ముత్యాలముగ్గు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ముత్యాలముగ్గు 1975 లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. బాపు దర్శకత్వం, ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు భాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావు గోపాలరావు నటనలో ఒక కలికితురాయి.
ముత్యాలముగ్గు (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
నిర్మాణం | మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు |
తారాగణం | శ్రీధర్ , సంగీత |
సంగీతం | కె.వి.మహదేవన్ |
గీతరచన | సి. నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీరామ చిత్ర |
భాష | తెలుగు |
చిత్రకథ
మార్చుఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా (అల్లు రామలింగయ్య) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు - కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమెను భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు.
తారాగణం
మార్చు- సూరపనేని శ్రీధర్
- సంగీత
- రావు గోపాలరావు
- కాంతారావు
- అల్లు రామలింగయ్య
- సూర్యకాంతం
- నూతన్ ప్రసాద్
- ముక్కామల
- మాడా వెంకటేశ్వరరావు
- బేబీ రాధ
- మాస్టర్ మురళి
- పిసుపాటి వేంకటేశ్వరరావు (మరణం 2022 మార్చి 10)[1]
- జయమాలిని
- కల్పన
- హలం
- సాక్షి రంగారావు
- అర్జా జనార్ధనరావు
- వరప్రసాద్
- సురేష్ కుమార్
- కాకరాల
- జిత్ మోహన్ మిత్రా
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: బాపు
సంగీతం: కె వి మహదేవన్
నిర్మాత: మద్దాలి వెంకటలక్ష్మీ నరసింహారావు
నిర్మాణ సంస్థ: శ్రీరామ చిత్ర
సాహిత్యం: సి నారాయణ రెడ్డి,ఆరుద్ర, గుంటూరు శేషేంద్ర శర్మ
నేపథ్య గానం:మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వి .రామకృష్ణ, పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం: ఇషాన్ ఆర్య
విడుదల:25:07:1975.
- జాతీయ పురస్కారం
- 1976: రజత కమలం
- 1976: ఇషాన్ ఆర్య, ఉత్తమ ఛాయాగ్రాహకుడు
పాటలు
మార్చు- ఏదో ఏదో అన్నది, ఈ మసక వెలుతురు, గూటిపడవలో విన్నది, కొత్త పెళ్ళి కూతురు, రచన:ఆరుద్ర, గానం. విస్సంరాజు రామకృష్ణ దాస్
- నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నులలో నీరు తుడిచి కమ్మని కథ చెప్పింది.రచన: (గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఏకైక చిత్రగీతం), గానం. పి సుశీల
- ఎంతటి రసికుడవో తెలిసెరా.... ఎంతసేపు నీ తుంటరి చూపు, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పులపాక సుశీల
- ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా, మత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయా, రచన : ఆరుద్ర, గానం - పి.సుశీల
- శ్రీరామ జయరామ సీతా రామ ,రచన: ఆరుద్ర, గానం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- గోగులు పూచే గోగులు కాచే ఓలచ్చ గుమ్మడి,రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
- శ్రీరాఘవం దశరదాత్మజ మప్రమేయం సీతాపతిం(శ్లోకం), గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
హిట్టయిన "డయలాగులు"
మార్చుఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. వాటిని తూర్పు గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.
- సెగట్రీ! పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ ఆకాసంలో!....సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ? ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కూసంత కలాపోసనుండాల. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
- సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
- వాడికి స్త్రీజాతిమీద నమ్మకం పోయింది. నాకు మనుషులమీదే నమ్మకంపోయింది. (కాంతారావు ముక్కామల తో)
- సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. (సంగీత కాంతారావు తో)
సినిమా బొమ్మల కొలువు
మార్చు-
సినిమా లోగో
-
సంగీత
-
కంట్రాక్టర్గా రావుగోపాలరావు
-
శ్రీధర్, అల్లురామలింగయ్య
వనరులు
మార్చు- లో వ్యాసం, చిత్రాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
మూలాలు
మార్చు- ↑ "పి.వెంకటేశ్వర రావు మృతి." andhrajyothy. Archived from the original on 2022-03-10. Retrieved 2022-03-10.