అందాల రాముడు (2006 సినిమా)

అందాల రాముడు, 2006లో విడుదలైన ఒక తెలుగు సినిమా. అంతవరకూ హాస్యనటుడుగా ఉన్న సునీల్ ఈ చిత్రంలో కథానాయకునిగా నటించాడు. ఈ చిత్రం విజయవంతమయ్యింది. "సుందరపురుషన్" అనే తమిళ చిత్రానికి ఇది పునర్నిర్మాణం.

అందాల రాముడు
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. లక్ష్మీనారాయణ
నిర్మాణం ఎన్.వి. ప్రసాద్, పరస్ జైన్, ఆర్. బి. చౌదరి
తారాగణం సునీల్, ఆర్తి అగర్వాల్
సంగీతం ఎస్.ఎ. రాజకుమార్
కూర్పు నందమూరి హరి
విడుదల తేదీ ఆగష్టు 11, 2006
భాష తెలుగు

ఒక పల్లెటూరులో రాముడు (సునీల్) అనే కుర్రవాడు చిన్నప్పటినుండి రాధ (ఆర్తి అగర్వాల్)ను ప్రేమించాడు. అయితే సవతి తల్లి అంటే ఇష్టంలేక ఇంటిలోంచి పారిపోతాడు. పన్నెండేళ్ళ తరువాత, తండ్రి మరణించాక, రాధ మీద ప్రేమతో తన వూరికి తిరిగి వస్తాడు. తన సవతి తమ్ముడిని (వేణుమాధవ్) ప్రేమగా చేరదీస్తాడు.

కాని రాధ రఘు (ఆకాశ్) అనే నిరుద్యోగిని ప్రేమిస్తుంది. ఇది ఇష్టంలేని రాధ తండ్రి (కోట శ్రీనివాసరావు) ఒక నెలలో రఘుకు ఉద్యోగం వస్తే రాధనిచ్చి అతనికి పెళ్ళి చేస్తానని మాట ఇస్తాడు. ఈ సంగతి తెలియని రాముడు రఘుకు ఉద్యోగం ఇస్తాడు. కాని అన్న మీది ప్రేమతో ఈ పెళ్ళి ఆపాలని రాముడి తమ్ముడు ఒక హత్యానేరంలో రఘును ఇరికించి జైలుకు వెళ్ళేలా చేస్తాడు. ఈ పరిస్థితులలో రాధ పెళ్ళి రాముడితో అవుతుంది. తరువాత రాముడికి తన తమ్ముడు చేసిన పని (రఘును హత్యానేరంలో ఇరికించడం) తెలుస్తుంది.

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: పి. లక్ష్మీనారాయణ (దీప్తి)
  • చిత్రానువాదం: పి. లక్ష్మీనారాయణ (దీప్తి)
  • కథ: లివింగ్‌స్టన్ (తమిళ చిత్రంలో కథానాయకుడు)
  • సంభాషణలు: రమేష్, గోపి
  • సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
  • గీతాలు: భువన చంద్ర, ఇ.ఎస్.మూర్తి, ఆచార్య
  • ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
  • కూరగపు: నందమూరి హరి
  • కళ: కుమార్
  • సమర్పణ: ఆర్.బి. చౌదరి

బయటి లింకులు

మార్చు