పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన సినిమా ఇద్దరమ్మాయిలతో. అల్లు అర్జున్, అమలా పాల్, కేథరీన్ థెరీసా ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 31 మే, 2013న విడుదలౌతున్నది.

ఇద్దరమ్మాయిలతో...
సినిమా పోస్టరు
దర్శకత్వంపూరీ జగన్నాధ్
రచనపూరీ జగన్నాధ్
స్క్రీన్ ప్లేపూరీ జగన్నాధ్
నిర్మాతబండ్ల గణేశ్
తారాగణంఅల్లు అర్జున్
అమలా పాల్
కేథరీన్ థెరీసా
సంగీతందేవిశ్రీ ప్రసాద్[1]
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుషణ్ముఖ ఫిల్మ్స్
దేశంభారత్
భాషతెలుగు

కథ మార్చు

గమనిక: ఈ సినిమా యొక్క కథ నాన్-లీనియర్ విధానంలో నడుస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కథ లీనియర్ విధానంలో ఇక్కడ రాయబడింది. దయచేసి గమనించగలరు.

ఇటలీకి ఫిడేల్ బ్రహ్మ (బ్రహ్మానందం) దగ్గర వయొలిన్ నేర్చుకోవాలని వచ్చిన కోమలి (అమలా పాల్) అక్కడ సంజు రెడ్డి (అల్లు అర్జున్) అనే ఒక స్ట్రీట్ పర్ఫార్మరుతో ప్రేమలో పడుతుంది. ఒకరోజు తనకు తెలియకుండానే ఒక ఘోరమైన హత్యను తన కెమేరాలో షూట్ చేస్తుంది. ఆ డాన్ (షావర్ అలీ) మనుషుల నుంచి కోమలిని సంజు ఒకసారి కాపాడుతాడు. తమ ఇద్దరి కుటుంబాలు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాక కోమలిని ఆ డాన్ తమ్ముడు కిడ్నాప్ చేస్తాడు. సంజు ఆ ప్రదేశానికి చేరుకున్న వెంటనే తన కళ్ళ ముందే కోమలిని కత్తితో పొడుస్తాడు ఆ డాన్ తమ్ముడు (పెనుమత్స సుబ్బరాజు). అందరినీ ఎదిరించి ఆ డాన్ తమ్ముడిని తీవ్రంగా గాయపరిచి, సంజు కోమలిని హాస్పిటల్లో చేరుస్తాడు. అక్కడికి వారిద్దరి తల్లిదండ్రులు చేరుకుంటారు. సంజు తండ్రి (నాజర్) తన స్నేహితుడైన సెంట్రల్ మినిస్టరు (రావు రమేష్)కి ఈ విషయాన్ని చెప్తాడు. కానీ ఆ సెంట్రల్ మినిస్టర్ కాజేసిన వెయ్యి కోట్లను స్విస్ బ్యాంకులో వెయ్యడానికి నిరాకరించినందువల్లే ఆ దేశం యొక్క అంబాసిడరు (డేమియన్ మవిస్)ను ఆ డాన్ ద్వారా చంపించాడని, అదే కోమలి షూట్ చేసిందని సంజు తండ్రికి తెలియదు. సెంట్రల్ మినిస్టర్ నుంచి ఫోన్ అందుకున్న ఆ డాన్ హాస్పిటలుకి వెళ్ళి సంజుని కత్తితో దారుణంగా గాయపరిచి, వారిద్దరి తల్లిదండ్రులనూ చంపి, ఆ కెమెరాను తీసుకుని వెళ్ళిపోతాడు. నాటి నుంచి ఆ డాన్ పై విపరీతమైన పగతో రగులుతున్న సంజు ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆ డాన్ ప్రాణాలు తీయలేకపోతుంటాడు.

ఇంతలో సంజుకి ఆ డాన్ పై పగతీర్చుకునేందుకో అవకాశం దక్కుతుంది. సెంట్రల్ మినిస్టర్ కూతురు ఆకాంక్ష (కేథరీన్ థెరీసా) ఇటలీకి సైకాలజీ కోర్సుకు వస్తుంది. తను కోమలి ఉన్న ఇంట్లో దిగబోతుందని తెలిసి, అక్కడ ఒక డైరీని వదిలి వెళ్తాడు సంజు. అందులో వాళ్ళ పెద్దలు వారి పెళ్ళికి ఒప్పుకున్నరని రాసి ముగించేస్తాడు. ఆ ఇంట్లో దిగిన ఆకాంక్ష ఆ డైరీ చదివి, సంజు కోమలిలపై ఆసక్తిని పెంచుకుంటుంది. డైరీ పూర్తయ్యాక సంజుని కోమలి గురించి అడిగితే సంజు కోమలి చనిపోయిందని చెప్తాడు. మెల్లగా ఆకాంక్షను ట్రాప్ చేసి వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను ఆ డాన్ కి పంపిస్తాడు సంజు. తను పెళ్ళిచేసుకోబోయే అమ్మాయి తనని చంపాలనుకునే వాడితో తిరుగుతోందని తెలిసి ఆ డాన్ రగిలిపోతాడు. ఇంతలో ఆకాంక్ష తండ్రి పంపిన గూండాలతో ఫైట్ చేస్తూ ఆకాంక్షకి నిజాన్ని చెప్పేస్తాడు. చివరికి ఆ డాన్ మరియూ తన తమ్ముడి ప్రాణాలను తీసేస్తాడు సంజు. సంజు కోమలిలతో మీరిద్దరూ విడిపోయాక నేను తిరిగి వస్తానని చెప్పి ఆకాంక్ష వెళ్ళిపోవడంతో సినిమా ముగుస్తుంది.

నటులు మార్చు

సంగీతం మార్చు

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. పూరీ జగన్నాధ్ సినిమాకి సంగీతం అందించడం దేవి శ్రీకి ఇది తొలి సారి. ఆదిత్య మ్యూజిక్ లేబెల్ ద్వారా శిల్పకళా వేదికలో ఈ సిన్మా పాటలను ఏప్రిల్ 28, 2013న విడుదల చేసారు. ఈ సినిమా పాటలు ప్రజలచే విశేషంగా ఆదరించబడ్డాయి.

పాట గానం రచన నిడివి
రన్ రన్ అపాచే ఇండియన్, షర్మిల రామజోగయ్య శాస్త్రి 5:03
శంకరాభరణంతో మనో, సుచిత్ సురేశన్, రాణినారెడ్డి దేవి శ్రీ ప్రసాద్ 4:25
వయొలిన్ సాంగ్ డేవిడ్, అనిత విశ్వ 4:24
గణపతి బప్పా సూరజ్ జగన్ భాస్కరభట్ల రవికుమార్ 3:29
టాప్ లేసిపోద్ది సాగర్, గీతా మాధురి భాస్కరభట్ల రవికుమార్ 4:18
రన్ రన్ రీమిక్స్ దేవి శ్రీ ప్రసాద్, అపాచే ఇండియన్, షర్మిల రామజోగయ్య శాస్త్రి 4:00

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. http://www.123telugu.com/mnews/bunny-insists-on-dsp.html