అల్లరి అల్లుడు
అల్లరి అల్లుడు 1993 లో ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, నగ్మా, వాణిశ్రీ, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు.
అల్లరి అల్లుడు | |
---|---|
దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
రచన | తోటపల్లి మధు (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | ఎ. కోదండరామిరెడ్డి |
కథ | తోటపల్లి మధు |
నిర్మాత | డి.శివప్రసాద్ రెడ్డి |
తారాగణం | అక్కినేని నాగార్జున, నగ్మా, మీనా, వాణిశ్రీ, రావుగోపాలరావు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | రసూల్ |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1993 |
సినిమా నిడివి | 158 నిమిషాలు |
భాష | తెలుగు |
కథ
మార్చుఅఖిలాండేశ్వరి ఒక ధనవంతురాలు. భర్తను కూడా లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటుంది. తమ సంపద గురించి అందరి దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె తమ్ముడు గోముఖం ఆమె వడ్డీ వ్యాపారంలో సహకరిస్తుంటాడు. ఆమె కూతుర్లు శ్రావణి, సంధ్య. శ్రావణి తల్లి లాగా గర్విష్టి. సంధ్య గర్వంతో మిడిసిపడే తల్లికి ఎప్పుడూ ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. కల్యాణ్ తను చదివిన కళాశాలలోనే క్యాంటీన్ నడుపుతూ ఉంటాడు. అతని సహాయకుడు జీవా. తన క్యాంటీన్ కి వచ్చి బిల్లు చెల్లించకుండా వెళుతున్న శ్రావణిని అందరు చూస్తుండగా పిండి రుబ్బిస్తాడు కల్యాణ్. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా శ్రావణి కల్యాణ్ ని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది. కళాశాలలో మరుగుదొడ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు మిఠాయిల్లో మందు కలిపి వారిని ఆసుపత్రి పాలు చేస్తుంది. కల్యాణ్ ను పోలీసులు అరెస్టు చేస్తారు.
పెళ్ళి సంబంధానికి వచ్చిన తమని అవమానించిందన్న కోపంతో ఎక్కడికే వెళ్ళి వస్తున్న అఖిలాండేశ్వరిని ధనరాజ్ అనే వ్యక్తి, అతని మనుషులు చంపబోతే కల్యాణ్ వచ్చి కాపాడతాడు. ఆమెను కాపాడిన వంకతో కల్యాణ్ ఆమె ఇంట్లోనే మేనేజరుగా స్థిరపడతాడు. సంధ్య అతనితో బాగా కలిసిపోతుంది.
తారాగణం
మార్చు- కల్యాణ్ గా నాగార్జున
- శ్రావణి గా నగ్మా
- సంధ్య గా మీనా
- అయ్యలరాజు అఖిలాండేశ్వరి గా వాణిశ్రీ
- గోముఖం గా కోట శ్రీనివాసరావు
- జీవా గా బ్రహ్మానందం
- బాబు మోహన్
- ధనరాజ్ గా చలపతి రావు
- సంగీత
- సుత్తివేలు
- రాళ్ళపల్లి
- నాయరు గా చిడతల అప్పారావు
- గుండు హనుమంతరావు
- కె. కె. శర్మ
- చిట్టిబాబు
- రమ్యకృష్ణ (ప్రత్యేక నృత్యం)
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఎ.కోదండరామిరెడ్డీ
స్క్రీన్ ప్లే: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
నిర్మాణ సంస్థ.కామాక్షి మూవీస్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రమణ
మాటలు: తోటపల్లి మధు
ఫోటోగ్రఫి: రసూల్
కూర్పు: శ్రీకర ప్రసాద్
విడుదల:1993 అక్టోబర్ 6 .
పాటలు
మార్చు- నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన: వేటూరి సుందరరామమూర్తి
- కమ్మని జత కమ్మని ఒడినిమ్మని పిలిచావే , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన:వేటూరి
- మచిలీపట్నం మాయాబజార్ మ్యాట్నీకొస్తే మాటేశా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, బి రమణ, రచన:వేటూరి
- రైక చూస్తే, రాజమండ్రి, పైట చూస్తే, పాలకొల్లు , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన:వేటూరి
- ఒక్కసారే, వన్సుమోరే, ఒప్పుకోవే, సరే, సరే , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన: వేటూరి
- చలో నా చక్కెర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన: వేటూరి
- తొడ తొక్కిడి తోట, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర, రచన:వేటూరి
- నమోస్తుతే కామాక్షి కాంచీపుర వాసిని ,(పద్యం), గానం.రమణ.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.