దానికోసం ప్రయత్నించి జమీందారు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాడు. జమీందారు పెద్ద కొడుకు రఘుబాబు, జమీందారు భార్య, జమీందారు కూతురు విజయ, దివాన్ శివరామయ్య ఒక చోట చేరుకుంటారు. జమీందారు చిన్నకొడుకు రామచంద్రబాబు ఒక పల్లెలో పెరుగుతాడు. దివాన్ కొడుకు రాజా ఒక బ్యాంక్ ఉద్యోగి ఆలనాపాలనలో పెరిగి పెద్దవాడవుతాడు. దివాన్ భార్య, కూతురు సీత ఒక పల్లె చేరుకుంటారు. రఘుబాబు పెరిగి పెద్దవాడయి తమ కుటుంబానికి అన్యాయం చేసినవారిపై పగ తీర్చుకోవడానికి రెడ్ లయన్ అనే మారుపేరుతో ఒక ముఠా ఏర్పాటు చేసుకుంటాడు. నల్లపిల్లి పేరుగల ఒక బందిపోటు ముఠా నాయకుడు త్రిలింగా బ్యాంకుపై దాడి చెసి, మేనేజర్‌ను హతమార్చి, జమీందారుకు చెందిన వజ్రకిరీటాన్ని అపహరిస్తాడు. రాజా తనపెంపుడు తండ్రిని హతమార్చినవారిపై పగతీర్చుకోవడానికి నైట్ కింగ్‌గా అవతరించి అడుగడుగునా రెడ్ లయన్‌కు, నల్లపిల్లికి అడ్డుతగులుతుంటాడు. ఒక సారి రాజా రెడ్ లయన్‌ను కలుసుకోయినప్పుడు నల్లపిల్లి జరిపిన కాల్పులవల్ల రఘుబాబు మరణిస్తాడు. దివాన్ శివరామయ్య రఘుబాబు మృతదేహాన్ని భద్రపరుస్తాడు. ఒక పల్లెలో ఆయనకు రామచంద్రబాబు కనిపిస్తాడు. అతడెవరో తెలియని దివాన్ శివరామయ్య అతడిని తీసుకువెళ్ళి ఇంట్లో రఘుబాబు స్థానంలో ప్రవేశపెడతాడు[1].

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
క్రమ సంఖ్య పల్లవి గాయనీగాయకులు సంగీతం గేయరచయిత
1 అందాల శిల్పం కదిలింది నీలోశృంగార దీపం వెలిగింది నాలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రమేష్ నాయుడు వేటూరి
2 అవ్వాయ్ చువ్వాయ్ అమ్మాయి పెళ్ళికి కూకూ సన్నాయి పాడే కోయిలలున్నాయి పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం రమేష్ నాయుడు వేటూరి
3 ఏ ఊరు ఏ వాడ అందగాడా మా ఊరు వచ్చావు పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు వేటూరి
4 చార్మినార్ కాడ మోగింది డోలుదెబ్బగోలుకొండ అదిరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్ బృందం రమేష్ నాయుడు సినారె
5 నీ కోల కళ్ళకు నీరాజనాలు ఆ వాలుచూపుకు అభివందనాలు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల రమేష్ నాయుడు వేటూరి
6 నువ్వంటే నాకెంతో యిష్టం జివ్వు జివ్వున లాగే ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం రమేష్ నాయుడు సినారె
7 పున్నమి వెన్నెల ప్రేమించింది జాబిలి చల్లని దేవుడని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు ఆత్రేయ

మూలాలు

మార్చు
  1. వి.ఆర్. (30 March 1979). "చిత్రసమీక్ష - హేమాహేమీలు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 351. Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 13 December 2017.

బయటి లింకులు

మార్చు