పిల్లజమీందార్ (2011 సినిమా)

2011 సినిమా

పిల్లజమీందార్ జి. అశోక్ దర్శకత్వంలో 2011 అక్టోబరు 14 న విడుదలైన తెలుగు చిత్రం. నాని, హరిప్రియ ఇందులో ప్రధాన పాత్రధారులు. 2006 లో వచ్చిన కొరియన్ సినిమా ఎ మిలియనీర్స్ ఫస్ట్ లవ్ ఈ చిత్రానికి ప్రేరణ.[1][2] ఈ చిత్రానికి సెల్వగణేష్ సంగీతం అందించాడు. సాయి శ్రీరాం కెమెరా బాధ్యతలు నిర్వర్తించగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ నిర్వహించాడు.

పిల్ల జమీందార్
Pilla Zamindar poster.jpg
దర్శకత్వంజి. అశోక్
నిర్మాతడి. ఎస్. రావు
తారాగణంనాని
హరిప్రియ
బిందు మాధవి
రావు రమేష్
ఎమ్.ఎస్.నారాయణ
తాగుబోతు రమేశ్
వెన్నెల కిశోర్
అవసరాల శ్రీనివాస్
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంసెల్వగణేష్
నిర్మాణ
సంస్థ
శ్రీ శైలేంద్ర సినిమాస్
విడుదల తేదీ
14 అక్టోబర్ 2011
సినిమా నిడివి
147 ని.
భాషతెలుగు

కథసవరించు

ప్రవీణ్ జయరామరాజు అలియాస్ పీజే (నాని) ఒక జమీందారు వంశానికి చెందిన వాడు. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోతే తాతయ్య దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. గారాబం వల్ల ధనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ జల్సాలు చేస్తుంటాడు. కొంత కాలానికి తాతయ్య చనిపోతూ ఒక వీలునామా రాసి తన లాయర్ శరత్ చంద్ర (డా. శివప్రసాద్) కు ఇచ్చి చనిపోతాడు. ఆ వీలునామా ప్రకారం డిగ్రీ పూర్తి చేసిన తరువాతనే అతని తాతయ్య ఆస్తి అతనికి దక్కుతుంది. అది కూడా సిటీలో కళాశాలలో కాకుండా ఎక్కడో దూరంగా సౌకర్యాలు సరిగా లేని సిరిపురం అనే ఊర్లోని ప్రభుత్వ కళాశాలలో మాత్రమే పూర్తి చేయాలని షరతులు విధిస్తాడు.

ఆస్తి మీద ఆశతో అయిష్టంగా ఆ కళాశాలలో చేరడానికి వెళతాడు పీజే. లాయర్ శరచ్చంద్ర సలహా మేరకు అక్కడ కళాశాల ప్రిన్సిపల్ రాజన్న (రావు రమేష్) ని కలుసుకుంటాడు. రాజన్న మంచి క్రమశిక్షణ గల మనిషి. అక్కడ హాస్టల్ కి వార్డెన్ కూడా ఆయనే. ఆయన పెట్టే షరతులేమీ పీజేకు రుచించవు. అయినా సరే అక్కడి స్నేహితుల (అవసరాల శ్రీనివాస్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు) సాయంతో ఎలాగోలా పరీక్ష పాసవుతాడు. కానీ అక్కడ డిగ్రీ చదివే మూడేళ్ళలో కనీసం ఒక్క సంవత్సరం అయినా విద్యార్థి నాయకుడిగా ఎన్నికవ్వాలనీ, లేకపోతే తన ఆస్తి తనకు దక్కదని లాయర్ తెలియజేస్తాడు. ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని విద్యార్థులను ఆకట్టుకోవడానికి రికార్డింగ్ డ్యాన్స్ పెట్టిస్తాడు. కానీ ఆ విషయం రాజన్నకు తెలిసి అక్కడ నుంచి వెలి వేస్తాడు. కానీ వెళ్ళిపోయే ముందు పీజే తల్లిదండ్రులను గురించి, వాళ్ళతో తనకున్న ఆత్మీయ అనుబంధం గురించి తెలియజేస్తాడు.

ఆయన మాటలతో పీజేలో మార్పు వస్తుంది. స్నేహితుల సాయంతో గ్రామంలో వారందరినీ ఆకట్టుకోవడానికి రకరకాల సామాజిక కార్యక్రమాలు చేపడతాడు. అందరి అభిమానాన్ని చూరగొని విద్యార్థి యూనియన్ నాయకుడవుతాడు. చివరికి తన ప్రాణ స్నేహితుడికి సాయం చేయడానికి ఆస్తి మొత్తం వదులుకోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు శరశ్చంద్ర వచ్చి తనలో మార్పు తీసుకురావడానికి అతని తాతయ్య తనతో ఆ నాటకం ఆడించాడని తెలుసుకుంటాడు.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి సెల్వగణేష్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇందులో పాత తెలుగు సినిమా అప్పుచేసి పప్పు కూడు సినిమాలోని అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే పాటను రీమిక్స్ చేసి వాడుకున్నారు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."తలబడి"కృష్ణ చైతన్యశంకర్ మహదేవన్4:56
2."చుట్టు చుట్టు"కృష్ణ చైతన్యసైంధవి, ప్రసన్న4:16
3."ఊపిరి"కృష్ణ చైతన్యకార్తీక్, చిన్మయి4:40
4."రంగు రంగు"కృష్ణ చైతన్యముకేష్, ప్రియ హిమేష్4:38
5."పి. జె. క్లబ్ మిక్స్"కృష్ణ చైతన్యరంజిత్, ప్రియ హిమేష్4:34
6."హయ్యయ్యో"శ్రీమణిసోలార్ సాయి3:40

మూలాలుసవరించు

  1. S, Viswanath. "Pilla Zamindar". Deccan Herald. Deccan Herald. Retrieved 1 June 2013.
  2. K.S, Mahesh. "Pilla Zamindar – Amateur Offering". 123telugu.com. 123telugu.com. Retrieved 1 June 2013.