ఆలపాటి లక్ష్మి
ఆలపాటి లక్ష్మి ప్రముఖ రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.
జననంసవరించు
1952, ఫిబ్రవరి 19 న ఏలూరు లో జన్మించారు.
రంగస్థల ప్రస్థానంసవరించు
పదమూడవ ఏటనే రంగస్థల ప్రవేశం చేసి వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. విశాఖపట్టణం లో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పరిషత్తులలో పాల్గొని ఉత్తమనటిగా వందలాది బహుమతలు గెలుచుకున్నారు.
మిశ్రో, ఎం.వి.ఎస్.హరనాథరావు, కె. వెంకటేశ్వరరావు, ఎ.ఆర్.కృష్ణ, కె.ఎస్.టి. సాయి, చాట్ల శ్రీరాములు వంటి ఎంతో మంది దర్శకత్వంలో నటనకు మెరుగులు దిద్దుకున్నారు.
నటించినవిసవరించు
నాటకాలు
- జగన్నాధ రథచక్రాలు
- ఓ బూతు నాటకం
- క్షీరసాగర మథనం
- డియర్ ఆడియన్స్
- సిన్సియర్లీ యువర్స్
- మరో మొహంజదారో
- అనగనగా ఒక అమ్మాయి
నాటికలు
- అమ్మ
- లేడిపంజా
- ది గేమ్
పద్య నాటకాలు
- రాణాప్రతాప్
- జనమేజయం
సినిమారంగంసవరించు
పురస్కారాలుసవరించు
- రాష్ట్రస్థాయి కందుకూరి పురస్కారం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్[1]
ఇతరములుసవరించు
ఆకాశవాణిలో ‘ఎ’ గ్రేడ్ ఆర్టిస్ట్ గా అనేక నాటకాలలో పాల్గొన్నారు. సినిమాలలో, టి.వి. సీరియళ్లలో ప్రముఖ పాత్రలు పోషించారు.
మూలాలుసవరించు
- ఆలపాటి లక్ష్మి, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 534.
- ↑ వెబ్ ఆర్కైవ్, ఈనాడు, తాజా వార్తలు (16 April 2018). "కందుకూరి రంగస్థల అవార్డులు ప్రకటన". Retrieved 16 April 2018.