అర్ధ శతాబ్దం, ప్రేమ కోసం జరిగే పోరాటంతో పాటు రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన తెలుగు సినిమా.[1][2] ఈ సినిమా ట్రైలర్ ను 2021 జూన్ 2 న హీరో నాని విడుదల చేశాడు.[3] ఈ సినిమాలోని "ఏ కన్నులు చూడనీ" పాటను ఫిబ్రవరి 12న, "మెరిసేలే మెరిసేలే మిలమిల" పాటను 2021 జూన్ 5 న విడుదల చేశారు.[4] సినిమా 2021 జూన్ 11 న ఆహాపై విడుదలయ్యింది.[5]

అర్ధ శతాబ్దం
దర్శకత్వంరవీంద్ర పుల్లే
రచనరవీంద్ర పుల్లే
నిర్మాతచిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ
తారాగణంకార్తీక్ రత్నం
నవీన్ చంద్ర
సాయి కుమార్
కృష్ణ ప్రియ
సుహాస్
పవిత్ర లోకేష్
ఛాయాగ్రహణంవెంకట్‌ ఆర్‌. శాఖమూరి, అష్కర్, ఇ.జె వేణు
కూర్పుజె. ప్రతాప్ కుమార్
సంగీతంనోఫెల్‌ రాజ
నిర్మాణ
సంస్థలు
రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్
విడుదల తేదీ
2021 జూన్ 11
దేశంభారతదేశం
భాషతెలుగు

కృష్ణ (కార్తీక్‌ రత్నం) చదువు పూర్తి చేసి, ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు.ఎప్పటికైనా దుబాయ్‌ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్‌ రామన్న(సాయికుమార్‌) కూతురు చిన్నప్పటి నుంచి తనతో పాటు చదువుకున్న పుష్ప(కృష్ణ ప్రియ)ను ప్రేమిస్తుంటాడు. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. అదే టైంలో 15 రోజుల్లో తనకి దుబాయ్ వెళ్లే అవకాశం వస్తుంది. దాంతో తను వెళ్లే లోపు తన ప్రేమని చెప్పాలనుకుంటాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని ఊర్లో గొడవలకు దారి తీస్తుంది. ఆ తప్పు వలన వారికే తెలియకుండా ఊరిలో కుల గొడవలు చెలరేగి ఒకరిని ఒకరు చంపేసుకుంటుంటారు. అసలు కృష్ణ చేసిన పని ఏంటి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏమిటి ? అనేదే మిగతా సినిమా కథ.[6][7]

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • బ్యానర్ - రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్
  • నిర్మాతలు : చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవీంద్ర పుల్లే
  • కెమెరా: అఖేర్‌, వెంకట్‌ ఆర్‌ శాఖమూరి, ఈజే వేణు
  • సంగీతం: నోఫెల్‌ రాజ
  • పాటలు: రహమాన్ [10]
  • పిఆర్ఓ - సాయి సతీష్
  • పబ్లిసిటీ డిజైనర్ - ధని ఏలె
  • ఎడిటర్ - జె.ప్రతాప్‌ కుమార్‌
  • ఆర్ట్ డైరెక్టర్ - సుమిత్ పటేల్
  • ఫైట్స్ - అంజి మాస్టర్
  • కాస్ట్యూమ్ డిజైనర్ - పూజిత తాడికొండ

మూలాలు

మార్చు
  1. Sakshi (22 March 2021). "ఆహాలో రిలీజవుతోన్న 'అర్ధ శతాబ్దం'". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
  2. Andhrajyothy (16 March 2021). "ఓటీటీలో 'అర్థ శతాబ్దం'". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
  3. Andhrajyothy (2 June 2021). "'అర్ధ శతాబ్దం' ట్రైలర్ విడుద‌ల చేసిన నాని". www.andhrajyothy.com. Archived from the original on 2 June 2021. Retrieved 2 June 2021.
  4. TV9 Telugu, TV9 (5 June 2021). "Ardha Shatabdham Movie: 'అర్థ శతాబ్దం' నుంచి మరో లిరికల్ సాంగ్.. శంకర్ మహదేవన్ గొంతు నుంచి 'మెరిసేలే మెరిసేలే' - meriseyle meriseyle song from karthik ratnam krishna priya movie artha shathabdam". TV9 Telugu. Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Live, Indian News (2021-06-04). "Ardhashathabdam Movie OTT Release Date, Is Ardhashathabdam available on Aha Video? » Indian News Live". Indian News Live (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-05.
  6. Eenadu (11 June 2021). "ArdhaShathabdham review: రివ్యూ: అర్ధశతాబ్దం - karthik rathnam and naveen chandra starer ardha shathabdham telugu movie review". www.eenadu.net. Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
  7. The New Indian Express (12 June 2021). "'Ardha Shathabdam' movie review: Amateur making casts a shadow over this well-intentioned misfire". The New Indian Express. Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
  8. Namasthe Telangana (3 July 2021). "ఇన్‌స్టా ప్రియ!". Namasthe Telangana. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  9. HMTV (25 December 2020). "'అర్ధ శతాబ్దం' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా 'నవీన్ చంద్ర' లుక్ అదిరింది!". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
  10. Eenadu. "Ardhashathabdam: రంగులద్దుకున్న సందెపొద్దులాగా." EENADU. Archived from the original on 31 May 2021. Retrieved 31 May 2021.