ఆదిమ వాసుల గిరిజన కళా రూపాలు
తెలుగు దేశంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో వున్న ఆదిమ జాతుల గిరిజన నృత్యాలు ఆంధ్ర ప్రజలకు ఏమీ తెలియవు. వారు ఆంధ్ర దేశంలో బ్రతుకుతున్నా అది వారి వారి ప్రాంతాలకే పరిమితమై పోయి వారికి తప్ప ఇతరులకు తెలియకుండా పోయాయి. అందుకు కారణం వారి బ్రతుకంతా అడవులకే పరిమితమై వుండటం ఇతరులతో ఏ విధమైన సంబంధాలు లేక వోవడమే.ఆదివాసీ గిరిజన ప్రజలను పంచమజాతి వారుగా శూద్రుల క్రింద వచ్చే తరువాత వర్ణముగా, అంటరాని వారుగా బ్రాహ్మణ సామజిక కోణం చెప్పుచూ, మానవ మూలం వీరి నుండే ఆవిర్భవించింది అని వివరిస్తుంది.
గిరిజనుల కళా రూపాలు
మార్చుఆంధ్ర దేశంలో అటు రాయల సీమ నుండి ఇటు ఇచ్చాపురం వరకూ అన్ని ప్రదేశాల్లోనూ కలిపి మొత్తం ముప్పై ఎనిమిది గిరిజన జాతులున్నాయనీ, వీరి జనాభా పదమూడు లక్షలనీ, డి.ఆర్. ప్రతాప్ వ్వాసానికి ఆధారంగా నాట్యకళ, జానపద కళల ప్రత్యేక సంచికలో ఉదహరించారు.
ఆంధ్రుల గిరిజన ముఖ్య జాతులు
మార్చుఅదిలాబాదు జిల్లాలో గోండులు, కొలాములు, లంబాడీలు, మధురాలు, పరధానులు, ఆంధ్రుల గిరిజన ముఖ్య జాతులుగా గుర్తించబడ్డాయి. నాయిక పోడులు ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో కనిపిస్తారు. వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల ఏజంసీ ప్రాంతాలలో కోయలు, కొండ రెడ్లు ఎక్కువ. విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాల గొండ ప్రాంతాలలో బగతలు, కొండ దొరలు, వాల్మీకులు, మూల దొరలు, సామంతులు, గదబలు, మమ్మరలు, కోటియాలు ఎక్కువ కనిపిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో జాతపు దొరలు, సవరలూ మాత్రమే కొండ ప్రాంతాల్లో ఉన్నారు. కర్నూలు జిల్లాలోని నల్ల మల అడవులలో నూ, మహబూబ్ నగర్ జిల్లాలోని అమరాబాద్ పీఠభూమి ప్రాంతంలో చెంచులు నివసిస్తున్నారు.
రాష్ట్రంలో అనేక చోట్ల కనిపించే జాతి బంజారాలు, వీరినే సుగాలీలనీ, లంబాడీలనీ, లమ్మానీలు అని కూడా పిసుస్తారు. ఇక ఎరుకలు, యానాదులు మైదాన ప్రదేశాలలోనే నివాసాలు ఎర్పరుచుకున్న వారున్నారు.
గిరిజనులకు సంవత్సరం పొడుగునా వ్యవసాయమే జీవనాథారం. గోండులు, కోయలు, బగతలు, వాల్మీకులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని భూములను సేద్యం చేసుకుంటారు. కొండ రెడ్లూ, కొండ దొరలూ, సామంతులూ సవరలూ నిలకడగా ఒక చోట కాక తమకు తోచిన ప్రదేశాలలో పోయి వ్యవసాయం చేసుకుంటారు.అందువల్ల దీనిని ఈటెల పండుగ అంటారని ఆంధ్ర ప్రభుత్వ గిరిజన సాంస్కృతిక సంస్థవారు (నాట్య కళ జానపద కళల సంచికలో ఉదహరించారు.)
చైత్ర మాసంలో గిరిజనులు చైత్ర పర్వం చేసు కుంటారు. అన్ని తెగల వారూ మహోత్సాహంతో ఉత్సవంలో పాల్గొంటారు. అందరూ ఒక చోట చేరి విందులు చేసు కుంటారు. యువతీ యువకులు ఒళ్ళు తెలియని ఆనందోత్సాహాలతో తెల్ల వార్లూ సంగీత నృత్యాలతో కాలక్షేపం చేస్తారు. అన్ని వయసుల వారూ రోజుల తరబడి అడవులలో గడుపుతూ తృప్తిగా వేటాడతారు. వేట నుంచి రిక్త హస్తాలతో తిరిగి వచ్చేటప్పుడు, పురుషులను స్త్రీలు పరాభవిస్తారు. పర్వ దినాలలో ఒక గ్రామానికి చెందిన వారు మరొక గ్రామానికి వెళ్ళి, దింసా నృత్యంలో పాల్గొంటారు. పర్వ దినాలలోఒక గ్రామంవారు, మరో గ్రామం వారిని ఆహ్వానిస్స్తారు. అలా వచ్చే వారికి విందులు ఏర్పాటు చేస్తారు. ఇలా అందరూ కలిసి నృత్య వినోదాల్ని జరుపు కోవడాన్ని నంకిడి కెల్చారు లేక కిందిరి కెల్చార్ అంటారు. చైత్ర పర్వం ఈ విధంగా వారి మద్య సఖ్యతును పెంపొందిస్తుంది.
దింసా నృత్యం
మార్చుఅరకు లోయలో ప్రసిద్ధమైన నృత్యాలలో దింసా నృత్యం ఒకటి. వృద్ధులూ, యువకులూ, ధనికులూ, పేదలు అనే తేడా లేకుండా, అన్ని వర్గాల వారు దింసా నృత్య కార్యక్రమాలలో పాల్గొంటారు. కష్ట జీవు లైన గిరిజనులకు, ఈ కార్యక్రమాలు అంతు లేని ఆనందానిస్తాయి. దింసా నృత్యం అందరినీ అలరించడమే కాక, గ్రామీణ ప్రజల మధ్య సఖ్యతనూ, సుహృద్భావాన్ని పెంపొందిస్తుంది. దింసా నృత్యాన్ని చైత్ర పర్వం లోనూ, వివాహ సమయం లోనూ, పండుగ పరవ దినాలలోనూ ప్రదర్శిస్తారు. దింసా నృత్యంలో విలక్షణమైన, సంగీత వాయిదాలున్నాయి. తుండి, మోరి, డప్పూ మొదలైన సాంప్రదాయ వాయిద్యాల సహకారంతో లయ బద్ధంగా సాగుతుంది. ఈ నృత్యంలో కళాకారుల్ని ఉత్తేజ పర్చ టానికి మధ్య మధ్య ................. జోడు కొమ్ము బూరలను ఊదుతారు. స్త్రీ పురుషు లందరూ సాంప్రదాయక మైన ఆభరణాలు ధరించి, రంగు రంగుల దుస్తులను అలంక రించుకుని నృత్యానికి హాజరౌతారు. దింసా నృత్యం ఎనిమిది రకాలున్నాయి.
ఇక కోయలు, బగతలు, వాల్మీకులు, కొలాములు, నాయక పోడులు, కోటియాలు, మూఖ దొరలు మిదలైన గిరిజన జాతులు కూడా పోడు వ్యవసాయం ద్వారా, అదనపు ఆదాయాల కోసం ప్రయత్నిస్తారని డి.ఆర్. ప్రతాప్ గారు వ్రాశారు. అలా గిరిజనులు జీవిత విధానలను సాగించుకుంటూ ఆనందం కోసం, సంగీతాన్ని నృత్యాన్ని వాయిద్యాన్నీ జోడించి ఎన్నో కళా రూపాలను సృష్తించుకున్నారు.
గోండుల, కోలాములు గుసాడి నృత్యం
మార్చుఅదిలాబాదు జిల్లా రాజ గోండులకు, గోండు రాజులకు పూజారులగా పిలువబడే. కోలాం కోలాములకు దీపావళి పెద్ద పండుగ. చలికాలం ప్రారంభమయ్యే సరికి పంటలన్నీ చేతికి వచ్చి వుంటాయి. తాము చెమటోడ్చి చేసిన కష్టం, ధాన్యం లక్ష్మిగా నట్టింట చేరి వుంటుండి. గోడు, కోలాం లందరూ ఆట పాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభ మౌతాయి. రకరకాల వస్త్రాభరణాలు వేసుకుని యువజనులు సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు గ్రామాలకు తరలి వెడతారు. కొమ్ములూదుతూ, తప్పెట్లు వాయిస్తూ యాత్రలు సాగిస్తారు. గోడుల ,కొలామ్, దండారియారౌడ్ సిసిసెర్మారౌడ్ జల్ గురు, అనే కథానాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం నృత్యాలు చేస్తారు. గోడు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేరి చేశె దండారీ నృత్యంలో గుసాడి నృత్యం ఒక భాగం. గుసాడి నృత్యంలో ఎందరో పాల్గొన వచ్చు. ధీపావళి నెలలో సాంప్రదాయకమైన ఈ నృత్యం జరుగుతుంది, పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభ మౌతుంది. చతుర్దశి వరకు జరుగుతుంది. గుసాడి నర్తకునికి కావలసిన సామగ్రిలో ముఖ్యమైనది నెమలి పించంతో తయారు చేసిన తలపాగా. ఇదులో గొర్రెపోతు కొమ్ములను కూడా అమర్చు తారు. కృత్రిమ గడ్డాలు మీసాలతో వేషం కడతారు. మేక తోలు కప్పుకుంటారు. ఇక వాయిద్యాలు, డప్పు, తుడుము, పిప్ర, బాక, కలికొయ్ (తప్పెట) మొదలైనవి వాద్య బృందానికి హుషారు నిస్తాయి. సంగీత వాయిద్యాలను, గుసాడి నృత్య పరికరాలను గోండులు ,కొలామ్ లు పరమ పవిత్రంగా భావిస్తారు. నాట్యారంభానికి ముందు వాటికి పూజ చేస్తారు.
దండారి కోలాట నృత్యం
మార్చుమరింత లయ బద్దమూ, క్రమబద్ధమూ అయిన దండారి నృత్యం గుసాడి నృత్యంలో భాగం. దండారి నృత్యం చేస్తున్న బృంధంలోకి గుసాడి బృందం అకస్మాత్తుగా ప్రవేశిస్తారు. గోడు భాషలో గుసాడి అంటే అల్లరి అని అర్థం. దండారి నృత్యం గుమేలా అనేది బుర్రకథ డిక్కి శబ్దాలకు అనుగుణంగా లయ బద్ధమై ఉంటుంది.
వలయాకారంగా చేరే దండారి వృందం లోపలి వైపుకు తిరిగి నిలుచుంటారు. ఎడమ వైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ, అడుగులు వేసి నప్పుడల్లా కుడి పాదాన్ని ఎడమ కాలు మీదికి వూగిస్తుండడంతో నృత్యం ప్రారంభమౌతుంది. ప్రతి నర్తకునికి చేతిలో రెండు కోలాటం కర్రలు వుంటాయి. నర్తకులు తమ చేతుల్లోని రెండు కర్రలను ఒకదానితో మరొక దానిని తాకిస్తారు. తరువాత కుడి వైపున వున్న నర్తకుని కర్రను కొడతారు. ఇలా అడుగులు వేస్తూ కోలాట మాడుతూ నర్తకులందరూ వంగి కర్రలను నేలకి తాకించి నాలౌగు దిక్కులనూ అడుగులు వేస్తారు. దేవతలందరికీ ప్రణమిల్ల డానికి ఇలా నాలుగు దిక్కులకూ అడుగులు వేస్తారు. దేవతలకు మ్రొక్కిన తరువాత వలయాన్ని సరి చేసుకుని కర్రలను పాదాల వద్ద వుంచి, పాటకు అనుగుణంగా చేతులతో చప్పట్లు కొడతారు. ఒక బృందం చరణాన్ని ముగ్తించగానే రెండవ బృందం రెండవ చరణాన్ని అందు కుంటూ బృంద గానం చేస్తారు.[1]
దండారీ నృత్యంలో, గుసాడీల ప్రవేశం
మార్చుపై విధంగా దండారీల నృత్యం కొనసాగు తుందగా నలుగురైదుగురు గుసాడీలు హఠాత్తుగా దండారీల వలయంలోకి చొచ్చుకుని వస్తారు. తలకు నెమలి పించాలను ధరించి, కృత్రిమ గడ్డాలు మీసాలు, సరీరం పై మేక చర్మమూధరించి వచ్చే గుసాడీల చేతుల్లో కర్ర లుంటాయి. మెడలో గవ్వల హారాలూ, తుంగ కాయల హారాలూ వుంటాయి. నడుముకు మణి కట్టుకూ - చిరు గజ్జెలు వుంటాయి. కంటి చుట్టూ తెల్ల రంగు పూసు కుంటారు. మొలకు నారింజ రంగు లంగోటీలు తప్పించితే శరీరం పై మరే ఇతర అచ్ఛాదన ఉండని గుసాడీల వేషం వింతగా వుంటుంది. శరీరం పైన నలుపు చారల చుక్కలతో వింత వింత అలంకరణాలు వుంటాయి. గుసాడీలు ప్రవేశించగానే దండారీలు చెల్లా చెదురౌతారు. ఇది ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది.
సామంతుల మయూర నృత్యం
మార్చుసామంతులు మాత్రమే ఈ మయూర నృత్యం చేస్తారు. సామంతులనే గోండులని కూడా అంటారు. సామంతులు ఎంతో వెనుకబడిన గిరిజనులు. విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలోని దుర్గమ్మ కొండ ప్రాంతపు అడవుల్లో ఈ గిరిజనులు కనిపిస్తారు. సామంతులు తరతరాలుగా కాపడు కొంటూ వస్తున్న సాంస్కృతిక సంపదలో మయూర నృత్యం ఒక భాగం. గోండుల వివాహ సందర్భాలలోనూ, ఏప్రిల్ నెలలో వచ్చే చైత్ర పర్వ దిన సందర్భంలోనూ, సాధారణంగా ఈ మయూరి నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో పిరోడి అనే మురళి కాళ్ళకు కట్టుకునే గజ్జెలు ముఖ్యమైనవి. సామంతులు ఖరీదైన వస్త్రాలంకరణలు జోలికి పోరు. తెల్ల దోవతి కట్టుకుంటారు. నర్తకు లందరూ పాదాలకు గజ్జెలు కట్టుకుంటారు. వీటిని సామంతులు ముయ్యంగా అంటారు. తలకు తోయంగ అనే తలపాగా ధరిస్తారు. తుంగ గడ్డితో చేసిన పొగాకు రంగుల గుడ్డ పేలికలను కుచ్చులుగా కడతారు. నడుము వంచి నప్పుడు పింఛము విప్పిన నెమలి వలె కనిపించేటట్టు నెమలి పింఛముల గుత్తిని నడుముకు వెనుక బిగించు కుంటారు. మొదట నర్తకులందరూ రెండు వరుసలలో నిలుచుంటారు. నోటితో నెమలి అరుపును పోలిన శబ్దం చేస్తారు. వలయా కారంగా నిలిచి నాట్యం చేస్తున్న మయూరం పద్ధతిలో మోకాలిపై ముందుకు వంగుతారు. భూమాతకు సూర్య భగవానుడికి మ్రొక్కి నృత్యం ప్రారంబిస్తారు.
జోడియా
మార్చుఅనే ఈ గిరిజన నృత్యాన్ని కొండ్య మట్టియా, జోడియా అనే జాతుల వాళ్ళు చేస్తారు. ఈ నృత్యాన్ని పులకమ్మ, గంగా దేవి, గసురమ్మ మొదలైన పండుగల సందర్భంగా చేస్తారు. ఇది ఆడ మగ కలిసి చేసే బృంద నృత్యం. పది అడుగుల కర్ర మీద ఇద్దరు నిల్చోగా మిగతా బృందం నాట్యం చేయడం దీని ప్రత్యేకత.
పూల పండ్లు
మార్చుఇది శ్రీకాకుళానికి చెందిన సవర జాతి చేసే గిరిజన నృత్యం. దీన్ని పెళ్ళిళ్ళ సందర్భంలో, దేవీ పూజల సందర్భంగా చేస్తారు. ఇది ఆడ మగ కలిసి చేసేబృంద నృత్యం. కోలాటం కూడా శ్రీకాకుళానికి చెందిన సామంతుల జాతివారు చేసే నృత్యం. ఇది పెళ్ళిళ్ళ సందర్భంగా కేవలం పురుషులు చేసే నృత్యం.
చెంచు నృత్యం
మార్చుమహబూబ్ నగర్కు చెందిన చెంచు జాతి వాళ్ళు, పెళ్ళిళ్ళ సందర్భంగా చేసే నృత్యం ఇది ఆడ మగ కలిసి చేసే నృత్యం.
లంబాడీలు (బంజారాలు)
మార్చులంబాడీలు హోలీ నృత్యం నల్లగొండకు చెందిన లంబాడీ జాతి వారు హోలీ పండుగ సందర్భంలో చేస్తారు. దీన్ని హోలీ లేంగి నృత్యం అని కూడా అంతారు. ఇది స్త్రీ పురుషులు కలిసి చేసే నృత్యం.
ఇది ఖమ్మం జిల్లాకు చెందిన కోయ జాతి వారు విత్తనాలు నాటే సందర్భంలో చేసే నృత్యం. వరి పంట చేతికి వచ్చిన సందర్భంలో చేసే నృత్యం, ఇది కూడా స్త్రీ, పురుషులు కలిసి చేసే నృత్యమే.
లంబాడి నృత్యం
మార్చుదీనిని రంగా రెడ్డి జిల్లాలోని మేడ్చల్ ప్రాంతపు లంబాడీలు చేస్తారు. ఇది పండుగల సందర్భంగా ఆడవాళ్ళు చేసే బృంద నృత్యం. ఈ నృత్యాలను గిరిజనులు చేసేటప్పుడు డప్పు మొదలైన తోలు వాయిద్యాలను బాంసారి కొమ్ము, సన్నాయి మొదలైన వాయిద్యాలూ, కిన్నెర మెట్ల, కిన్నెర, డోలు కామారో ఇత్యాది తీగ వాయిద్యాలు ఎక్కువగా వాడుతారు. అలంకరణ దుస్తులు, సాంప్రదాయ పద్ధతుల్లో వుంటాయి.
కొండ రెడ్ల కళా సంస్కృతి
మార్చుఆంధ్ర దేశంలో ఆయా ప్రదేశాల్లో వున్న కళారూపాలు మాత్రమే వెలుగులో కొచ్చాయి. అలా వెలుగులోకి వచ్చి ప్రచారమై ప్రజల నాకర్షించినవి మాత్రమే మనకు తెలుసు. కానీ ఆంధ్ర దేశంలోనే ఎక్కడో మారు మూల గిరిజన ప్రాంతాల్లో వున్న కళారూపాలు మాత్రం ఆంధ్ర ప్రజల కెవ్వరికీ తెలియకుండా అజ్ఞాతంగానే వుండి పోయాయి. అక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధమే లేదు. ఈ నాగరిక ప్రపంచానికే దూరమైన అజ్ఞాత జీవితాలు వారివి. అమాయక ప్రజలు నిర్మలమైన మనస్సులు, నిష్కల్మష హృదయాలు, మాయమర్మాలు తెలియని వారు. వారూ వారి జీవితం, జీవితానందం కోసం వారి ఆచారాలూ, ఆధ్యాత్మిక చింతనలూ, ఆరాధనలూ, వినోద ప్రదర్శనాలూ, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ ప్రాచీన సంస్కృతిని రక్షిస్తూ మారు మూల కొండల్లో, అడవుల్లో వుంటూ జంతువులతో పాటు వారూ పరిమిత కుటుంబాలుగా బ్రతుకుతున్నారు.
అలా బ్రతికే వారు నాగరికత ప్రపంచానికి అతి దగ్గరగా ఉన్నారు. అలా తూర్పు గోదావరి జిల్లాలో అటు రాజమండ్రి కీ, ఇటు భద్రాచలానికీ\\ దగ్గరగా వున్న మారేడి మిల్లి ...... అడ్డతీగల మొదలైన సమితుల్లో అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. వీరి మాతృ భాష తెలుగే. అయితే కొంచెం యాసగా వుంటుంది. ప్రధానంగా వీరు పోడు వ్యవసాయం చేస్తున్నప్పటికీ వేటాడటం, చెట్లు నరకటం, . చేపలు పట్టటం వీరి జీవనాధారం. చెట్ల వేళ్ళూ ఆకులూ, జీలుగ బెరడూ మామిడి జీడి వీరి ఆహార పదార్థాలు కొండ రెడ్లు పంటలు బాగా పండాలనీ, తమకు వ్వాధులు రాకుండా కాపాడమనీ రక రకాల దేవతలు కొలుస్తారు. వీరి పండుగలలో మామిడి కోత పండుగ, భూదేవి పండుగ, గంగమ్మ దేవత పండుగ ముఖ్యమైనవి. ముత్యాలమ్మ, గంగమ్మ, గంటమ్మ, సారెలమ్మ, పాండవులను వీరు అతి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
మామిడి కోత నృత్యం
మార్చుకొండ రెడ్లకు అత్యంత ప్రీతి కరమైనవి మామిడి పండ్లు. మామిడి పండ్లు ఆ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. మామిడి పండ్లు కోసే ముందు కొండ రెడ్లు ఆనందోత్సవం జరుపు కొంటారు. తప్పెట్ల వాయిద్యాల శబ్దానికి అనుగుణంగా లయ బద్ధమైన నృత్య చేస్తారు. రాత్రి పూట ఈ నృత్యం ప్రారంభ మౌతుంది. మొదట వాయిద్యాలను నెమ్మదిగా మ్రోగిస్తారు. ముగ్గురు నలుగురు స్త్రీలు చెట్టపట్టలు వేసుకుని చేతుల్లో గల గల శబ్దం చేసే ఎండు కాయల గుత్తులను ధరించి నృత్యంలో పాల్గొంటారు.
సామూహిక నృత్యం
మార్చువారు చేసే నృత్యంలో స్త్రీలూ, పురుషులూ ఒకే సారి నృత్యంలో పాల్గొంటారు కాని జంటలుగా కలవరు. రంగ స్థలం చుట్టు ఎడమ చేతి వాలుగా ప్రదక్షిణం చేస్తూ నృత్యం కొనసాగ్తిస్తారు. నృత్యం పతాక సన్నివేశానికి వచ్చినప్పుడు సైతం స్త్రీలు పురుషులూ వేరు వేరుగానే నృత్యం చేస్తారు. స్త్రీలు పాదాన్ని నేలకు తాకించుతూనే నాలుగు అడుగులు ముందుకు వేస్తారు. ఇలా ముందుకు వెళ్ళడం ఒక ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. కుడి పాదాన్ని ఐ మూలగా నాలుగడుగులు ముందుకు వేసి, నొక అడుగు అదే పద్ధతిని వెనక్కు వేస్తారు. వలయాకారంలో చేరి ఒకే సారి అందరూ కేంద్ర స్థానానికి వచ్చి మళ్ళీ పోవడం, చేతులు ఊపుతూ అర చేతుల్లో వున్న గలగల లాడే వాయిద్య విశేషాలతో శబ్దం చేయడం ఈ నృత్యానికి హంగును చేకూర్చుతుంది. కాళ్ళను ఎడంగా వుంచి కుడి పాదం మీద అదేలా దూకడం, అటు తర్వాత కుడి పాదం వెనక్కూ ఎడం పాదం ముందుకూ వచ్చేటట్టు మరో గెంతు గెంటడం కూడా ఒక విశిష్టమైన నర్తన విధానం.
పురుషుల నృత్యం
మార్చుపురుషుడు అడుగులు చేసే పద్ధతి స్త్రీల కంటే భిన్నంగావుంటుంది. నాట్యం చేస్తున్న బృందంతో పాటు వాద్య కారులు ప్రక్కగా వెంట వెంటనే ముందుకు అడుగులు వేస్తారు. ప్రారంభంలో మట్టుకు వాయిద్యాలను పట్టు కున్న కళాకారులు రంగ స్థలం మధ్య కనిపిస్తారు. అడుగు ముందుకు వేసేటప్పుడు మొదటి కుడి పాదం వేసి ఆ తరువాత ఎడమ పాదాన్ని కుడి పాదం మడమ దాకా ముందుకు తీసుకు వస్తారు. ఆ విధఆంగా మళ్ళీ కుడి పాదంతో అడుగు వేయడానికీ వీలు కలుగు తుంది. ఈ నృత్యం వాయించే రెండు రకాల చర్మ వాద్యాలూ అడుగులు వేసే టప్పుడు లయ బద్ధంగా చేయడానికి తోడ్పడుతాయి. వాయిద్యాలను మరింత వేగంగా వాయించిన కొలది నాట్యంలో ఉత్సాహం కూడా పెరిగి మరింత చురుకుగా సాగుతుంది. అర్థ రాతి లోగా విందులు ముగించి, స్త్రీలూ, పురుషులూ పిల్లలూ మళ్ళీ నృత్యం ప్రారంభిస్తారు. ముత్యాలమ్మనూ, కొండ దేవతలనూ ఆహ్వానిస్తూ సుదీర్ఘమైన పాటలు పాడుతారు. కొండ రెడ్లకు ఈ పాట ఎంతో ఉత్సాహాన్నీ ఉద్వేగాన్ని కలిగిస్తుంది. సన్నివేసం పతాక స్థాయిని అందుకునే సమయానికి పాట పూర్తి అవుతుంది. ఉదయం పది గంటల వరకూ, అలసట వచ్చేంత వరకూ నృత్యం చేసి ఎవరికి వారు వెళ్ళి పోతారు. గ్రామ మంతా నిశ్శబ్దమై పోతుంది.
మూడ నమ్మకాలు
మార్చువ్యాధులూ, మరణమూ, వృద్ధాప్యం మొదలైనవి, దైవానుగ్రహం, చేతబడి, మంత్ర తంత్రాలవల్ల వస్తాయని వీరికి గట్టి నమ్మకం. అందుకే జంతువులను విపరీతంగా దేవతలకు బలి ఇస్తారు. వీరిలో నిర్బంధంగా స్రీని ఎత్తుకు వచ్చి వివాహం చేసుకునే పద్ధతి ఇప్పటికీ ఉంది. పెళ్ళిళ్ళకు స్త్రీ పురుషులు సాంప్రదాయ నృత్యగానాలు చేస్తారు. రాజులు పండుగా, గంగాలమ్మ పండుగా, గూపెమ్మ కొలువులలో వీరు దేవతలను ఆహ్వానిస్తూ నాట్య చేస్తారు. రాజుల పండుగల్లో వారు పాండవులను ఆహ్వానిస్తారు.
రాజుల పండుగలో లేలేలేల లేలెమ్మరో ఓ లేల లేలేలేల లేలెమారో ఓ లేల అన్న రీతీలోనూ పెళ్ళిళ్ళలో
....లచ్చు కొడలయ్య కోడలా, లచ్చీర బాల కోడలా....అన్న పాటను వీరు పాడతారు. వీరి జీవితంలో మాట కంటే పాటే ప్రధానం. గంగాలమ్మ పండగలో ఓ అత్త కోడలిని ఇలా అంటుంది.
గైరికీ పిట్ట కన్నుల దానా కోడలా, కోడలమ్మా, కారు పంది ముక్కు దానా కోడలా, కోడలమ్మ అని పరిహసిస్తుంది
అరకు లోయలో, ఆదిమవాసుల నృత్యాలు
మార్చుమన ప్రాచీన సంగీత నృత్యాలు రూపు మాసి పోకుండా కాపాడిన ఖ్యాతి జానపదులకు దక్కుతుంది. భారతీయ సంస్కృతిలో జానపద నృత్యం అత్యంత ముఖ్య మైనది.
- రమణీయ ప్రకృతి
అరకు లోయ రమణీయ మైన ప్రకృతికి నిలయం. విశాఖపట్నం జిల్లాలో సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తున వున్న ప్రాంత మిది. సంవత్సర కాలంలో ఎక్కువ కాల వాతా వరణం ఆహ్లాద కరంగా చల్లగా వుంటుంది. అనుకూల వాతావరణం వల్ల కాఫీ తోడలు, నారింజ తోటలు ఏపుగా పెరుగుతాయి. రకరాకల కూరగాయలు పండిస్తారు. అనేక గిరిజన జాతులు అరకు లోయ అంతటా కనిపిస్తారు. వీరందరూ ఆంధ్రదేసంలో వున్న ఎక్కువ మంది ఒరియా భాషను మాట్లాడుతారు. అయితే వీరు మాట్లాడే భాష స్వచ్ఛమైన ఒరియా భాష కాదు. వీరిలో వాల్మీకి బగట, బోండ్, కోటియా ప్రధానమైన గిరిజన జాతులు.
ఈటెల పండగ
మార్చుఅరకు లోయలో అత్యంత ప్రధానమైన ఆనందోత్సవం, చైత్ర మాసంలో జరుగుతుంది. చైత్ర పర్వం, లేక ఏటెల పండుగ సందర్భంగా ఈ ఆనందోత్సవం జరుగుతుంది. పండుగ రోజుల్లో పురుషులు ఈటెల తోనూ, విల్లంబులతోనూ జంతువులను వేటాడుతారు.
బోడె దింసా
మార్చుబోడె అంటె ఘనమైనదని అర్థం. గ్రామ దేవత అయిన నిసాని దేవత పూజ సమయంలో ఈ నృత్యం చేస్తారు. కనుక దీనిని బోడె దింసా అంటారు. అన్ని వాయిద్యాలూ వుధృతంగా వాయిస్తూ వుండగా ఈ నృత్యం ప్రారంభ మౌతుంది. కుడివైపున పురుషులూ, ఎడమ వైపున స్త్రీలూ వరుసగా నిలుస్తారు. వీపుమీద ఒకరి చేతులు మరొకరు దృఢంగా పట్టుకుంటారు. వరుసలో కుడి వైపున మొదటి నిలిచే వ్వక్తి కథా నాయకుడు, నెమలి ఈకల పించాన్ని పట్తుకుని లయ బద్ధంగా అడుగులు వేస్తూ, నృత్యాన్ని నిర్వహిస్తాడు. అలాగే ఎడమ వైపు చివర నుండే వ్వక్తి కూడా కథానాయకుడికి తోడుగా నృత్యాన్ని నిర్వహిస్తాడు. అందరూ వర్తులాకారంగా తిరుగుతూ ................... మధ్య మధ్య, హుషారుగా, హేయ్, హేయ్, హోయ్, హోయ్ అంటూ ఆనందంగా కేరింతలు కొడుతూ, చివరికి బారుగా నిలుచున్న స్థితికి చేరుకుంటారు.
గుండేరి దింసా
మార్చుగుండేరి ఒక స్త్రీ పేరు. ఈ నృత్యంలో పాల్గొనే పురుషుడు తనతో కలసి అడుగు వేయవలసిందిగా ఒక పాట రూపంలో, మహిళా బృందాన్ని ఆహ్వానిస్తాడు. అందు వల్లనే ఈ నృత్యాన్ని గుండేరి నృత్యం అంటారు. ఈ నృత్యంలో వెనకకూ ముందుకూ దృఢంగా అడుగులు వేస్తూ కదం త్రొక్కుతూ గుండ్రంగా తిరుగుతారు. ఉత్సాహ ఉద్వేగాలతో చేసే నృత్య మిది ....... అలాగే ఒరియాలో గొడ్డిబేట నృత్యముంది. గొడ్డి అంటే చిన్న రాళ్ళు. బేట అంటే ఏరుట అనే అర్థం. ఈ నృత్యంలో గిరిజన బృందాలు, రాళ్ళను ఏరు తున్నట్టుగా తలను దించుతూ, పై కెత్తుతూ నర్తిస్తారు. మంచి వూపుతో ముందుకు వంగుతూ లేస్తూ పాతిక అడుగులు ముందుకు సాగి, అదే పద్ధతిలో వెనక్కు వస్తారు. ఇలా నాలుగైదు సారులు వెనకకు ముందుకూ సమంవంతో అడుగులు వేస్తారు.
పోతార్ తోలా
మార్చుపోతార్ అంటే అడుగులు, తోలా అంటే సేకరణ. ఈ నృత్యంలో సగం మంది ప్రక్క ప్రక్కన ఒక వరుసలో నుంచుంటారు. వెనుక ఉన్నవారు, ముందున్న వారి భుజాలపై చేతులు వుంచుతారు; కుడి వైపుకూ, ఎదమ వైపుకూ, ఒక్కసారిగా తలను త్రిప్పుతూ బృందం యావత్తు ముందుకు వెడతారు. అడవిలో ఆకులు ఏరడాన్ని ఈ నృత్యం సూచిస్తుంది. అరకు లోయలో గిరిజనుల అడ్డ ఆకులను సేకరించడం ఒక చిన్నవృత్తి. సేకరించిన ఆకులను సంతలో అమ్ముతారు.
బాగ్ దింసా
మార్చుభగ్ అంటే ఒరియాలో బెబ్బులి అని అర్థం. అడవిలో భయంకరమైన జంతువులలో పెద్దపులి ఒకటి. పెద్ద పులి కనిపిస్తే ఎలా పారి పోవాలో చిన్న- పెద్ద అందరూ తెలుసు కోవాల్సిన అవసరం ఉంది. బాగ్ దింసా నృత్యం దీనిని తెలియ జేస్తుంది. బృందంలో సగం మంది ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా మూగుతారు. తలను పై కెత్తుతూ ముని వేళ్ళ మీద నిలిచి వుంటారు. మిగతా సగం మంది చకచకా చుట్టు తిరుగుతూ లోపల ప్రవేశించి, పాము చుట్ట ఆకారంలో అంతా పరుచు కుంటారు. ఇలా అనేక సార్లు చేస్తారు.
వివిధ రకాల నృత్యాలు
మార్చునాటికారి, కుందాదింసా, బాయ దింసా అనే నృత్యాలు కూడా ఉన్నాయి. నాటి కారి నృత్యం ఒక్కక్కరే చేసే నృత్యం, ముఖ్యంగా వాల్మీకి జాతి వారు. దీపావళి పండుగ రోజు నృత్యం చేస్తారు. మిగతా పండుగల సమయంలో ఇతర జాతులు కూడా నృత్యంలో పాల్గొంటారు. అలాగే కుందా దింసా. కుందా అంటే ఒకరి నొకరు భుజాలతో తోసుకోవడం అని భావం. ఈ నృత్యంలో లయబద్ధంగా ఊగుతూ, ఒకరి నొకరు భుజాలతో తోసుకుంటారు. బాయా దింసా నిసాని దేవత పూనినపుడు గణాచారి చేసే నృత్యజ్మిది. బాయా అంటే పూనకం.గణాచారిని ఒరియాలో గురుమాయీ' అంటారు. ఎవరైనా పూని నపుడు గ్రామస్తులందరు ఆ వ్వక్తి చుట్టూ చేరి తలలు వంచి పిలుస్తారు.
అలాగే గురుమాయి భవిష్యత్తులోజరగనున్న సంఘటనలను చెపుతారు. గూడెంలో ఎవరెవరు ధర్మం తప్పి చరించినది భయడ పెట్టడం కూడా జరుగుంది. ఇలా చెప్పేజోశ్యాలలో చాలవరకు నిజం కావడం విశేషం. జానపదులు పూనకం వచ్చిన వ్వక్తిని అనుకరిస్తారు. గనుక ఈ నృత్యాన్ని బాయాదింసా అని వ్వవహరిస్తున్నారు. పూనకం తొలగే వరకూ ఈ నృత్యం కొనసాతుంది. (ప్రభువం గిరిజన సాంస్కృతిక సంస్థ సౌజన్యంతో)
మదురాలు
మార్చుమధురమైన పాటల్నీ, ఆటల్నీ, నృతూఅలను చేస్తూ కాలం గడిపే మదురాలు, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో, అడవుల్లో, కొండల్లో ఈ మధురాలు ఎక్కువగా వివరిస్తున్నారని, విద్యారణ్య గారు ఆంధ్ర పత్రికలో ఉదహరించారు.వారి జీవన సరళీ, అచార వ్వవహారాలు, వేష భాషలూ అన్నీ గిరిజన వీతానికి దగ్గరగా వుంటాయి. వీరు అన్ని విధాలా, లంబాడీలను పోలి వున్నప్పటికీ వీరికి వారికీ చాల తేడా ఉంది.
వీరు సంచార జాతులనీ, ఉత్తర ప్రదేశం నుండి వచ్చారనీ అంటారు కానీ, మేము ఇక్కడి వారమే నంటారు మదురాలు. అదిలాబాద్ జిల్లలోని ఉట్నూరు, భోద్ అడవుల్లో ఎక్కువగా కనిపించే మధురాల జీవన విధానం వేష భాషలు విచిత్రంగా కనిపిస్తాయి. అందంలోనూ, వస్త్ర ధారణ లోనూ, ఏ ఇతర జాతి స్త్రీలకూ తీసు పోరు.
వీరు మొగల్ చక్రవర్తి ఔరంగ జేబు కాలంలో సైన్యానికి ఆహారం అందించే వారని, ప్రసిద్ధ సామాజిక శాస్త్ర వేత్త గిరిజనుల ఆరాధ్య దైవం హేమండార్సు అంటారు. మదురాల సిరోజాల అలంకరణ ఎంతో రమణీయంగా వుంతుంది. స్త్రీలందరూ మామూలుగా సిగలు చుడతారు కాని మధురాలు పొడుగాటి కొమ్ములాగా అలంకరిస్తారు. ఈ అలంకారం చూడ ముచ్చట గానేవుంటుంది. జీవిత సరళిలో, వేష ధారణలో దగ్గర సంబంధాలున్నలంబాడీలు, ఇంతకు పూర్వం, మదురాలతో సంబంధాలు లేక పోయినా, ఇటీవల కాలంలో వీరిరువురి మధ్యా సంబంధాలు జరుగుతున్నాయి.
ఇష్టమైన గోకులాష్టమి
మార్చుమధురాలకు గోకులాష్టమి ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పండుగ పర్వ దినాల్లో లెంగినాఖేల్ అనే ఆటను తమతమ గూడేలలో ఆడుతూ వుంటారు. మగవారు తప్పెటల్నీ, డోలక్ లనూ, నగారాలనూ వాయిస్తూ వుంటే, మహిళలు లయ బద్ధంగా చప్పట్లు చరుస్తూ, అడుగులలో అడుగులు వేస్తూ, వలయ్హాకారంగా, గుండ్రంగాతిరుగుతూ, కృష్ణ సంకీర్తనాన్ని ఆశువుగా ఆహ్లాదంగా వివరిస్తారు. అయితే స్త్రీలు ప్రదర్శించే నృత్యంలో పురుషులు పాల్గొనే అవకాశ ముండతు. అందుకు కారణం, పది సంవత్సరాల వయసున్న బాలుడు కృష్ణుని పాత్ర ధరిస్తే, స్త్రీలంతా గోపికల నాట్యవిన్నాసాన్ని చేస్తారు. ఆ కారణం వల్ల వారి వారి పురుషులకు ఈ నాట్యంలో తావు వుండదని మదురాలు చెపుతారు.
వీరు దసరా, దీపావళి, సంక్రాంతి పందుగలను వైభవంగా జరుపు కుంటారు. ఆట పాటలతో, ఆనంద డోలికల్లో ఊగుతారు.
ముఖ్యంగా ఖద్ డమారణ్' అనే కన్యల పంగుడను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది తెలంగాణాలో వహుళ ప్రచారంలో వున్నబతుకమ్మ పండగకు చాల సన్నిహితంగా వుంటుందాత. అయినాఅది ఒక ప్రత్యేక కళారూపంగా వుంటుందట.
గోండ్లు మొదలైన గిరిజనుల మాదిరే చక్రాల బళ్ళసు ఉపయోగిస్తూ ఉన్న వనరులతో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తారు. వీరు స్నేహానికి ప్రాణమిస్తారు.
గిరిజనుల, సంగీత వాయిద్యాలు
మార్చుఆంధ్రదేశంలో అనేక జానపద కళా రూపాలతో పాతు, అడవుల్లో కొండల్లో నివసించే గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు కూడా సంస్కృతీ పరమైన అనేక నృత్యాలూ గేయాలూ, అనేక వాయిద్య పరికరాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ విభాగ మైన గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ, వ్వవహారాల సంస్థ పరిశోధనాత్మక మైన కృషి చేస్తున్నదనీ, గిరిజన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ సమగ్ర పరిశోధన విశేషమనీ, సంస్కృతీ చిహ్నాలైన వస్తువుల్ని సేకరించటం అవసరమనీ, అవి గిరిజన సంస్కృతిని తెలుసు కోవడం కోసం ఉపయోగ పడతాయనీ, అందుకోసం కృషి జరుగుతూ వుందనీ, ఆ కృషిలో భాగంగా యం.ఎ. రవూఫ్ గారు జానపద కళల ప్రత్యేక సఆంచికలో గిరి జనుల సంగీత వాయిద్యాల గురించి వివరించారు.
సంగీత వాయిద్యాలు
మార్చు- మమేళా
మమేళా అనే ఈ వాయిద్యాన్ని కుమ్మరి మట్టితో తయారు చేస్తారు. లోపలి భాగం అంతా డొల్లగా వుంటుంది. స్థూపక ఆకారంలో వుంటుంది. ప్రక్కన మేక చర్మంతో సాగ దీసి బిగిస్థారు. దండారి నృత్యం జరిగే సమయంలో గోడు జాతి వారు ఈ వాయిద్యాన్ని అద్భుతంగా వాయిస్తారు.
అలాగే డగ్గుడు అనే వాయిద్యాన్ని సవర జాతి వారు ఉపయోగిస్తారు. ఈ వాయిద్యం యొక్క ఆకారం మద్దెలలా వుంటుంది. దీనిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవరలు వారి జాతిలో ఎవరైనా మరణించి నప్పుడు సంతాప సమయంలో దీనిని వాయిస్తారు. అలాగే పితృ దేవతలకు శ్రాద్ధ ఖర్మలు జరిపే ఆగుగామా సమయంలో ఉపయోగిస్తారు.
ఈ వాయిద్యాల పేర్లే ఎంతో ఆసక్తి గలి గించేవిగా ఉన్నాయి. కిరిడి వాయిద్యం మట్టితో తయారు చేయబడే డ్రమ్ము వాయిద్య మిది. పై భాగాన మేక చర్మాన్ని అమరుస్తారు. రెండు చిన్న కఱ్ఱ పుల్లలతో మోరీ బాణికి అనుగుణంగా ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు.
రెండు అడుగుల వ్వాసం కలిగిన ఒక్ కొయ్య చట్రానికి, ఎండ బెట్టిన మేక చర్మాన్ని, గట్టిగా లాగి బిగిస్తారు. డపొపు, డంగ్, అనే రెండు చిన్న పుల్లలతో అదిలాబాద్ జిల్లాలో వున్న రాజ గోండులు
అర్థ గోళాకారంలో వుండే మట్టితో తయారు చేయ బడ్డ వాయిద్య మిది. పైన మేక చర్మాన్ని భిగించి కడతారు. అర్థ గోళం పైభాగం పైన తోలు పట్టీలు చర్మాన్ని బిగించి వుంచుతాయి. తాళ్ళ చుట్టుపైన ఈ వాయిద్యాన్ని వుంచి, తోలుపట్టలతోవాయిస్తారు. ముఖ్యంగా దింసా నృత్యాలలో దినిని ఉపయోగిస్తారు. సామంత జాతివారూ, గోండులూ ఈ వాయిద్యాన్ని ఎక్కువగా వాడుతారు.
అదిలాబాదు జిల్లా గోండులు ఉపయోగించే వాయిద్యమిది. దీనిని తురుబులి అనీ, వెట్టె అనీ అంటారు. కుండ మట్టితో గాని ఇనుముతో గాని, కొయ్యతో గాని దీనిని పళ్ళెం తయారు చేసి పైన చర్మాన్ని బిగిస్తారు. ఈ చర్మం వ్వాసం సారణంగా పది అంగుళాల కంటే ఎక్కువే వుంటుంది. సన్నని రెండు పుల్లలతో దీనిని వాయిస్తారు.
దారువుతో డొల్లగా చేసిన ఈ వాయిద్యానికి రెండు వైపులా జింక చర్మాన్ని గాని మేక చర్మాన్ని గాని ఉపయోగిస్తారు. వెదురు ముక్కలూ, తాళ్ళతో ఈ చర్మాన్ని బిగువుగా వుంచుతారు.
ఈ వాయిద్యం రెండు ప్రక్కలా వాయించ వలసిన వాయిద్య మిది. స్థూపాకారంలో వుండే ఈ వాయిద్యం మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా వుంటుంది. చట్రాన్ని మట్టితో చేసి కాలుస్తారు. రెండు ప్రక్కలా అనువుగా మేక చర్మాన్ని అమర్చి బిగించుతారు. తోలు పట్టీలతో ఈ రెండు వైపుల చర్మాన్ని బిగించ టానికి వీలుంటుంది. ఈ వాయిద్యాన్ని కేవలం వ్రేళ్ళతో వాయిస్తారు. ముఖ్యంగా ..... ఆరకు లోయలో దీనిని అన్ని జాతుల వారు వాయిస్తారు.
- రెండవ రకం డోలు
ఇది కూడా పైన వివరించిన డోలు లాంటిదే. మెడకు తగిలించుకుని, డోలును పొట్టకు ఆనించి ఒక చేతితో వెదురు పుల్ల తోనూ, మరో చేతి వ్రేళ్ళతోనూ అప్పుడప్పుడు అర చేతితోనూ వాయిద్యాన్ని సాగిస్తారు.
- గోగోడ్ - రాజ
ఈ వాయిద్యాన్ని శ్రీ కాకుళం జిల్లాలో వున్న సవరలు ఉపయోగించే సంగీత వాయిద్యమిది. మామూలు కొబ్బరి చిప్పను ఈ వాయిద్యానికి స్వర పేటికగా ఉపయోగిస్తారు. తొండ చర్మాన్ని స్వర పేటిక పై బిగిస్తారు. 12 నుంచి 16 అంగుళాల వెదురను ఒక చివర కొబ్బరి చిప్పను మేకుతో బిగిస్తారు. వెదురుకు రెండవ చివరన రెండు మేకులు త్రిబ్బడానికి వీలుగా వుంటాయి.స్వర పేటిక పైన సన్నని కొయ్య ముక్కను వుంచి, దానిపై నుండి రెండు తీగలను మేకులకు కట్టి ఉంచుతారు. మేకులను త్రిప్పడం ద్వారా తీగ బిగుతును ఎక్కువ చేయవచ్చు. విల్లు వలె తయారు చేసిన కమానుతో ఈ వాయిద్యాన్ని వాయిస్తారు.
ఇది మద్దెల వంటి పొడవు మాత్రం రెండు అడుగులు వుంటుంది. దీనికి కూడా రెండు వైపులా మేక చర్మాన్నే బిగించి వుంచుటారు. రెండు వైపులా వృళ్ళతోనే వాయించు తారు. అదిలా బాదు జిల్లా ల్రాజా గోడులు ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు.
వాయుజన్య శబ్ద వాయిద్యాలు
మార్చుఎరుకల కులమైన పాముల వాళ్ళు వాయించే వాద్య మిది. పాములను ఆడించ డానికి ఇది ఉపయోగ పడుతుంది. త్రాచు వంటి పాములను సైతం పాముల వాళ్ళు నాగ స్వరంతో మచ్చిక చేస్తారు.
ఇది వెదురుతో చేసిన వాయిద్యమే గాని పిల్లన గ్రోవి కంటే పెద్దది. దీని పొడవు 16 అంగుళాల నుంచి 20 అంగుళాల వరకు ఉంటుంది. రెండు నుంచి మూడు అంగుళాల వ్వాసం వుంటుంది. దీనికి మధ్యలో పది పన్నెండు అంగుళాల చాలు వుంటుంది. ఈ పెద్ద చాలుకు రెండు వైపుల పొడుగు పాటి చిన్న రంద్రాలు వుంటాయి. డంగు అనే ఒక కొయ్యముక్క సహాయంతో ధ్వనిని జనింప చేస్తారు. ఈ వాయిద్యాన్ని విడిగా కాకుండా అనేక ఇతర వాయిద్యాలతో పాటు ఉపయోగిస్తారు.
గోదావరి ప్రాంతంలో ఎక్కువ గ్రామాలలో ఇది బహుళ ప్రచారంలో ఉంది. ఇతర చోట్ల కూడా పల్లె ప్రజలు అభిమానించే వెదురు వాయిద్యమిది. వూదే చోట ఒక రంధ్రమూ, మధ్య నుంచి రెండవ చివరి వరకు ఐదు చిన్న రంద్రాలు వుంటాయి సాధారణంగా ఇది 21 సెంటి మీటర్ల పొడవు వుంటుంది.
సవరలు ఉపయోగించే ఈ వాయిద్యం గేదె కొమ్ముతో తయారు చేసింది. దీని పొడవు 12 నుంచి 15 అంగుళాల వరకూ వుంటుంది. సన్నగా చివరన వుండేవెదురుతో చేసిన సన్నని గొట్టాన్ని పీకగ అమర్చుతారు. బాగా దమ్ము పట్టి వూది నప్పుడు పెద్దగా శబ్దం వస్తుంది.
పన్నెండు అంగుళాల పొడవు ఒక అంగుళం వ్వాసం కలిగిన ఈ వాద్యాన్ని కూడా సవరలు ఉపయోగిస్తారు. దీనికి ఒక వైపు మూసి వుంటుంది. రెండవైపు ఖాళీగా వుంటుంది. మూసిన వైపు దీర్ఘ చతురస్రాకారంగా ఒక చిన్న రంద్రం వుంటుంది. తాటాకు బద్దను మైనంతో రంధ్రం వద్ద అతికిస్తారు. తాటాకు బద్ద కదలిక ద్వారా రంద్రం పరిమాణాన్ని మార్చు తుండ వచ్చు. ఎడమ చేతి బొటన వ్రేలు ఇతర వ్రేళ్ళ మధ్య పట్టుకుని పెదిమల దగ్గరగా వుంచి ఈ వాధ్యం నుంచి శబ్దాన్ని ధ్వనింప చేస్తారు.
- రెండవ రకం పనార్
తెలుగు దేశంలో ఇంకా అనేక చోట్ల ప్రచారంలో వున్న పిల్లన గ్రోవి. ఇది ఒక చివరన వున్న రంధ్రం నుండి ఊదుతూ కుడి చేతి వ్రేళ్ళ తోనూ, ఎడమ చేతి వ్రేళ్ళతోనూ శబ్దంలో మార్పులు తీసుక రావచ్చు. వివాహాది శుభ కార్యాల సమయంలోనూ, విశ్రాంతిగా వుండే సమయంలోనూ ఈ వాయిద్యాన్ని వాయించటం పరిపాటి.
తంత్రీ వాయిద్యాలు
మార్చుఇది అనేక తంత్రులు కలిగిన సంగీత వాయిద్యం. ఉత్తారాదిన కొన్ని గిరిజన జాతులలో వాడుకలో వున్నకెన్నెర వాయిద్యాన్ని పోలి వుంటుంది. ఇంచుమించు గిటారు లాగ వుంటుంది. లోపల ఖాళీగా వున్న సుమారు 20 అంగుళాల వెదురు పై మైనంతో మధ్యగా నాలుగు మెట్ల అతికిస్తారు. మెట్లపై నుండి రెండు తంత్రులను బిగిస్తారు. వెదురుకు ఒక చివర స్వర పేటిక వుంటుంది.
మూడు తంత్రులూ, చర్మం బిగించిన స్వరపేటిక ఈ వాయిద్యంలో ముఖ్య భాగాలు. స్వర పేటికను చదరంగా కొయ్యతో తయారు చేస్తారు. ఫిడేలు వలె వుండే ఈ వాయిద్యాన్ని అత్యంత విలువైనదిగా పరిగణిస్తారు. వర్థానులలో అందరి కంటే ప్రముఖుడైన వ్వక్తి ఈ వాయిద్యాన్ని వాయిస్తాడు. ఆ సమయంలో చిన్నవారు తప్పెట్లు వాయిస్తూ బాణాలు వూదుతారు.
మూలాలు
మార్చు- ↑ "దండారి పండుగ శోభ! | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2020-01-26.
వెలుపలి లంకెలు
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు