దేవాంతకుడు (1984)

1984 సినిమా

దేవాంతకుడు, చిరంజీవి హీరోగా 1984లో విడుదలైన ఒక తెలుగు సినిమా. చిరంజీవి తారాపధంలో ఎదగడానికి తోడ్పడిన సినిమాలలో ఇది ఒకటి.

దేవాంతకుడు
(1984 తెలుగు సినిమా)
TeluguFilm Devanthakudu 1984.jpg
దర్శకత్వం ఎస్.ఎ.చంద్రశేఖర్
నిర్మాణం నారాయణరావు
కథ శోభ
చిత్రానువాదం ఎస్.ఎ.చంద్రశేఖర్
తారాగణం చిరంజీవి (విజయ్),
విజయశాంతి (శాంతి),
నారాయణరావు (చంటి),
వరలక్ష్మి[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-] (విజయ్ చెల్లెలు),
చిట్టిబాబు (చౌదరి, అబ్బాయి),
రోహిణి (లలిత),
గొల్లపూడి మారుతీరావు (రామానుజం),
గుమ్మడి వెంకటేశ్వరరావు (పోలీస్ కమిషనర్),
గోకిన రామారావు (ధర్మరాజు),
హరి (అరుణ్ కుమార్),
కోట శ్రీనివాసరావు,
అర్జా జనార్ధనరావు,
అన్నపూర్ణ,
సిల్క్ స్మిత,
విజయలక్ష్మి
సంగీతం జె. వి. రాఘవులు
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ,
పి. సుశీల
గీతరచన వేటూరి సుందరరామమూర్తి,
గోపి,
జ్యోతిర్మయి
సంభాషణలు తోటపల్లి మధు (తొలి చిత్రం)
ఛాయాగ్రహణం ఎన్. కేశవ
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ దమయంతి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేదీ 12 ఏప్రిల్ 1984
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

ఆడుతూ, పాడుతూ సరదాగా ఉండే విజయ్ (చిరంజీవి) అనే యువకుడికి పందాలు కాయడం, ఎలాగైనా ఆ పందెం నెగ్గించుకోవడం అలవాటు. అతను అరుణ్ (హరి) అనే యువకుని హత్య కేసులో ఇరుక్కుంటాడు. అప్పుడు విజయ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమే ఈ సినిమా కథ.

పాటలుసవరించు

  • చెల్లెమ్మకీ పెళ్ళంట, అన్నయ్యకి సంబరమంటా - రచన: గోపి - గానం: బాలు, శైలజ
  • చిలకొచ్చి కొడుతుంటే చిరుబుగ్గా - రచన: వేటూరి- గానం: బాలు, శైలజ
  • ఘడియకో కౌగిలింత, గంటకో పులకరింత - రచన: వేటూరి - గానం: బాలు, సుశీల
  • చెల్లెమ్మకీ పెళ్ళంట (విషాదంగా) - రచన: గోపి - గానం: బాలు
  • ఆకేసి, పీటేసి, ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికీ - రచన: జ్యోతిర్మయి- గానం: బాలు, సుశీల
  • నే కుబుసం విడిచిన నాగుని - రచన: వేటూరి - గానం: బాలు (సిల్క్ స్మిత, చిరంజీవిలపై చిత్రీకరించిన పాట)

విశేషాలుసవరించు

  • ఇది గెలువు నన్నదే అనే కన్నడ సినిమా కథతో పునర్నిర్మించబడింది. కన్నడ సినిమా బాక్సాఫీసువద్ద విఫలమయ్యింది కాని తెలుగు సినిమా సూపర్ హిట్ అయింది.
  • ఇది చిరంజీవికి 68వ సినిమా. 1984లో చిరంజీవివి 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు విజయవంతమయ్యాయి.
  • చిరంజీవి - విజయశాంతిల హిట్ కాంబినేషన్ ఈ సినిమాతో మొదలయ్యింది.
  • ఈ సినిమాలో కోట శ్రీనివాసరావుకు మొట్టమొదటి 100 రోజుల షీల్డు లభించింది.
  • సంభాషణల రచనలో తోటపల్లి మధుకి ఇది మొదటి సినిమా. అతనికి 12,500 రూపాయల పారితోషికం లభించింది. తరువాత అతను సుమారు 200 సినిమాలకు మాటలు వ్రాశాడు.
  • సినిమా షూటింగ్ 22 రోజుల్లో పూర్తి చేశారు. మొత్తం ఖర్చు 22 లక్షలంట.

వనరులుసవరించు