ఉత్పలమాల
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.[1]
ఉత్పల మాల
మార్చుభానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ
స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్
Uttpala mala
<poem>
Bhanusamaana vinbarana baaralagambhulu goodi visrama
Sthanamu nandu jadhmaja yuthambuga nuthpalamaalayi chanun
==లక్షణములు[2]==
- పాదాలు: నాలుగు
- ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
- ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
- యతి స్థానం : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
- ప్రాస నియమం: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.
==గణవిభజన==
భ |
ర |
న |
భ |
భ |
ర |
వ |
U I I |
U I U |
I I I |
U I I |
U I I |
U I U |
I U |
పుణ్యుడు |
రామచం |
ద్రుడట |
పోయిము |
దంబున |
గాంచెదం |
డకా |
==ఉదాహరణలు==
పోతన తెలుగు భాగవతంలో 475 ఉత్పలమాల వృత్త పద్యాలను వాడారు. వాటిలో రెండింటిని ఉదాహరణగా ఇక్కడ.
===ఉదాహరణ 1===
<poem>
పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్
ఉదాహరణ 2
మార్చుఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం
దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ
గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్
తిక్కన చెప్పిన ప్రసిద్ధమైన పద్యం [సారపు ధర్మమున్ విమల సత్యము]ఉత్పలమాలకు మరొక ఉదాహరణ.
మూలాలు
మార్చు- ↑ మిరియాల), Dileep Miriyala(దిలీపు. "ఉత్పలమాల — తెలుగు ఛందస్సులు". chandam.apphb.com. Archived from the original on 2021-06-18. Retrieved 2019-08-25.
- ↑ సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "ఉత్పలమాల : ఛందోపరిచయము : వ్యాకరణము : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Retrieved 2019-08-25.
బాహ్య లంకెలు
మార్చు- #ఛందస్సు-ఉత్పలమాల #chandassu part -2#utpalamala#Telugu grammar#vyakaranam#TET#DSC#s.i Telugu grammar (in ఇంగ్లీష్), retrieved 2019-08-25