అదృష్ట జాతకుడు 1971, ఆగష్టు 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. వినోద ప్రధానంగా సాగిన ఈ చిత్రానికి కె. హేమాంబరధరరావు దర్శకత్వం వహించగా, ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, నాగభూషణం, పద్మనాభం తదితరులు నటించారు. కొన్ని సన్నివేశాల్లో ఎన్.టి.ఆర్. మంచి హుషారుగా, స్వేచ్ఛగా నటించారు. చెల్లెలికోసం తపించే అన్నగా ఎన్.టి.ఆర్. నటన అందరిని కంటతడి పెట్టిస్తుంది. చివరి 20వేల అడుగుల చిత్రం కలర్ లో తీయబడింది. అందులో భారీ సెట్టింగులను వేయడం జరిగింది.

అదృష్ట జాతకుడు
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. హేమాంబరధరరావు
తారాగణం ఎన్.టి. రామారావు,
వాణిశ్రీ,
నాగభూషణం,
పద్మనాభం
సంగీతం టి. చలపతిరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల,
మాధవపెద్ది సత్యం,
జిక్కి,
జయదేవ్,
శరావతి
నిర్మాణ సంస్థ సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

బడిపంతులు పిల్లలు ప్రసాద్, శారద. రాజావారి దుర్మార్గానికి బలైపోయిన బడిపంతులు పిల్లలను ఒంటరి వాళ్ళను చేసి చనిపోతాడు. బంధువులైన పెద్దమ్మ ప్రసాద్ ని, శారదను వాళ్ళ అత్తయ్య తీసుకువెళతారు. ప్రసాద్ పెద్దవాడై ఛీఫ్ మెకానిక్ గా మంచిపేరు తెచ్చుకుంటాడు. ఇంటి యజమానియైన ఈశ్వర్ రావు గారి అమ్మాయి విజయను పెళ్ళిచేసుకుంటాడు. శారదను తన యజమాని కుమారుడు గోపాల్ మోసం చేసాడని తెలుసుకుని, శారదను వివాహము చేసుకోమని వారిద్దరిని అర్ధిస్తాడు. డబ్బుకి కక్కుర్తిపడి పరంధామయ్య మోసంచేసి ప్రసాద్ ను జైలుకి పంపిస్తాడు. శారద పండంటి మగపిల్లవాడిని ప్రసవిస్తుంది. ప్రసాద్ కు పిచ్చివాడిగా పరిచయమయిన రాజారఘునాధరావు తన అన్యాయానికి బలైపోయిన బడిపంతులు పిల్లలే ప్రసాద్, శారద అని తెలుసుకుని వారిని తన ఇంటికి ఆహ్వానించి సర్వాధికారాలు అప్పగిస్తాడు. జమిందారు వేషములో ఉన్న ప్రసాద్ ను గుర్తించక పరంధామయ్య గోపాల్, శారదల పెళ్ళి జరిపిస్తాడు. మారువేషము తీసివేసిన ప్రసాద్ ను గుర్తించి పరంధామయ్య రంకెలు వేస్తాడు. తనతప్పు తెలుసుకున్న గోపాల్ తండ్రిని మందలించి శారదను బిడ్డను దగ్గరికి తీసుకుంటాడు. మంచితనముతో అందరిని మెప్పించిన ప్రసాద్ నిజంగా అదృష్టజాతకుడు అని అందరు పొగుడుతారు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: కె. హేమాంబరధరరావు
  • సంగీతం: టి. చలపతిరావు
  • నేపథ్య గానం: ఘంటసాల, పి. సుశీల, మాధవపెద్ది సత్యం, జిక్కి, జయదేవ్, శరావతి , ఎల్ ఆర్ ఈశ్వరి
  • కధ: బాలమురుగన్
  • మాటలు: మద్దిపట్ల సూరి, ఆదుర్తి నరసింహమూర్తి
  • గీత రచయితలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • ఆర్ట్: బి.ఎన్.కృష్ణ
  • నృత్యం: కె.ఎస్.రెడ్డి
  • స్టంట్: శ్యాంసుందర్
  • కూర్పు: బి.గోపాలరావు
  • ఫోటోగ్రఫీ: శేఖర్, సింగ్
  • ఆపరేటివ్ కెమెరామెన్: సి.సోమశేఖర్
  • స్టూడియో: ప్రసాద్
  • నిర్మాత: కె.హేమాంబరదరరావు
  • నిర్మాణ నిర్వహణ: కె.మహేంద్ర
  • నిర్మాణ సంస్థ: సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్
  • విడుదల:06:08:1971.

పాటలు

మార్చు
  1. ఎవరనుకున్నావ్ నన్నేమనుకున్నావే - ఘంటసాల. రచన :కొసరాజు
  2. ఏదినిజమైన - ఘంటసాల, మాధవపెద్ది, జయదేవ్, శరావతి . రచన: దాశరథి.
  3. కల్లకపటమెరుగని చల్లని చెల్లమ్మ ఇల్లాలై - ఘంటసాల, జిక్కి రచన ; దాశరథి.
  4. చిరుచిరు నవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు - సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  5. అప్పులు చేయకురా నరుడా తిప్పలు తప్పవురా- మాధవపెద్ది సత్యం బృందం, రచన:కొసరాజు
  6. యవ్వనమంటే ఏమిటో చెప్పనా కవ్వించేది కరిగించేది- ఎల్.ఆర్.ఈశ్వరి, రచన: సి నారాయణ రెడ్డి

మూలాలు

మార్చు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)