రామ్ చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సినిమా నాయక్, 2013 జనవరి 9 న ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా దర్శకుడు వి.వి.వినాయక్.

నాయక్
దర్శకత్వంవి.వి.వినాయక్
స్క్రీన్ ప్లేఆకుల శివ
కథఆకుల శివ
నిర్మాతడి.వి.వి. దానయ్య
తారాగణంరాం చరణ్ తేజ
కాజల్ అగర్వాల్
అమలా పాల్
ఫిష్ వెంకట్
ఛాయాగ్రహణంఛోటా కె.నాయుడు
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
యూనివర్శల్ మీడియా
పంపిణీదార్లుErrabus (UK & Europe) [1]
Universal Media (USA) [2]
విడుదల తేదీ
2013 జనవరి 9 (2013-01-09)
సినిమా నిడివి
160 నిమిషాలు[3]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్35 కోట్లు

కథ మార్చు

చెర్రీ (రామ్ చరణ్ తేజ) సరదా కుర్రాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అనుకోకుండా బాబాయ్ జిలేబి (బ్రహ్మానందం) కారణంగా హీరోయిన్ మధు (కాజల్ అగర్వాల్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో మునిగి తేలుతున్న తరుణంలో, సమాంతరంగా మరో కథ నడుస్తుంటుంది. రౌడీలను, డిఐజిని చెర్రీ చంపడం, అతగాడి కోసం సిబిఐ వెదుకుతుండడం. తీరా విశ్రాంతికి వచ్చేసరికి చంపుతున్నది చెర్రీ కాదని, అతగాడిలాగే వుండే సిద్ధార్థ నాయక్ (చరణ్) అని తేలుతుంది. దీంతో కథ ఫ్లాష్బ్యాక్లో కలకత్తాకు చేరుతుంది. కలకత్తాలో డాక్టర్గా పనిచేస్తున్న రాజీవ్ కనకాల బావమరిది ఈ సిద్ధార్థ. అనుకోని పరిస్థితుల్లో రావత్ (ప్రదీప్ రావత్) అనుచరుడి చేతిలో హతమవుతాడు రాజీవ్. దాంతో సిద్దార్థ ఆ అనుచరుణ్ణి చంపేస్తాడు. అప్పటికే రావత్ అతగాడి అనుచరుల చేతుల్లో విలవిలలాడుతున్న కలకత్తా జనం అతగాడిని తమ నాయకుడిగా భుజాలకెత్తుకుంటారు. దీంతో సిద్దార్ధ తన జనంతో, బలంతో రావత్ ఆటలు కట్టించేందుకు ప్రయత్నిస్తాడు. దానికి ప్రతిగా అతగాడు సిద్దార్ధను తీవ్రంగా గాయపరిచి, మరణించాడనుకుని, గంగానదిలో పారేస్తాడు. బతికొచ్చిన సిద్దార్థ మరోసారి రావత్ను చంపాలని ప్రయత్నించడంలో, చెర్రీ పాత్రతో జతకలుస్తుంది. చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.

తారాగణం మార్చు

సంగీతం మార్చు

ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. కొండవీటి దొంగ చిత్రం నుంచి ఇళయరాజా స్వరపరిచిన "శుభలేఖ రాసుకున్నా" పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేసారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా హైదరాబాదులో రామానాయుడు స్టూడియోసులో 2012 డిసెంబరు 17న విడుదలయ్యాయి. విడుదలయిన తర్వాత ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభించింది.

నెం. పాట గాయకులు రచన నిడివి
1 "లైలా ఓ లైలా" శంకర్ మహదేవన్, రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ చంద్రబోస్ 4:35
2 "కత్తిలాంటి పిల్లా" ఎస్. ఎస్. థమన్, షెఫాలీ అల్వారిస్ చంద్రబోస్ 3:53
3 "శుభలేఖ రాసుకున్నా" హరిచరణ్, శ్రేయా ఘోషాల్ వేటూరి సుందరరామ్మూర్తి 4:12
4 "ఒక చూపుకే పడిపోయా" విజయ్ ప్రకాష్, బిందు మహిమ భాస్కరభట్ల రవికుమార్ 4:46
5 "నెల్లూరే" సుచిత్ర, జాస్ప్రీత్ జాస్ సాహితి 3:53
6 "హే నాయక్" శ్రేయా ఘోషల్, నవీన్ మాధవ్ చంద్రబోస్ 4:38

మూలాలు మార్చు

  1. "Ram Charan's Nayak picked up for a record price". timesofindia.indiatimes.com. Retrieved November 2, 2012.
  2. "Universal Media bags Ram Charan's Nayak USA Rights". timesofap.com. Archived from the original on 2012-12-31. Retrieved November 4, 2012.
  3. "Censor certificate and cuts of Naayak". idlebrain.com. January 8, 2013. Retrieved January 8, 2013.