24 విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య మూడు పాత్రలలో నటించి నిర్మించిన సినిమా. తెలుగు, తమిళ భాషలలో తీయబడిన ఈ సినిమా 2016, నవంబర్ 6న విడుదలయ్యింది.

నటీనటులు

మార్చు

శివకుమార్ (సూర్య) గొప్ప సైంటిస్ట్. కాలాన్ని నియంత్రించగలిగే ఓ చేతి గడియారాన్ని తయారు చేస్తాడు. దానితో ప్రపంచం లోనే గొప్ప సైంటిస్ట్గా గుర్తింపు పొందాలను కుంటాడు. కానీ అతని కవలసోదరుడు ఆత్రేయ (సూర్య) ఆ చేతి గడియారం కోసం శివకుమార్పై దాడి చేస్తాడు. అతని భార్య ప్రియ (నిత్యామీనన్) ను చంపేస్తాడు. నెలల కొడుకును, తాను కనిపెట్టిన '24' అనే చేతి గడియారాన్ని తన అన్న పాలపడకుండా తప్పిస్తాడు. ఆ క్రమంలో అన్న చేతుల్లోనే హత్యకూ గురవుతాడు. అదే సమయంలో ఆత్రేయ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఈలోగా శివకుమార్ కొడుకు మణి (సూర్య) పెరిగి పెద్దవాడవుతాడు. అతన్ని సొంత తల్లిలా సత్యభామ (శరణ్య) పెంచి పెద్దచేస్తుంది. తండ్రి జీన్స్ కారణంగా మణి కూడా వాచ్ మెకానిక్ అవుతాడు. అనుకోకుండా మణికి తన తండ్రి కనిపెట్టిన '24' వాచ్ బాక్స్, దాని తాళం లభిస్తాయి. దాన్ని చేతికి ధరించగానే తాను అనుకున్నవిధంగా గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్లడం గమనిస్తాడు. అంతేకాదు కాలాన్ని స్ధంబింప చేస్తాడు. మణి చేతికి ఈ గడియారం దక్కిన సమయంలోనే ఆత్రేయ కూడా 26 సంవత్సరాల తర్వాత కోమాలోంచి బయటకు వస్తాడు. తన చేజారిపోయిన '24' గడియారాన్ని ఎలాగైనా సొంతం చేసుకుని, తాను కోల్పోయిన రెండున్నర దశాబ్దాల కాలాన్ని తిరిగి దక్కించుకోవాలని కోరుకుంటాడు. మరి మణి దగ్గర ఉన్న వాచు ఆత్రేయ తీసుకోగలిగాడా? తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన ఆత్రేయపై మణి కక్ష తీర్చుకున్నాడా? గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్ళగలిగే వాచ్ మణి ఎలాంటి ప్రయోగాలు చేశాడు? అనేది మిగతా కథ!