అలీఫ్ లైలా
అలీఫ్ లైలా (One Thousand and One Nights ; అరబ్బీ كتاب ألف ليلة وليلة - కితాబ్ 'అల్ఫ్ లైలా వ-లైలా; పర్షియన్ هزار و یک شب - హజార్-ఒ ఏక్ షబ్), అనేక వందల సంవత్సరాలనుండి ఎందరో రచయితల ద్వారా వ్రాయబడిన కథల సమాహారము. దీనిని ప్రపంచంలోని పలు దేశాలలో, పలుభాషలలోకి తర్జుమా చేశారు. ఈ కథలకు మూలం ప్రాచీన అరేబియా, యెమన్, ప్రాచీన భారత ఉపఖండ చరిత్ర, ప్రాచీన పర్షియా, సస్సనిద్ ల కాలంలోని హజార్ అఫ్సానా, ఈజిప్టు, ఇరాక్, సిరియా మధ్య అరేబియా, ఖలీఫాల కాలంలో ఈ కథలు ప్రాచుర్యం పొందాయి.
ఈ కథలన్నింటా సార్వత్రికంగా కనిపించే ఇతివృత్తమేమంటే, 'షెహ్ర్ యార్' (شهريار) సాధారణ అర్థం 'రాజు', తన భార్య 'షెహ్ర్ జాదీ' (شهرزاده), సాధారణ అర్థం 'రాణి', వీరిద్దరూ ప్రతి కథలోనూ దర్శనమిస్తారు (తెలుగు భేతాళ కథలలో విక్రమార్కుడు, భేతాళుడు లా). ఇందులో 'వెయ్యిన్నొక్క' కథలున్నాయి. ప్రతి రాత్రీ ఓ కథ చెబితే వెయ్యిన్నొక్క రాత్రులు గడచి పోతాయి. ఈ అలీఫ్ లైలా కథలలో బాగా ప్రాచుర్యం పొందినవి, అల్లావుద్దీన్ అద్భుత దీపం, అలీబాబా నలభైదొంగలు, సింద్ బాద్ సాహసయాత్రలు.

సంక్షిప్తము సవరించు
ఈ కథామాలికలో రాజు షెహ్ర్ యార్ కు రాణి షెహ్ర్ జాది, ప్రతీ రాత్రీ ఓ క్రొత్త కథను చెప్పడం ప్రారంభిస్తుంది. ఇలా 1,001 కథలౌతాయి. ఈ కథలలో: చారిత్రక గాథలు, ప్రేమగాధలు, విషాదాంతాలు, హాస్యరస పూరితాలు, పద్యాలు, ధార్మిక పరమైన గాథలు వగైరాలు ఉన్నాయి. ఈ కథలలో జిన్నుల కథలు, మంత్రతంత్రాల కథలు, ప్రాముఖ్యంగల ప్రదేశాల గాథలు, సాంస్కృతిక చరితలు, భౌగోళిక ప్రదేశాలు, ప్రజల గాథలు ఉన్నాయి. ఖలీఫా యైన హారూన్ అల్-రషీద్ అతని ఆస్థాన కవి అబూ నువాస్, మంత్రి జాఫర్ అల్ బర్మకీ ల గాథలు సర్వసాధారణం. కొన్ని సార్లు అయితే షెహ్ర్ జాది, తన స్వీయ గాథలనే కథలుగా అల్లి చెప్పేది.
చరిత్ర , కూర్పులు సవరించు
ప్రారంభ ప్రభావాలు సవరించు
ఈ కథలు భారత్, పర్షియన్, ఈజిప్టు,, అరబ్బుల సంస్కృతి, కథలు చెప్పే రీతి రివాజులు కనబడతాయి.[1] చాలా కథలు భారత జానపద కథల, గాథలలా ఉన్నాయి.[2][3] ఈ కథలు చెప్పే విధానంలో ప్రముఖంగా మూడు విధానాలు కనబడుతాయి, ఈ విధానం 15వ శతాబ్దంలో సాధారణం.[1]
- భారత కథా విధానాలతో ప్రభావితమైన పర్షియన్ కథలు, అరబ్బులు 10వ శతాబ్దంలో అనువదించారు.
- 10వ శతాబ్దంలో బాగ్దాదులో వ్రాయబడ్డవి.
- మధ్యయుగపు ఈజిప్షియన్ సంస్కృతి, జానపద కథలు.
కాల పట్టిక సవరించు
పండితులు, ఈ అలీఫ్ లైలా, లేదా 'వెయ్యిన్నొక్క రాత్రులు' కథామాలికల చారిత్రక కాల పట్టికలను తయారు చేశారు.[4][5]
- 1948 లో 'నబియా అబ్బోత్' అనే పండితుడు 800ల కాలంనాటి అతి ప్రాచీన అరబ్బీ చేతి వ్రాత ప్రతులను సిరియాలో సేకరించాడు.
- 900 సా.శ. — బాగ్దాదు లోని ఇబ్న్ అల్-నదీమ్ తన పుస్తకాల పట్టికలో ఈ అలీఫ్ లైలా, గురించి నమోదు చేశాడు. దీనిలో ఈ పుస్తకం గురించీ దీని చరిత్రగురించీ, పర్షియా సాహిత్యం గురించీ వివరించాడు.
- 900 — అల్ మసూదీ రచించిన 'మురుజ్ అల్-జహాబ్' (బంగారు పచ్చికలు) లో అలీఫ్ లైలా గురించి చర్చించాడు.
- 1000 సా.శ.— ఖత్రాన్ తబ్రేజీ తన పర్షియన్ కవితలలో అలీఫ్ లైలా గురించి చర్చించాడు.:
هزار ره صفت هفت خوان و رويين دژ
فرو شنيدم و خواندم من از هزار افسان
రూయిన్ దేజ్, హఫ్త్ ఖాన్ ల ద్వారా, వేయి సార్లు
నేను 'హజార్ అఫ్సాన్' గూర్చి చదివాను.
- 1300 — పారిస్ లోని బిబ్లియోథెక్ నేషనల్ లో సిరియన్ వ్రాతప్రతి ఉన్నది, ఇందులో అలీఫ్ లైలాకు చెందిన 300 కథలు ఉన్నాయి.
- 1704 — ఫ్రెంచ్ భాషలోకి అలీఫ్ లైలా కథలను 'ఆంటొఇనే గెల్లాండ్' అనునతను తర్జుమా చేశాడు.
- 1706 — అలీఫ్ లైలాను ఐరోపా లోని ఇంగ్లీష్ లోకి 'గ్రబ్ స్ట్రీట్' అనునతను అనువదించాడు.
- 1775 — ఈజిప్టు ప్రతి అయిన "జేర్"లో అలీఫ్ లైలా తర్జుమా చేయబడింది.
- 1814 — కలకత్తా లో, మొట్టమొదటి అరబ్బీ ముద్రణా ప్రతి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చే ముద్రింపబడింది. రెండవ సంపుటము 1818లో జారీ చేసారు. ఇందులోని ప్రతి ముద్రణలో 100 కథలుండేవి.
- 1825-1838 — బ్రెస్లా/హబీచ్ ఎడిషన్, అరబ్బీ లో ముద్రణ జరిగినది, ఇది 8 సంపుటాలలో ఉంది.
- 1842-1843 — నాలుగు అనుబంధ సంపుటాలు, హబీచ్.
- 1835 బులాఖ ప్రతి — రెండు సంపుటాలు, ఈజిప్టు ప్రభుత్వంచే ముద్రింపబడినవి.
- 1839-1842 — కలకత్తా II (4 సంపుటాలు) ముద్రింపబడినవి. హబీచ్ ప్రతులు. ప్రాచీన ఈజిప్టు వ్రాతప్రతులు.
- 1838 — టోరెన్స్ ప్రతి, ఆంగ్లములో.
- 1838-1840 — ఎడ్వర్డ్ విలియం లేన్, ఆంగ్ల తర్జుమాను ముద్రించాడు.
- 1882-1884 — జాన్ పేనీ కలకత్తానుండి తర్జుమాచేసి, ఇంగ్లీషు ప్రతిని ముద్రించాడు.
- 1885-1888 — రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్, ఆంగ్ల తర్జుమాను ముద్రించాడు.
- 1889-1904 — జే.సి. మార్ద్రుస్, ఫ్రెంచ్ వెర్షన్ ను, బులాఖ్ , కలకత్తా ప్రతుల ఆధారంగా ముద్రించాడు.
- 1984 — ముహ్సిన్ మెహ్దీ అరబ్బీ తర్జుమాను, ప్రాచీన అరబ్బీ భాషలో ముద్రించాడు.
- 1990s — హుసేన్ హద్దావే, మెహ్దీ రచనను, ఆంగ్లంలో తర్జుమా చేసి ముద్రించాడు.
ప్రపంచ సంస్కృతిలో అలీఫ్ లైలా సవరించు
సాహిత్యం సవరించు
దీని వివిధరకాల ప్రతుల ప్రభావం, ప్రపంచ సాహిత్యంలో అమితంగా కనపడుతుంది. రచయితలైన హెన్రీ ఫీల్డింగ్ నుండి నగీబ్ మెహఫూజ్ వరకు తమ సాహిత్యాలలో దీనిని ప్రముఖంగా ఉపయోగించారు.
దీని ప్రభావాల ఉదాహరణలు:
- ఎడ్గార్ అల్లెన్ పో "వెయ్యిన్ని రెండు రాత్రులు" (Thousand and Second Night) రచించాడు. ఈ అదనపు కథలో సింద్ బాద్ తన 8వ, ఆఖరి సాహసయాత్ర చేపడతాడు.
- బిల్ విల్లింగ్ హాం, తన హాస్య రచన "ఫేబుల్స్"లో ఈ వెయ్యిన్నొక్క రాత్రులను ఉపయోగించాడు.
- నఖీబ్ మహ్ ఫూజ్ తన నవలలలో 'వెయ్యిన్నొక్క రాత్రుల'ను "అరేబియన్ రాత్రులు , పగళ్ళు" అనే పేరుతో వ్రాశాడు. గీతా హరిహరణ్ తన నవల "కలలు ప్రయాణించినపుడు" (When Dreams Travel) ను రచించాడు.
- ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ తన కవిత "రీకలెక్షన్ ఆఫ్ ద అరేబియన్ నైట్స్" ("Recollections of the Arabian Nights") (1830) లోనూ,, విలియం వర్డ్స్ వర్త్ తన "ద ప్రెల్యూడ్" (1805) లోనూ ఉపయోగించాడు.
- 'జార్జి లూయిస్ బోర్గ్స్' తన అనేక రచనలలో వీటిని ఉపయోగించాడు.
సినిమా , టీ.వీ. సవరించు
అలీఫ్ లైలా కథల ఆధారంగా ఎన్నో సినిమాలు, టీ.వీ. సీరియళ్ళు నిర్మింపబడ్డాయి. సినిమాలు:
- బాగ్దాద్ దొంగలు (తెలుగు) (ఇంగ్లీషు)
- అలీబాబా నలభై దొంగలు (తెలుగు)
- ఆలీబాబా 40 దొంగలు (1940 సినిమా)
- ఆలీబాబా 40 దొంగలు (1956 సినిమా)
- అల్లావుద్దీన్ (1957)
- ఆలీబాబా 40 దొంగలు (1970 సినిమా)
- ఆలీబాబా అద్భుతదీపం
- అల్లావుద్దీన్ అత్భుతదీపం (తెలుగు) (ఇంగ్లీషు)
- ఆలీబాబా అరడజనుదొంగలు
- సింద్ బాద్ సాహసయాత్రలు (ఇంగ్లీషు)
టీ.వీ. సీరియళ్ళు:
- అలీఫ్ లైలా (హిందీ)
సంగీతం సవరించు
- 1888,లో రష్యన్ కంపోజర్ నికొలాయ్ రిమ్స్కీ-కొరాస్కోవ్, అలీఫ్ లైలా కథల ఆధారంగా సంగీతాన్ని సమకూర్చాడు. నాలుగు సంగీత గమనాలను నాలుగు కథలైన 'సింద్ బాద్, నౌక', 'ఖలందర్ యువరాజు', 'యువరాజు-యువరాణి', 'బాగ్దాదులో పండుగ', ల ఆధారంగా సమకూర్చాడు.
- ఇంకనూ ఎన్నో సంగీత లహరులు, ఒపేరాలు,, 'చిన్ చౌ', 'కిస్మత్' లాంటి సంగీత ఝరులు 'అలావుద్దీన్' కథలకొరకు తయారు చేశారు.
ఆటలు సవరించు
- ఎన్నో ఆటలూ ప్రవేశ పెట్ట బడ్డాయి, ఉదాహరణ కంప్యూటర్ గేమ్ అయిన 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా', 'అలాదీన్' లాంటి ఆటలు వచ్చాయి.
నోట్స్ సవరించు
- ↑ 1.0 1.1 Zipes, Jack David; Burton, Richard Francis (1991). The Arabian Nights: The Marvels and Wonders of the Thousand and One Nights pg 585. Signet Classic
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Grimm
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Jewish sources
- ↑ Dwight Reynolds. "The Thousand and One Nights: A History of the Text and its Reception." The Cambridge History of Arabic Literature: Arabic Literature in the Post-Classical Period. Cambridge UP, 2006.
- ↑ Irwin, Robert. The Arabian Nights: A Companion. Tauris Parke, 2004.
ఇవీ చూడండి సవరించు
బయటి లింకులు సవరించు
మూలాలు సవరించు
- Encyclopedia Iranica, "ALF LAYLA WA LAYLA (One thousand nights and one night) Ch. Pellat
- Encyclopedia Iranica, "HAZARAFSANA"(A Thousand Stories)
- The Thousand Nights and a Night in several classic translations, including unexpurgated version by Sir Richard Francis Burton, and John Payne translation, with additional material.
- Stories From One Thousand and One Nights, (Lane and Poole translation): Project Bartleby edition
- The Arabian Nights (includes illustrated Lang and (expurgated) Burton translations), presented by the Electronic Literature Foundation
- Jonathan Scott translation of Arabian Nights
- Notes on the influences and context of the Thousand and One Nights* by John Crocker
- (expurgated) Sir Richard Burton's 1885 translation, annotated for English study.
- The Arabian Nights by Andrew Lang, available at Project Gutenberg.
- "The Thousand-And-Second Tale of Scheherazade" by Edgar Allan Poe (Wikisource)
- Arabian Nights Six full-color plates of illustrations from the 1001 Nights which are in the public domain
- DFDS Seaways Themed Arabian Nights Short Breaks
- మూస:Ar icon The Tales in Arabic on Wikisource
సినిమా టీ.వీ. లింకులు సవరించు
- Arabian Nights (1942) IMDb
- Arabian Nights (Miniseries) Official website
- Il Fiore delle mille e una notte (1974) IMDb
- Sinbad: Legend of the Seven Seas Official website
- Arabian Fantasy Arabian
పుస్తక లింకులు సవరించు
ఆటల లింకులు సవరించు
- Night Sky Games Archived 2007-06-23 at the Wayback Machine publisher of 1,001 Nights by Meguey Baker
Nights filmography: 1907-2000