అ!
'అ!' 2018 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు చిత్రం. తెలుగు నటుడు నాని ఈ చిత్రాన్ని నిర్మించాడు.[1][2]
అ! | |
---|---|
దర్శకత్వం | ప్రశాంత్ వర్మ |
రచన | శివ్ గోపాల్ కృష్ణ (హిందీ మాటలు) |
నిర్మాత | నాని ప్రశాంతి తిపిర్నేని |
తారాగణం | కాజల్ అగర్వాల్ నిత్య మేనన్ రెజీనా ఈషా రెబ్బ ప్రియదర్శి పుల్లికొండ అవసరాల శ్రీనివాస్ మురళీ శర్మ |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
కూర్పు | గౌతమ్ నెరుసు |
సంగీతం | మార్క్ కే. రాబిన్ |
నిర్మాణ సంస్థ | వాల్ పోస్టర్ సినిమా |
విడుదల తేదీ | 16 ఫిబ్రవరి 2018 |
సినిమా నిడివి | 110 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
కథ
మార్చుఓ హోటల్ లోకి కళి (కాజల్) దిగాలుగా రావడంతో సినిమా మొదలవుతుంది. ఆ రోజు తన పుట్టిన రోజు కావడంతో జీవితంలో మరచిపోలేని నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ హోటల్ ను చిత్ర (ప్రగతి) నిర్వహిస్తుంటుంది. కళి వచ్చిన తర్వాత సినిమాలో ఒక్కో పాత్ర ప్రవేశిస్తాయి. తన ప్రియుడిని పరిచయం చేయడానికి రాధ (ఈషా రెబ్బ) వాళ్ల తల్లిదండ్రులతో అదే హోటల్ కి వస్తుంది. ఆమె కూతురు ప్రేమించింది అబ్బాయిని కాదని కృష్ణ అలియాస్ కృష్ణవేణి (నిత్య మేనన్) అనే అమ్మాయినని తెలిసి వారు అవాక్కవుతారు. ఇంతలో అక్కడ ఉద్యోగం కోసం వస్తాడు నలభీముడు (ప్రియదర్శి). అతడికేమో వంట రాదు. యూట్యూబ్‌లో చూసి వంట చేస్తుంటాడు. వీడికి చేప (నాని వాయిస్ ఓవర్), బొన్సాయి మొక్క (రవితేజ వాయిస్ ఓవర్) సాయం చేస్తుంటారు. అదే హోటల్లో రా (రెజీనా) పని మనిషిగా పని చేస్తుంటుంది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి అదే హాటల్‌లో ఓ దొంగతనం చేసి జీవితంలో స్థిరపడాలని చూస్తుంటుంది. ఆ హోటల్ లో పనివాడుగా పని చేస్తుంటాడు శివ (శ్రీని అవసరాల). అయితే శివకి శాస్త్రవేత్త కావాలని కోరిక. ఎలాగైనా టైమ్ మెషీన్ తయారు చేసి గతంలోకి వెళ్లి తన తల్లిదండ్రులను కలవాలనుకుంటాడు. ఇంతలో శివ దగ్గరకి పార్వతి (దేవదర్శిని) అనే మహిళ వస్తుంది. ఆ హోటల్ కి వచ్చిన వాళ్లను తన ఇంద్రజాలంతో అబ్బురపరుస్తుంటుంది చిత్ర కూతురు. అయితే అక్కడికి వచ్చిన ఇంద్రజాలికుడు యోగి (మురళీ శర్మ) ఆమెను ఇబ్బంది పెడతాడు. ఇంద్రజాలం చిన్న పిల్లలు చేయకూడదంటూ అడ్డుకుంటాడు. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో కథ. ఒక్కో జీవితం. కానీ వీరందరూ అదే హోటల్ఎంకి దుకు వచ్చారు. ఎవరి కథ గురించి ఎవరు ఎవరికి చెబుతున్నారు. అసలు వాళ్లందరి జీవితాలు అలా అవ్వడానికి ఎవరు కారణం.. ఆ హోటల్ కి, వీళ్లకీ ఉన్న సంబంధం ఏంటి? కళి పుట్టిన రోజు నాడు తీసుకున్న నిర్ణయం ఏంటి?... ఈ ప్రశ్నలకు జవాబులు మిగిలిన కథలో భాగం.
తారాగణం
మార్చు- కాలిగా కాజల్ అగర్వాల్
- మీరాగా నిత్య మేనన్
- రాధగా ఈషా రెబ్బ
- రెజీనా
- శివగా అవసరాల శ్రీనివాస్
- యొగిగా మురళీ శర్మ
- రాధ తల్లిగా రోహిణి
- నల భీమగా ప్రియదర్శి
- పార్వతిగా దేవదర్శిని
- ప్రగతి
- జాన్ విజయ్ యేసుదాస్
- జయశ్రీ రాచకొండ
- బాంగ్కోక్ మెన్ ఆలీ (నటుడు)
- నానిగా(చేప, కథకుడు) నానీ
- చంటిగా(చెట్టు, కథకుడు) రవితేజ
సాంకేతికవర్గం
మార్చు- సంగీతం: మార్క్ కే రాబిన్
- ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
- ఎడిటింగ్: గౌతమ్ నెరుసు
- నిర్మాత: నాని, ప్రశాంతి తిపిర్నేని
- రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
- బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
ప్రచారం
మార్చు2017 నవంబరు 25న ఈ సినిమా మొదటి ప్రచార చిత్రం విడుదలైనది.[3]
మూలాలు
మార్చు- ↑ "Natural Star Nani Production 1 Awe Poster". thetelugufilmnagar.com. Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 25 November 2017.
- ↑ నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (1 February 2018). "'అ!'హా.. ట్రైలర్ అదరగొట్టింది...!!". www.ntnews.com. Archived from the original on 7 August 2019. Retrieved 7 August 2019.
- ↑ "First Look of Nani's Maiden Production Venture: Top Stars of South Indian Cinema in Awe". tollywood.net. Archived from the original on 26 November 2017. Retrieved 25 November 2017.