అమ్మాయే నవ్వితే

వి.జ్యోతికుమార్ దర్శకత్వంలో 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం

అమ్మాయే నవ్వితే 2001, నవంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. సుధా ఆర్ట్ ప్రొడక్షన్స్[2] పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వి.జ్యోతికుమార్[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, భావన, జయసుధ, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అదించారు.[4] ఈ చిత్రం పరాజయం పొందింది.[5]

అమ్మాయే నవ్వితే
Ammaye Navvithe Movie Poster.jpg
అమ్మాయే నవ్వితే సినిమా పోస్టర్
దర్శకత్వంవి.జ్యోతికుమార్
కథా రచయితజలదంకి సుధాకర్
(చిత్రానువాదం/మాటలు)
కథఉదయ్ రాజ్
నిర్మాతవి. ఆనంద్ ప్రసాద్
తారాగణంరాజేంద్రప్రసాద్,
భావన,
జయసుధ,
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంఎన్.వి. సురేష్ కుమార్
కూర్పుమురళి-రామ్మయ్య
సంగీతంఎం.ఎం. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
సుధా ఆర్ట్ ప్రొడక్షన్స్[1]
విడుదల తేదీ
2001 నవంబరు 9 (2001-11-09)
సినిమా నిడివి
129 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

భూస్వామ్య యుగ అధిపతి శేషాద్రి నాయుడు (రంగనాథ్) పాలించిన తలమంచి గ్రామంలోని సుందరం (రాజేంద్ర ప్రసాద్) ఒక నిరుద్యోగి. నాయుడు కళాశాలలో హిందీ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో సుందరం ఆ ఉద్యోగంలో చేరాలి అనుకుంటాడు. తన తెలివితేటలతో సుందరం ఆ ఉద్యోగం పొందుతాడు. నాయుడు కుమార్తైన శిరీష (భవన)ను ప్రేమిస్తాడు. ఇది గమనించిన నాయుడు, 15 రోజుల్లో శిరీషతో ఐ లవ్ యు చెప్పించుకోవాలని షరతు విధిస్తాడు. శిరిష ప్రేమను పొందడంలో సుందరం విజయవంతమవుతాడ అనేది మిగిలిన కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: వి.జ్యోతికుమార్
 • నిర్మాత: వి. ఆనంద్ ప్రసాద్
 • చిత్రానువాదం, మాటలు: జలదంకి సుధాకర్
 • కథ: ఉదయ్ రాజ్
 • సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ
 • ఛాయాగ్రహణం: ఎన్.వి. సురేష్ కుమార్
 • కూర్పు: మురళి-రామ్మయ్య
 • నిర్మాణ సంస్థ: సుధా ఆర్ట్ ప్రొడక్షన్స్

పాటలుసవరించు

Untitled

ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. టిప్స్ మ్యూజిక్ కంపనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6]

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "కొక్కొ కోడిపెట్ట (రచన: శ్వేతనాగ)"  హరిణి 4:08
2. "నిన్న లేదు మొన్న లేదు (రచన: కులశేఖర్)"  రమణ, ఎం.ఎం. శ్రీలేఖ 4:26
3. "ఎబిసిడి (రచన: శ్వేతనాగ)"  రవివర్మ పోతేదార్, ఎం.ఎం. శ్రీలేఖ 4:05
4. "చిన్ని కృష్ణుడొచ్చాడు (రచన: జలదంకి సుధాకర్)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రాజేంద్ర ప్రసాద్, రమణ, సునీత ఉపద్రష్ట 3:22
5. "యమునాతీరే యమయమ (రచన: శ్వేతనాగ)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం. శ్రీలేఖ 3:18
6. "దండాలయ్య (రచన: జలదంకి సుధాకర్)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 4:23

మూలాలుసవరించు

 1. "Ammaye Navvithe (Overview)". IMDb.
 2. "Ammaye Navvithe (Banner)". Chitr.com.
 3. "Ammaye Navvithe (Direction)". Fullhyd.com.
 4. "Ammaye Navvithe (Cast & Crew)". Spice Onion.
 5. "Ammaye Navvithe (Review)". The Cine Bay.
 6. "Ammaye Navvithe (Songs)". Cineradham. Archived from the original on 2020-07-23. Retrieved 2020-07-23.

ఇతర లంకెలుసవరించు