అమరావతి ఎక్స్‌ప్రెస్
భారతీయ రైల్వేస్ [1] కు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వే (ఎస్.ఇ.ఆర్.), ఖరగ్ పూర్ డివిజన్ కేంద్రంగా అమరావతి ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును నడిపిస్తున్నారు. ఈ రైలు వారానికి నాలుగు సార్లు ఇరు మార్గాల్లో నడుస్తుంటుంది. విజయవాడ, గుంతకల్, హుబ్లీ, మడగాం స్టేషన్ల మీదుగా ఈ రైలు కార్యకలాపాలు సాగుతుంటాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా, కర్ణాటక, గోవారాష్ట్రంలో గల వాస్కోడగామా వరకు ప్రయాణిస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గుంటూరు, నర్సారావు పేట, మార్కాపూర్, కంబం, గిద్దలూరు, నంద్యాల, మహానంది, గుంతకల్, బళ్లారి, సమీప ప్రాంతాలవారికి అమరావతి ఎక్స్ ప్రెస్ సుపరితం.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ |
స్థితి | నడుస్తుంది |
స్థానికత | పశ్చిమ బెంగాల్,ఒడిషా, ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,గోవా |
ప్రస్తుతం నడిపేవారు |
|
మార్గం | |
మొదలు | హౌరా జంక్షన్ రైల్వే స్టేషను |
ఆగే స్టేషనులు | 42 |
గమ్యం | వాస్కోడగామా |
ప్రయాణ దూరం | 710 కి.మీ. (440 మై.) |
రైలు నడిచే విధం | వారంలో నాలుగు రోజులు |
సదుపాయాలు | |
శ్రేణులు | స్లీపర్ , ఏ.సి 2,3 జనరల్ |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | రెండు |
పట్టాల గేజ్ | విస్తృతం (1,676 ఎం.ఎం) |
వేగం | 57 kilometres per hour (35 mph) |
డిసెంబరు 2012 నాటికి, ఈ రైలు బండి సేవలు
ఈ రైలు వారానికి మూడు సార్లు విజయవాడ హుబ్బల్లి మధ్య నడుస్తుంది,, ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే (ద మ రే) బెజవాడ (విజయవాడ) డివిజన్ ఆంధ్రప్రదేశ్ గోవా రాష్త్రముల మధ్య నడుపుచున్నది.
- 18047 హౌరా - వాస్కోడగామా అమరావతి ఎక్సప్రస్ [3]
- 18048 వాస్కోడగామా - హౌరా అమరావతి ఎక్సప్రస్
ఈ రైలు బండి వారానికి నాలుగు రోజులు రెండు వైపుల నుండి వయా విజయవాడ, గుంతకల్లు, హుబ్బల్లి, మదగావ్ నడుస్తుంది, ఈ రైలును ఆగ్నేయ రైల్వే మండలం ఖరగపూర్ విభాగము చే నడపబడుచున్నది. ఈ రైలుబండి పశ్చిమ బెంగాల్ నుండి గోవాకు ఓడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణించును.
అమరావతి ఎక్సప్రస్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరునరసరావుపేటకంభం[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరుగుంతకల్లు కర్నాటకలోని బళ్ళారి హుబ్బల్లి తదితర ప్రాంతాలలో బహుళ ప్రజాదరణ పొందింది.
చరిత్ర
మార్చుఅమరావతి ఎక్సప్రస్ చరిత్ర
మార్చుఅమరావతి ఎక్స్ప్రస్ చారిత్రక వైశిష్ట్యం కల మచిలీపట్టణం-మొర్ముగావ్ రైలు మార్గములో నడుస్తున్నది
ఈ రైలును తొలిగా 1950 మీటర్ గేజ్ మార్గమునందు గుంటూరు, హుబ్బల్లి మధ్య నడపబడ్డది, తర్వాత 1987-1990 లలో గుంటూరు హుబ్బలి శీఘ్ర సవారీగా వున్నతికరించబడింది, అటు తర్వాత దీనికి అమరావతి ఎక్స్‌ప్రెస్ గా నామకరణం చేయబడ్డది తొలుత ఈ రైలు బండి yp ఆవిరి ఇంజిన్ తో నడపబడేది, వాస్కోడగామా నుండి కొన్ని బోగీలు గుంటూరు వరకు నడిపేందుకు గాను అదనంగా హుబ్బల్లిలో తగిలించేవారు, వాస్కోడగామా నుండి గోమంతక్ ఎక్సప్రస్ ద్వారా గదగ్ వరకు, గదగ్ నుండి గదగ్-మిరాజ్ లింక్ ఎక్స్ప్రస్ కు ఈ అదనపు భోగీలను తగిలించి నడిపేవారు, కాలక్రమేనా ఈ విధంగా భోగీలను తగిలించటం విడగొట్టడం మానేసి రైలునుహుబ్బలి వరకు అమరావతి ఎక్స్ప్రస్ పేరుతో నడిపించటం మొదలుపెట్టారు.1997 గేజ్ ప్రామనికరణం జరిగేంతవరకు ఈ రైలు ఈ విధానం లోనే నడిపింప బడ్డది.
1994లో ఈ రైలును విజయవాడ వరకు పొడిగించారు. రైలు మార్గం ప్రామాణీకరణ జరుగుతున్న కొద్ది ఈ రైలును హుబ్బల్లి, అటు తర్వాత లోండా కూడలి, కాజిల్ రాక్ స్టేషను, వాస్కోడగామ వరకు పొడిగించుకుంటూ వెళ్లారు.2000 సంవత్సరములో ఈ రైలును వాస్కోడగామ విజయవాడ మధ్య ప్రతిరోజు నడిచే రైలుగా మార్పు చేసారు.అయితే ప్రయాణికుల నుండి తగినంత ఆదరణ లభించకపోవడంతో వారానికి రెండు రోజులు మాత్రమే వాస్కోడగామ వరకు మిగతా ఐదు రోజు హుబ్బల్లి వరకు మాత్రమే నడిపారు.
2003 నుండిఈ రైలును వారానికి మూడు సార్లు విజయవాడ హుబ్బల్లి మధ్య నడిచేలా మిగతా నాలుగు రోజులు హుబ్బలి వరకు నడిపారు, జూలై 2007 నుండి వాస్కోడగామ-విజయవాడ రైలును హౌడా కూడలి వరకు పొడిగించారు.
2010లో 7227/7228 విజయవాడ-హుబ్బల్లి రైలును 17227/17228 గా, హౌడా-విజయవాడ 8047/8048 రైలును 18047/18048 గా సంఖ్యను కేటాయించారు ఫెబ్రవరి 12 2013, రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే అమరావతి ఎక్సప్రస్ ను 17225/17226 హుబ్బలి-విజయవాడ రైలును ప్రతి రోజు నడిచే రైలుగా మార్చారు.[4]
సవరించబడిన రైలు సమయ పట్టిక సమయాలు త్వరలో అందించబడును
రైలు యొక్క నామ విశిష్టత
మార్చుఈ రైలును శాతవాహనుల చారిత్రక రాజధాని అమరావతి (ప్రస్తుత గుంటూరుజిల్లాలో ఉన్న అమరావతి) కు గుర్తుగా నామకరణం జరిగింది, బౌద్ధ మత స్తుపాలకు అమరావతి దక్షిణభారత సాంచిగా పేరు గాంచింది
ట్రాక్షన్
మార్చు- 17225/17226 అమరావతి ఎక్స్‌ప్రెస్ కు WDM3A డిజిల్ ఇంజిను గుత్తి షెడ్ దక్షిణ మధ్య రైల్వే, గుంతకల్లు విభాగం ఇంజిన్ ను విజయవాడ హుబ్బల్లి మధ్య నడిచెందేందుకు ఉపయోగింపబడుచున్నది.
- 18047/18048 సంఖ్య గల అమరావతి ఎక్స్‌ప్రెస్ హౌరా-విశాఖపట్నం ల మధ్య సంత్రగచ్చి లోకోషెడ్ అధారిత WAP4 విద్యుత్ ఇంజన్ ను, అక్కడి నుండి గుంటూరు వరకు విజయవాడ లేదా లాలాగూడా లోకోషెడ్ అధారిత WAP4 ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. గుంటూరు-వాస్కోడగామా మధ్య గుత్తి లోకోషెడ్ అధారిత WDM3A డీజిల్ ఇంజిన్ ను వినియోగిస్తున్నారు.
కోచ్ల అమరిక
మార్చు- 18047/18048 సంఖ్య గల అమరావతి ఎక్స్‌ప్రెస్ (వాస్కోడగామా - హౌరా )
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | జనరల్ | A1 | బి3 | బి2 | బి1 | ఎస్9 | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | జనరల్ | హెచ్.సి.పి | SLR |
- 17225/17226 అమరావతి ఎక్స్‌ప్రెస్ (విజయవాడ-హుబ్లీ)
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | జనరల్ | జనరల్ | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | A1 | బి2 | బి1 | జనరల్ | జనరల్ | SLR |
బాహ్య లింకులు
మార్చు- Vijayawada, Guntur or Amaravati
- ఆంధ్ర ప్రదేశ్
- Goa, Hubli, Bellary
- Trains of SWR
- AP Tourism Archived 2011-05-12 at the Wayback Machine
- Amaravati Express
సూచనలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Indian Railways". indianrail.gov.in.
- ↑ "17226 Hubli-Vijayawada". indiarailinfo.com.
- ↑ "18047 Howdah-Vasco da Gama". indiarailinfo.com.
- ↑ "Amaravati Express - 17225". cleartrip.com. Archived from the original on 2014-04-08. Retrieved 2015-03-20.