అంతరంగాలు (ధారావాహిక)

అంతరంగాలు ఈటీవీలో చాలాకాలం జనరంజకంగా కొనసాగిన తెలుగు ధారావాహిక. దీనికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, బొమ్మలు, దర్శకత్వ పర్యవేక్షణ చెరుకూరి సుమన్. దీనిని రామోజీరావు నిర్మించగా అక్కినేని వినయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందుకోసం సాలూరు వాసూరావు సంగీతాన్ని అందించంగా మాధవపెద్ది సురేష్ రీ-రికార్డింగ్ చేశారు.

అంతరంగాలు (ధారావాహిక)
Antharangalu serial.jpg
తారాగణంశరత్ బాబు
కల్పన
కిన్నెర
మీనాకుమారి
సాక్షి రంగారావు
అచ్యుత్
టైటిల్ సాంగ్ కంపోజర్సాలూరి వాసు రావు
ఓపెనింగ్ థీమ్"అంతరంగాలు"
by ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మూల కేంద్రమైన దేశంభారతదేశం
వాస్తవ భాషలుతెలుగు
నిర్మాణం
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలురామోజీరావు
ప్రదేశములుహైదరాబాద్ (filming location)
మొత్తం కాల వ్యవధి20–22 minutes (per episode)
ప్రొడక్షన్ సంస్థ(లు)ఈనాడు టెలివిజన్
ప్రసారం
వాస్తవ ప్రసార ఛానల్ఈటీవీ

నటీనటులుసవరించు

పాటసవరించు

అంతరంగాలు అనంత మానస చదరంగాలు
అంతే ఎరగని ఆలోచనల సాగరాలు
ఇది మదినదిలో నలిగే భావతరంగాలు
బాధ్యతల నడుమ బందీ అయిన అనురాగాలు

దీనిని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.[1]

అవార్డులుసవరించు

అంతరంగాలు ధారావాహిక 1998 సంవత్సరానికి గాను 5 నంది పురస్కారాలు గెలుచుకున్నది:[2]

  • ఉత్తమ టీవీ మెగా సీరియల్
  • ఉత్తమ నటుడు - శరత్ బాబు
  • ఉత్తమ పాటల రచయిత (ఎంత గొప్పది బ్రతుకు మీద ఆశ - చెరుకూరి సుమన్)
  • ఉత్తమ సంగీత దర్శకుడు - సాలూరు వాసురావు
  • ఉత్తమ నేపథ్య గాయని - (గుండెకీ సవ్వడెందుకు, పెదవులకీ వణుకెందుకు, పరువానికీ పరుగెందుకు, తనువుకీ తపనెందుకు - సునీత)

మూలాలుసవరించు