అంతఃపురం (సినిమా)

1998 తెలుగు సినిమా
(అంతఃపురం నుండి దారిమార్పు చెందింది)

అంతఃపురం 1998లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయికుమార్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ నిర్మించాడు.

అంతఃపురం
దర్శకత్వంకృష్ణవంశీ
రచనకృష్ణవంశీ (కథ), ఆకెళ్ళ (మాటలు)
నిర్మాతపి. కిరణ్
తారాగణంసాయి కుమార్,
సౌందర్య ,
ప్రకాష్ రాజ్
ఛాయాగ్రహణంఎస్. కె. ఎ భూపతి
కూర్పుశంకర్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
నవంబరు 30, 1998 (1998-11-30)
సినిమా నిడివి
137 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

1999 లో ఈ సినిమాను అదే పేరుతో పునర్నిర్మాణం చేశారు. 2003 లో షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్ ముఖ్య పాత్రల్లో శక్తి: ది పవర్ అనే పేరుతో పునర్నిర్మాణం చేసారు.[1][2]

ఇది ముఠా కక్ష్యల నేపథ్యంలో తీసిన చిత్రం. రాయలసీమలోని ఒక ముఠా నాయకుడు నరసింహ (ప్రకాష్ రాజ్) కుటుంబానికి వేరొక కుటుంబంతో ముఠా కక్ష్యలు ఉంటాయి. ఇతని కుమారుడు శేఖర్ (సాయి కుమార్) కు ఈ గొడవలు నచ్చక కుటుంబానికి దూరంగా న్యూజిలాండ్ దేశంలో నివసిస్తుంటాడు. అక్కడే ఒక అమ్మాయి భానుమతి (సౌందర్య) ని ప్రేమ వివాహం చేసుకుంటాడు. వీరికి ఒక కుమారుడు కలిగిన తర్వాత తన తండ్రి కోరిక మేరకు తిరిగి గ్రామానికి తిరిగి వస్తాడు. ఇది ఇతని భార్యకు ఇష్టం లేకున్నా భర్త మాటకు విలువ నిచ్చి తను కూడా అక్కడికి వెళుతుంది కాని గొడవలు ఇంకా ముదిరిపోతాయి. అనుకోకుండా జరిగిన గొడవలో సాయికుమార్ ప్రత్యర్థుల చేతిలో హతమవుతాడు. అక్కడే ఉంటే తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నదని అతని భార్య, కుమారుడిని తీసుకొని పారిపోతుంది. ఈ క్రమంలో కథ అనేక మలుపులు తిరుగుతుంది.

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

నాట్ విత్ మై డాటర్ అన్న 1991 నాటి అమెరికన్ చిత్రంలోని పాయింట్ ఆధారంగా తీసుకుని అంతఃపురం సినిమా కథను అభివృద్ధి చేశారు.[3]

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పురస్కారాలు

మార్చు

అంతఃపురం సినిమాలో సౌందర్య నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది. జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడి పురస్కారం లభించింది.

పాటలు

మార్చు

ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. అన్ని పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశాడు. పాటలు మెలొడీ మేకర్స్ ఆడియో కంపెనీ ద్వారా విడుదల అయ్యాయి. సూరీడు పువ్వా అనే పాటకు గాను ఉత్తమ గాయనిగా ఎస్. జానకి నంది పురస్కారం అందుకుంది.

  1. కల్యాణం కానున్నది కన్నె జానకికి - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: కె. ఎస్. చిత్ర
  2. అసలేం గుర్తుకురాదు - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: కె. ఎస్. చిత్ర
  3. సై చిందెయ్ శివమెత్తర సాంబయ్యా - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: శంకర్ మహాదేవన్
  4. సూరీడు పువ్వా జాబిల్లి గువ్వా - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: ఎస్. జానకి
  5. ఛెమక్ ఛెమక్ ఛెమకులే - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: నాగూర్ బాబు, స్వర్ణలత

మూలాలు

మార్చు
  1. "A woman scorned". Rediff.com. Retrieved 21 August 2020.
  2. "Karisma back with 'Shakti — The Power'". The Tribune. 20 September 2002. Retrieved 21 August 2020.
  3. టి.ఎన్.ఆర్. "డైరెక్టర్ కృష్ణ వంశీ ఏక్సక్లూసివ్ ఇంటర్వ్యూ". యూట్యూబ్. ఐడ్రీమ్స్ తెలుగు మూవీస్. Retrieved 17 December 2016.

బయటి లింకులు

మార్చు