అభిషేక్ బచ్చన్ సినిమాలు

అభిషేక్ బచ్చన్ ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత.  ఆయన ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించారు. 2000లో  కరీనా కపూర్ సరసన  జె.పి.దత్తా  దర్శకత్వంలో  రెఫ్యూజీ సినిమాతో  బాలీవుడ్ లో తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమాలోని నటనకు ఆయన ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారం కూడా అందుకున్నారు.[1] కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తరువాత ఆయన చేసిన బస్ ఇత్నా సా ఖ్వాబ్ హై(2001), షరారత్(2002) సినిమాలు కూడా పెద్దగా విజయవంతం కాలేదు. [2] 2004లో  మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన యువ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం కూడా అందుకున్నారు.[3] అలాగే ఆ  సినిమా కూడా హిట్ అయింది.  సంజయ్ గాంధీ  దర్శకత్వంలో నటించిన ధూమ్ కూడా మంచి విజయం  నమోదు  చేసుకుంది.[2][4] ఈ చిత్రం ఆ సంవత్సరానికిగానూ  అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.[2][5]

A photograph of Abhishek Bachchan in 2011
2011 యోమిక్స్ వరల్డ్ ఆవిష్కార సభలో అభిషేక్

2005లో రాణీ ముఖర్జీతో  కలసి  చేసిన బంటీ ఔర్ బబ్లీ, రాం గోపాల్ వర్మ  దర్శకత్వంలో  నటించిన  సర్కార్  సినిమాలు కూడా  మంచి విజయాలయ్యాయి.  సర్కార్ సినిమా ఆ ఏడాది అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. [6] ఈ సినిమాలోని నటనకుగానూ అభిషేక్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం కూడా అందుకోవడం విశేషం.[7] ఈ రెండు సినిమాల్లోనూ తన తండ్రి అమితాబ్ బచ్చన్ తో కలసి నటించారు ఆయన. అదే ఏడాది బెంగాలీ సినిమా అంతర్ మహల్(2005) చేశారు. 2006లో  కరణ్ జోహార్ దర్శకత్వంలో కభీ అల్విదా నా  కెహనా సినిమాలో నటించారు.  ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ  సహాయ నటుడు పురస్కారం అందుకున్నారు.  ఇది వరసగా మూడో  ఫిలింఫేర్  పురస్కారం  అయింది  అభిషేక్ కు.[8] అదే ఏడాది ఉమ్రావ్ జాన్, దూమ్2  సినిమాల్లో  నటించారు ఆయన. ధూమ్ లానే ధూమ్2 కూడా భారీ వసూళ్ళు సాధించింది.[9] తరువాత తన భార్య ఐశ్వర్య రాయ్ తో కలసి వ్యాపారవేత్త ధీరూభాయ్  అంబానీ జీవిత కథ ఆధారంగా  మణిరత్నం దర్శకత్వంలో  గురు(2007)  సినిమాలో నటించారు అభిషేక్. [10] ఆ సినిమాలో ధీరూభాయ్ పాత్రను ఆయన నటించారు.  ఈ సినిమా మంచి  విజయం సాధించడమే కాక, ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా లభించాయి.[2]

2008లో సర్కార్ రాజ్, దోస్తానా, ద్రోణ సినిమాల్లో నటించారు అభిషేక్. ఆ తరువాతి సంవత్సరం పా(2009) సినిమా నిర్మించి, నటించారు ఆయన. ఈ సినిమా జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా పురస్కారం గెలిచింది.[11] అదే సంవత్సరం రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ఢిల్లీ6 సినిమాలో నటించారు. ఆ తరువాత ఆయన మణిరత్నం దర్శకత్వంలో చేసిన రావణ్(2010), గేమ్(2011) సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన కెరీర్ మళ్ళీ కొంత వెనుకపట్టింది. 2012లో అజయ్ దేవగణ్ చిత్రం బోల్  బచ్చన్ సినిమాలో  సహాయ నటునిగా నటించారు అభిషేక్. పా  తరువాత మళ్ళీ ఈ సినిమాతోనే హిట్ అందుకున్నారు ఆయన.[12][13] ఆ తర్వాత ఆమిర్ ఖాన్నటించిన ధూమ్3 (2013), షారుఖ్ ఖాన్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్ (2014), అక్షయ్ కుమార్ చిత్రం హౌస్ ఫుల్ 3 (2016) వంటి విజయవంతమైన చిత్రాల్లో సహాయ నటునిగా నటించారు అభిషేక్.[14][15]

సినిమాలు మార్చు

చిత్రం సంవత్సరం పాత్ర దర్శకుడు నోట్స్ మూలాలు
రెఫ్యూజీ 2000 రెఫ్యూజీ జె.పి.దత్తా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారానికి నామినేషన్ [16]
తేరా జాదూ చల్ గయా 2000 కబీర్ శ్రీవాస్తవ ఎ.ముత్తు [17]
[18]
ధై అక్షర్ ప్రేమ్ కే 2000 కరణ్ ఖన్నా రాజ్ కన్వర్ [19]
[20]
బస్ ఇత్నా సా ఖ్వాబ్ హై 2001 సూరజ్ శ్రీవాస్తవ గోల్డీ బెహ్ల్ [21]
హా మైనే భీ ప్యార్ కియా 2002 శివ్ కపూర్ ధర్మేశ్ దర్శన్ [22]
[23]
ఓమ్ జై జగదీశ్ 2002 జగదీశ్ బట్రా అనుపమ్ ఖేర్ [24]
షరారత్ 2002 రాహుల్ ఖన్నా గురుదేవ్ భల్లా [25]
[26]
దేశ్ 2002 అంజాన్ రాజా సేన్ బెంగాలీ సినిమా
అతిథి పాత్ర
[27]
[28]
మై ప్రేమ్ కీ దివానీ హూ 2003 ప్రేమ్ కుమార్ సూరజ్ బర్జట్య ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [29]
ముంబై సే ఆయా మేరా దోస్త్ 2003 కరణ్ సింగ్ అపూర్వ లఖియా [30]
కుచ్ నా కహో 2003 రాజ్ రోహన్ సిప్పీ [31]
జమీన్ 2003 ఎసిపి జై రోహిత్ శెట్టి [32]
ఎల్.ఒ.సి కార్గిల్ 2003 విక్రమ్ బట్రా జె.పి.దత్తా [33]
రన్ 2004 సిద్ధార్ధ్(సిద్ధూ) జీవా [34]
[35]
యువ 2004 లల్లమ్ సింగ్ మణి రత్నం ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం
ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారానికి నామినేషన్
[36]
హమ్ తుమ్ 2004 సమీర్ కునాల్ కోహ్లీ అతిథి పాత్ర [37]
[38]
ఫిర్ మిలేంగే 2004 తరుణ్ ఆనంద్ రేవతి [39]
ధూమ్ 2004 ఎసిపి జై దీక్షిత్ సంజయ్ గాంధీ దిల్బరా పాట కూడా పాడారు. [40]
[41]
రక్త్ 2004 మనవ్ మహేశ్ మంజ్రేకర్ క్యా మైనే సోచా పాటలో అతిథి పాత్రలో నటించారు. [42]
[43]
నాచ్ 2004 అభినవ్ రామ్ గోపాల్ వర్మ [44]
బంటీ ఔర్ బబ్లీ 2005 రాకేశ్ త్రివేద్/బంటీ షాద్ అలీ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [45]
[46]
సర్కార్ 2005 శంకర్ నగ్రే రామ్ గోపాల్ వర్మ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం గెలిచారు [47]
దస్ 2005 శశాంక్ ధీర్ అనుభవ్ సిన్హా [48]
సలామ్ నమస్తే 2005 డాక్టర్. విజయ్ కుమార్ సిద్ధార్ధ్ ఆనంద్ అతిథి పాత్ర
వ్యాఖ్యాత
[49]
[50]
[51]
అంతర్ మహల్ 2005 బ్రిజ్ భూషణ్ రితుపర్ణో ఘోష్ బెంగాలీ సినిమా [52]
[53]
హోమ్ డెలివరీ 2005 స్వంతపాత్ర సుజోయ్ ఘోష్ అతిథి పాత్ర [54]
[55]
ఏక్ అజ్నబీ 2005 బాడీగార్డ్ అపూర్వ లఖియా అతిథి పాత్ర [50]
[56]
నేల్ అన్ నిక్కీ 2005 బార్ లో వ్యక్తి అర్జున్ సబ్ లోక్ అతిథి పాత్ర [57]
బ్లఫ్ మాస్టర్! 2005 రాయ్ కపూర్ రోహన్ సిప్పీ రైట్ హియర్ రైట్ నౌ పాట కూడా పాడారు. [58]
[59]
అలగ్ 2006 అషు త్రిఖా సబ్సే అలగ్ పాటలో అతిథి పాత్ర [60]
కభీ అల్విదా నా కెహ్నా 2006 రిషి తల్వార్ కరణ్ జోహార్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం [61]
లగే రహో మున్నా భాయ్ 2006 సన్నీ రాజ్ కుమార్ హిరానీ అతిథి పాత్ర [62]
[63]
ఉమ్రావ్ జాన్ 2006 నవాబ్ సుల్తాన్ జె.పి.దత్తా [64]
ధూమ్ 2 2006 ఎసిపి జై దీక్షిత్ సంజయ్ గాంధీ [65]
గురు 2007 గురుకాంత్ దేశాయ్ మణి రత్నం ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [66]
షూట్ ఔట్ ఎట్ లోఖండ్ వాలా 2007 అభిషేక్ మాత్రే అపూర్వ లఖియా అతిథి పాత్ర [67]
[68]
జూమ్ బరాబర్ జూమ్ 2007 రిక్కీ తుక్రాల్ షాద్ అలీ [69]
ఆగ్ 2007 డ్యాన్సర్ రామ్ గోపాల్ వర్మ మెహబూబా మెహబూబా పాటలో అతిథి పాత్ర [70]
లాగా చునారీ మే దాగ్ 2007 రోహన్ వర్మ ప్రదీప్ సర్కార్ [71]
ఓం శాంతి ఓం 2007 స్వంతపాత్ర ఫర్హా ఖాన్ అతిథిపాత్ర [55]
సర్కార్ రాజ్ 2008 శంకర్ నగ్రే రామ్ గోపాల్ వర్మ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [72]
మిషన్ ఇస్తాన్ బుల్ 2008 అపూర్వ లఖియా నోబడీ లైక్ యూ పాటలో అతిథి పాత్ర [73]
[74]
ద్రోఃణ 2008 ఆదిత్య/ద్రోణ గోల్డీ బెహ్ల్ [75]
దోస్తానా 2008 సమీర్ తరుణ్ మన్సుఖానీ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ [76]
లక్ బై చాన్స్ 2009 స్వంత పాత్ర జోయ అక్తర్ అతిథి పాత్ర [77]
ఢిల్లీ-6 2009 రోషన్ మెహ్రా రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా [78]
పా 2009 అమోల్ అర్తే ఆర్.బల్కీ నిర్మాత [79]
[80]
రావణ్ 2010 బీరా ముండా మణి రత్నం [81]
ఝూఠా హి సహీ 2010 కాలర్ 3 అబ్బాస్ త్య్రెవాలా అతిథి పాత్ర(గాత్రం మాత్రమే ఉంటుంది, మనిషి కనపడరు) [82]
[83]
ఖెలైన్ హమ్ జీ జాన్ సే 2010 సుర్జ్యా సేన్ అశుతోశ్ గోవరికర్ [84]
గేమ్ 2011 నైల్ మీనన్ అభినయ్ దేవ్ [85]
దమ్ మారో దమ్ 2011 ఎసిపి విష్ణు కామత్ రోహన్ సిప్పీ త్యాన్ త్యాన్ పాట కూడా పాడారు. [86]
[87]
బుడ్డా.. హోగా తేరా బాప్ 2011 పూరీ జగన్నాధ్ గో మీరా గో పాట కూడా పాడారు. [88]
ప్లేయర్స్ 2012 చార్లే అబ్బాస్ మస్తాన్ బుద్ధీ తో భగవాన్ పాట కూడా పాడారు. [89]
[90]
బోల్ బచ్చన్ 2012 అబ్బాస్ అలీ/అభిషేక్ బచ్చన్ రోహిత్ శెట్టి బోల్ బచ్చన్ పాట కూడా పాడారు. [91]
[92]
నోటంకీ సాలా! 2013 రోహన్ సిప్పీ డ్రామే బాజ్ పాటలో అతిథి పాత్ర [93]
ధూమ్‌ 3 2013 ఎసిపి జై దీక్షిత్ విజయ్ కృష్ణ ఆచార్య [94]
హ్యాపీ న్యూ ఇయర్ 2014 నందు భిదే/విక్కీ గ్రోవర్ ఫరాహ్ ఖాన్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [95]
ది షౌకీన్స్ 2014 అభిషేక్ శర్మ అతిథి పాత్ర [96]
షమితాబ్ 2015 ఆర్.బల్కీ నిర్మాత
అతిథిపాత్రలో కూడా చేశారు
[80]
[97]
[98]
ఆల్ ఈజ్ వెల్ 2015 ఇందెర్ భల్లా ఉమేష్ శుక్లా [99]
[100]
హౌస్ ఫుల్ 3 2016 బంటీ సాజిద్ ఫర్హాద్ [101]
ప్రభుదేవా దర్శకత్వంలో చిత్రం(పేరు ఇంకా పెట్టలేదు) 2017 ప్రభుదేవా నిర్మాణంలో ఉంది [102]

టివిలో మార్చు

టైటిల్ సంవత్సరం నోట్స్ మూలాలు
నేషనల్ బింగో నైట్ 2010 వ్యాఖ్యాత [103]

మూలాలు మార్చు

  1. "Bollywood vs South: Abhishek or Rana Daggubati" Archived 2015-01-30 at Archive.today.
  2. 2.0 2.1 2.2 2.3 "Photos: Happy Birthday Abhishek!
  3. "Abhishek Bachchan gets nostalgic about 'Yuva' as the Mani Ratnam movie marks a decade".
  4. "7 reasons why we love Dhoom series".
  5. Raheja, Dinesh (27 May 2005).
  6. "Box Office 2005".
  7. "Winners of the 51st Fair One Filmfare Awards" Archived 2012-07-17 at Archive.today.
  8. "We are bad losers: Abhishek".
  9. "Top Lifetime Nett Grossers All Time".
  10. Corliss, Richard (23 June 2010).
  11. "Big B wins National Award for Paa".
  12. Chakravatry, Riya (10 July 2012).
  13. Sen, Shomini (22 October 2014).
  14. "Pressurising Farah to make 'Happy New Year' sequel: Abhishek Bachchan".
  15. "Happy New Year collects Rs 350 crore worldwide" Archived 2015-02-05 at the Wayback Machine.
  16. "Refugee". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  17. "Tera Jadoo Chal Gaya". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  18. Verma, Suparn (18 August 2000). "It's Abhishek all the way!". Rediff.com. Retrieved 29 January 2015.
  19. "Dhai Akshar Prem Ke". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  20. "Mera Maahi Bada Sohna". Saavn. Retrieved 31 January 2015.
  21. "Bas Itna Sa Khwaab Hai". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  22. "Haan Maine Bhi Pyaar Kiya". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  23. Adarsh, Taran (15 February 2002). "Haan Maine Bhi Pyaar Kiya". Bollywood Hungama. Retrieved 29 January 2015.
  24. "Om Jai Jagadish". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  25. Adarsh, Taran. "Sharaarat". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  26. "Sharaarat". Bollywood Hungama. Retrieved 29 January 2015.
  27. "First film to star Abhi-Jaya". The Times of India. Retrieved 18 November 2014.
  28. Grover, Anil (6 September 2002). "Tabu to play Bengali girl". The Telegraph. Retrieved 3 February 2015.
  29. "Main Prem Ki Diwani Hoon". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  30. "Mumbai Se Aaya Mera Dost". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  31. "Kuch Naa Kaho". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  32. "Zameen (2003 film)". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  33. "LOC Kargil". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  34. "Run". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  35. Kulkarni, Ronjita (14 May 2004). "Run for Abhishek!". Rediff.com. Retrieved 29 January 2015.
  36. "Yuva". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  37. "Abhishek Bachchan in Hum Tum". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  38. "Hum Tum". Bollywood Hungama. Retrieved 29 January 2015.
  39. "Phir Milenge". Bollywood Hungama. Archived from the original on 18 అక్టోబరు 2014. Retrieved 14 November 2014.
  40. "Dhoom". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  41. "Dilbara (reprisal)". Saavn. Retrieved 31 January 2015.
  42. Chopra, Anupama. "Movie review: Rakht". indiatoday.in. Living Media. Retrieved 17 November 2014.
  43. ""Kya Maine Socha" Film Rakht Ft. Abhishek Bacchan, Bipasha Basu". T-Series. Retrieved 29 January 2015.
  44. "Naach". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  45. "Bunty Aur Babli". Bollywood Hungama. Retrieved 14 November 2014.
  46. Verma, Sukhanya (27 May 2005). "Go watch Bunty aur Babli!". Rediff.com. Retrieved 29 January 2015.
  47. "Sarkar". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  48. "Dus (film)". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  49. "Abhishek Bachchan in Salaam Namaste". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  50. 50.0 50.1 Chaudhuri, Diptakirti (12 September 2014). Bollybook: The Big Book of Hindi Movie Trivia. Penguin Books Limited. p. 619. ISBN 978-93-5118-799-8.
  51. "Salaam Namaste". Bollywood Hungama. Retrieved 29 January 2015.
  52. Bamzai, Kaveree (14 November 2005). "Antarmahal starring Soha Ali Khan, Abhishek Bachchan". indiatoday.in. Living Media. Retrieved 18 November 2014.
  53. Mitra, Indrajit (28 October 2005). "Antarmahal: Must watch!". Rediff.com. Retrieved 29 January 2015.
  54. "Home Delivery". Bollywood Hungama. Retrieved 30 January 2015.
  55. 55.0 55.1 "Abhishek Bachchan acts funny in Om Shanti Om". Bollywood Hungama. Retrieved 19 November 2014.
  56. "Abhishek-Lara in "Ek Ajnabee": it's official". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  57. "Neal 'n' Nikki". Bollywood Hungama. Retrieved 30 January 2015.
  58. "Bluffmaster!". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  59. "Right Here Right Now". Saavn. Retrieved 31 January 2015.
  60. Mehar, Rakesh (19 June 2006). "The story drew me to the film'". The Hindu. Retrieved 25 January 2015.
  61. "Kabhi Alvida Naa Kehna". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  62. "Abhishek Bachchan on the cameo in Lage Raho Munnabhai". Bollywood Hungama. Retrieved 18 November 2014.
  63. "Lage Raho Munna Bhai". Rotten Tomatoes. Retrieved 29 January 2015.
  64. "Umrao Jaan (2006)". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  65. "Dhoom 2". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  66. "Guru". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  67. "Shootout at Lokhandwala". Bollywood Hungama. Retrieved 30 January 2015.
  68. Adarsh, Tarun (15 May 2007). "Shootout at Lokhandwala". Bollywood Hungama. Retrieved 29 January 2015.
  69. "Jhoom Barabar Jhoom". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  70. "Ram Gopal Varma Ki Aag". Bollywood Hungama. Retrieved 30 January 2015.
  71. "Laaga Chunari Mein Daag". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  72. "Sarkar Raj". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  73. "Mission Istaanbul". Bollywood Hungama. Retrieved 18 November 2014.
  74. "Nobody Like You [Full Song] Mission Istaanbul". T-Series. Retrieved 8 February 2015.
  75. "Drona". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  76. "Dostana (2008 film)". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  77. Masand, Rajeev (4 February 2009). "Masand Verdict: Luck By Chance inspiring, fun". CNN-IBN. Archived from the original on 21 డిసెంబరు 2013. Retrieved 30 January 2015.
  78. "Delhi 6". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  79. "Paa". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  80. 80.0 80.1 "I hate producing films: Abhishek Bachchan". The Indian Express. 18 October 2014. Retrieved 29 January 2015.
  81. "Raavan". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  82. "Imran, Abhishek and Ritesh to do voice cameos in Jhootha Hi Sahi". Zee News. Archived from the original on 13 డిసెంబరు 2014. Retrieved 18 November 2014.
  83. "Index to Motion Picture Credits – Jhootha Hi Sahi". Academy of Motion Picture Arts and Sciences (AMPAS). Archived from the original on 21 ఫిబ్రవరి 2015. Retrieved 8 February 2015.
  84. "Khelein Hum Jee Jaan Sey". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  85. "Game (2011 film)". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  86. "Dum Maro Dum". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  87. "Thayn Thayn Full Video Song (HD) Dum Maaro Dum Rana Daggubati, Anaitha Nair & Prateik". T-Series. Retrieved 31 January 2015.
  88. "Shahrukh Khan surviving on pain killers". CNN-IBN. 21 June 2011. Archived from the original on 22 ఆగస్టు 2011. Retrieved 12 March 2015.
  89. "Players". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  90. "Buddhi Do Bhagwan (Charlie's Song)". Saavn. Retrieved 31 January 2015.
  91. "Bol Bachchan". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  92. "Bol Bachchan". Saavn. Retrieved 31 January 2015.
  93. "Abhishek tunrs Dramebaaz for Nautanki Saala". Headlines Today. 12 April 2013. Retrieved 12 March 2015.
  94. "Dhoom 3". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  95. "Happy New Year (2014 film)". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  96. "Abhishek Bachchan in the Shaukeens". The Indian Express. Retrieved 14 January 2015.
  97. "Producer Abhishek Bachchan to do a cameo in Shamitabh". indiatoday.in. Living Media. 13 January 2015. Retrieved 29 January 2015.
  98. "Today's Big Releases: Shamitabh, Mr Turner". NDTV. 6 February 2015. Retrieved 6 February 2015.
  99. "All Is Well". Bollywood Hungama. Retrieved 17 November 2014.
  100. Coutinho, Natasha (21 January 2015). "Asin resumes filming with Abhishek Bachchan". Deccan Chronicle. Retrieved 1 February 2015.
  101. Iyer, Sanyukta (18 November 2015). "Around the world in the '50s with Akshay". Mumbai Mirror. Retrieved 18 November 2015.
  102. "Prabhudheva's next film to be with Abhishek Bachchan". Hindustan Times. Retrieved 10 September 2016.
  103. Verma, Sukanya (25 January 2010). "Abhishek Bachchan is no Big B". Rediff.com. Retrieved 30 January 2015.