అరవింద డి సిల్వ (ఆంగ్లం Aravinda de Silva) శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతడు 17 అక్టోబర్, 1965న కొలంబోలో జన్మించాడు. ఈ శతాబ్దంలోనే శ్రీలానికి చెందిన ప్రముఖ క్రికెటర్‌గా పరిగణించబడతాడు.[1]

క్రీడా జీవితంసవరించు

అరవింద డి సిల్వ 1984లో ఇంగ్లాండుతో లార్డ్స్|లో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు.[2]1996లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌లో శ్రీలంక విజయానికి చాలా సహకారం అందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోటీలో బ్యాటింగ్‌లో సెంచరీ, బౌలింగ్‌లో 3 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు. టెస్ట్ క్రికెట్‌లో రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు రెండు సార్లు సాధించాడు. భారత్కు చెందిన సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ ల తరువాత (వీరు మూడేసి సార్లు ఈ ఘనత సాధించారు) స్థానం ఇతనిదే.

టెస్ట్ క్రికెట్ గణాంకాలుసవరించు

అరవింద డి సిల్వ 93 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 42.97 సగటుతో 6361 పరుగులు సాధించాడు. అందులో 20 సెంచరీలు, 22 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 267 పరుగులు. బౌలింగ్‌లో 29 వికెట్లు కూడా సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 30 పరుగులకు 3 వికెట్లు.

వన్డే క్రికెట్సవరించు

అరవింద డి సిల్వ 308 వన్డేలు ఆడి 34.90 సగటుతో 9284 పరుగులు సాధించాడు. అందులో 11 సెంచరీలు, 64 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 145 పరుగులు. బౌలింగ్‌లో 106 వికెట్లు కూడా సాధించాడు. వన్డేలలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 30 పరుగులకు 4 వికెట్లు.

మూలాలుసవరించు

  1. "Aravinda de Silva". Cricinfo. Retrieved 2007-10-27. Cite web requires |website= (help)
  2. TEST: England v Sri Lanka at Lord's, 23–28 Aug 1984. Cricinfo. Retrieved on 2007-08-03.