ఆమంచర్ల శేషగిరిరావు
సినిమా దర్శకుడు
ఆమంచర్ల శేషగిరిరావు(A.V.SESHAGIRI RAO)(1926-2007) ప్రముఖ సినిమా దర్శకుడు. ఇతడు 50కి పైగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు నెల్లూరు నుండి వెలువడిన జమీన్ రైతు పత్రికలో సహాయసంపాదకునిగా పనిచేశాడు.[1] ఇతడు సినీ రచయితగా రాణించాలనే ఉద్దేశంతో ఆత్రేయ వద్ద సహాయకునిగా పనిచేశాడు. ఆత్రేయ సలహాతో దర్శకత్వం వైపు తన దృష్టిని మళ్ళించాడు. మొదట వయారిభామ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసి పెండ్లి పిలుపు సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా మారాడు.[2]
చిత్రసమాహారం
మార్చుఇతడు దర్శకత్వం వహించిన సినిమాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది.
తెలుగు
మార్చు- వయారిభామ (1953) (సహాయ దర్శకుడు)
- పెండ్లి పిలుపు (1961)
- నువ్వా నేనా (1962)
- వీరపూజ (1968)
- తుపాకి రంగడు (1970)
- అందం కోసం పందెం (1971)
- వాణి దొంగలరాణి (1974)
కన్నడ చిత్రాలు
మార్చు- బెట్టద హులి (1965)
- హూవు ముల్లు (1968)
- మక్కళే మనెగె మాణిక్య (1969)
- జయ విజయ (1973)
- సంపత్తిగె సవాల్ (1974)
- హెణ్ణు సంసారద కణ్ణు (1975)
- బతుకు బంగారవాయితు (1976)
- బహద్దూర్ గండు (1976)
- రాజ నన్న రాజ (1976)
- సొసె తంద సౌభాగ్య (1977)
- శ్రీమంతన మగళు (1977)
- వసంత లక్ష్మి (1978)
- నానిరువుదె నినగాగి (1979)
- నెంటరొ గంటు కళ్ళరొ (1979)
- రవి చంద్ర (1980)
- హద్దిన కణ్ణు (1980)
- పట్టణక్కె బంద పత్నియరు (1980)
- అవళి జవళి (1981)
- గుణ నోడి హెణ్ణు కొడు (1982)
- కెరళిద హెణ్ణు (1983)
- మర్యాదె మహల్ (1984)
- ప్రేమవే బాళిన బెళకు (1984)
- పవిత్ర ప్రేమ (1984)
- కుంకుమ తంద సౌభాగ్య (1985)
- తాళిగాగి (1989)
- బహద్దూర్ హెణ్ణు (1993)
తమిళచిత్రాలు
మార్చు- కొల్లైకారన్ మగళ్
మరణం
మార్చుఇతడు తన 81వ యేట చెన్నైలోని తన స్వగృహంలో 2007, జూన్ 17వ తేదీన మెదడులో రక్తస్రావం జరిగి మరణించాడు.[3]
బయటి లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ నెల్లూరు, శ్రీరామమూర్తి (23 July 1993). "జీవితావలోకనమ్" (PDF). జమీన్ రైతు ప్రత్యేకానుబంధం: 18. Archived from the original (PDF) on 13 సెప్టెంబరు 2016. Retrieved 26 November 2016.
- ↑ సి.వి.ఆర్., మాణిక్యేశ్వరి (28 December 2012). "ఫ్లాష్ బ్యాక్@50 నువ్వా - నేనా". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 26 November 2016.[permanent dead link]
- ↑ "Kannada director Seshagiri Rao dead". IBN Live. CNN. 20 June 2007. Archived from the original on 6 డిసెంబరు 2013. Retrieved 26 November 2016.