శివమొగ్గ
శివమొగ్గ లేదా షిమోగా (కన్నడం:ಶಿವಮೊಗ್ಗ), కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ జిల్లా లోని నగరం.ఇది అదే జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది తుంగ నది ఒడ్డున ఉంది. "శివ ముఖ" (శివుని ముఖం) అనే పదం నుండి "శివమొగ్గ" పదం వచ్చిందంటారు. "సిహి మోగె" (తీపి కుండ) నుండి కూడా ఈ పేరు వచ్చిందంటారు. 16వ శతాబ్దంలో "కేలడి" నాయకుల పాలనా కాలంలో ఈ పట్టణం ప్రాముఖ్యతను సంతరించుకొంది. శివప్ప నాయకుని కాలం ఈ నగరం చరిత్రలో సువర్ణఘట్టం. తరువాత మైసూరు రాజ్యంలో భాగంగా ఉంది. 2006 నవంబరు 1 న అధికారికంగా ఈ నగరం, జిల్లా పేరును "షిమోగా"నుండి "శివమొగ్గ"గా మార్చారు.
Shimoga | ||||||
---|---|---|---|---|---|---|
Images, from top down, left right Indian lion in the Tyavarekoppa Tiger and Lion Reserve Statue of Keladi Shivappa Nayaka Sculpture of Mahishasura Mardhini Shivappa Nayaka palace | ||||||
Coordinates: 13°56′N 75°34′E / 13.933°N 75.567°E | ||||||
Country | India | |||||
State | Karnataka | |||||
District | Shimoga | |||||
Region | Malenadu | |||||
Government | ||||||
• Type | City Corporation | |||||
• Body | Shivamogga Mahanagara Palike | |||||
విస్తీర్ణం | ||||||
• City | 70.01 కి.మీ2 (27.03 చ. మై) | |||||
• Rural | 1,037.29 కి.మీ2 (400.50 చ. మై) | |||||
Elevation | 569 మీ (1,867 అ.) | |||||
జనాభా (2011)[1] | ||||||
• City | 3,22,650 | |||||
• Rank | 10th (Karnataka) | |||||
• Rural | 1,84,674 | |||||
Languages | ||||||
• Official | Kannada | |||||
Time zone | UTC+5:30 (IST) | |||||
PIN | 577201 - 577205 | |||||
Telephone code | 91-(0)8182-XXXXXX | |||||
ISO 3166 code | IN-KA | |||||
Vehicle registration | KA-14 | |||||
Climate | Aw |
జిల్లా సరిహద్దులు
మార్చుఈ జిల్లాకు తూర్పున దావణగెరి జిల్లా, ఆగ్నేయాన చిక్మగళూరు జిల్లా, నైరుతిన ఉడిపి జిల్లా, వాయువ్యాన ఉత్తర కన్నడ జిల్లా, ఈశాన్యాన హవేరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
మార్చురైలు రవాణా
మార్చుఈ జిల్లాలో ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు భద్రావతి, హర్నహళ్ళి, కుంసి, ఆనందపురం, సాగర్ ల మీదుగా తల్గుప్ప వరకు ఒక రైలు మార్గం ఉంది.
రోడ్డు రవాణా
మార్చుఈ జిల్లాలో ప్రధాన పట్టణాలను కలుపుతూ ముఖ్య రహదారులున్నాయి.13వ నెంబరు జాతీయ రహదారి, 206వ నెంబరు జాతీయ రహదారులు ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 6632 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండగా అందులో 222 కిలోమీటర్లు జాతీయ రహదారులు. 402 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు కూడా ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి.
వాయు రవాణా
మార్చుప్రస్తుతానికి వాయు రవాణా ఈ జిల్లాలో లేనప్పటికీ శివమొగ్గ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో సొగానె వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.
పరిశ్రమలు
మార్చు- దేశంలోని ముఖ్య ఇనుము-ఉక్కు పరిశ్రమలలో ఒకటైన విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు పరిశ్రమ ఈ జిల్లాలో ఈశాన్యాన భద్రావతి వద్ద ఉంది. ఈ పారిశ్రామిక పట్టణంనకు మంచి రైలు, రోడ్డు సౌకర్యం ఉంది. ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకాలపై ఏర్పడిన ఈ కర్మాగారపు ప్రారంభనామం మైసూర్ ఇనుము-ఉక్కు పరిశ్రమ. ప్రస్తుతం ఈ పరిశ్రమ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో పనిచేస్తుంది.
- భద్రావతిలోనే మరో ముఖ్యమైన పరిశ్రమ భద్రావతి పేపర్ మిల్స్ లిమిటెడ్. ISO 14001 ధృవపత్రం పొందిన ఈ కంపెనీ అన్నిరకాల పేపరును ఉత్పత్తి చేయుటలో ప్రసిద్ధి.
- ఇవే కాకుండా పలు వ్యవసాయ ఆధారిత, ఇంజనీరింగ్ ఉత్పత్తుల, ఆటోమోబైల్, ఆహార, పానీయాలకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లు ఈ జిల్లాలో కలవు.
ముఖ్య పట్టణాలు
మార్చుఅవీ ఇవీ
మార్చు- కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉంది.
- భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ ఈ జిల్లాలోని భద్రావతిలో జన్మించాడు.
- జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి తీర్థహళ్ళి తాలుకాలోని మెలిగె గ్రామంలో జన్మించాడు.
- శరావతిలోయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సాగర్ తాలుకాలో ఉంది.