అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా

(అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా నుండి దారిమార్పు చెందింది)

అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున మలక్ పేట శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[3]

అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ
In office
2009–2014
అంతకు ముందు వారుమల్‌రెడ్డి రంగారెడ్డి[1]
నియోజకవర్గంమలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ
In office
2014–ప్రస్తుతం
నియోజకవర్గంమలక్‌పేట్
వ్యక్తిగత వివరాలు
జననం (1967-10-22) 1967 అక్టోబరు 22 (వయసు 56)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతదేశం
రాజకీయ పార్టీఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
తల్లిదండ్రులుఅబ్దుల్లా బిన్ అహ్మద్ బలాలా - హుమేరా సుల్తానా[2]
నివాసంపత్తర్‌గట్టి, హైదరాబాదు[2]
కళాశాలసెయింట్ పాల్స్ హైస్కూల్ (హైదరాబాద్) [2]
వృత్తిరాజకీయ నాయకుడు

జననం, విద్యాభ్యాసం మార్చు

అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా 1967, అక్టోబరు 22న అబ్దుల్లా బిన్ అహ్మద్ బలాలా - హుమేరా సుల్తానా దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. హిమాయత్ నగర్ లోని సెయింట్ పాల్స్ హైస్కూల్ నుండి పదవ తరగతి పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలాకు షహనాజ్ సుల్తానాతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు మార్చు

బలాలా 2009లో ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ టిక్కెట్‌పై మలక్‌పేట నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన ముహమ్మద్ ముజఫర్ అలీ ఖాన్‌పై 8,371 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బి. వెంకటరెడ్డిపై 23,268 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[4][5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముజఫర్ ఆలీపై 36,910 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]

ఇతర వివరాలు మార్చు

హాంకాంగ్, మలేషియా, సౌదీ అరేబియా, థాయిలాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు మార్చు

  1. "Constituency Wise Results – Andhra Pradesh (2004)". Rediff. Retrieved 22 April 2017.
  2. 2.0 2.1 2.2 "Ahmed bin Abdullah Balala". My Neta. Retrieved 22 April 2017.
  3. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. "ఎన్నికల ఫలితం 2018: విజేతలు & రన్నర్స్ అప్, అభ్యర్థులు జాబితా - Oneindia Telugu". www.oneindia.com. Retrieved 2021-10-28.
  6. "తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మలక్‌పేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి - Telangana Assembly Election Telugu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.