ఆరణి సత్యనారాయణ
ఆరణి సత్యనారాయణ (అరణి సత్యనారాయణ) (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. [1]
ఆరణి సత్యనారాయణ | |
---|---|
జననం | గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1898 నవంబరు 11
మరణం | 1969 జూలై 2 మద్రాసు, భారతదేశం | (వయసు 70)
వృత్తి | తెలుగు సినిమా నటుడు |
జీవిత విశేషాలుసవరించు
అతను 1898లో గుంటూరు జిల్లా సంగడి గుంట గ్రామంలో జన్మించాడు. అతను 1912లో తన 14వ యేట గయోపాఖ్యానం నాటకంలో సత్యభామ పాత్రలో నటించాడు.
మూకీ సినిమాల కాలంలో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించాడు. అతనిని 1921లో ఆర్.ఎస్.ప్రకాష్ చిత్రసీమకు పరిచయం చేసాడు. తరువాత అతను ఘంటసాల బలరామయ్య నిర్మించిన రామదాసు (1933) (‘దేవదాసు’లో ధర్మన్న పాత్రధారి) సినిమాలో నటించాడు. [2] అతను 1936లో సరస్వతి టాకీస్ నుండి వచ్చిన ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో నటించిన విదురుని పాత్రకు గుర్తింపు పొందాడు.
అతను కనకతార, బాలయోగిని, ధర్మాంగద, రత్నమాల, లైలా మజ్ను చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు.
అతను వినోదా పిక్చర్స్ లో అకౌంటెంత్ గా చేరాడు. వినోదా పిక్చర్స్ సినిమాలైన దేవదాసు, శాంతి సినిమాలలో నటించాడు.
సినిమాలుసవరించు
- రామదాసు (1933) .... తానీషా
- బాలయోగిని (1936/I)
- ద్రౌపది వస్త్రాపహరణం (1936) ... విదురుడు
- కనకతార (1937)
- చంద్రిక (1940)
- రత్నమాల (1947)
- ధర్మాంగద(1949)
- లైలా మజ్ను(1949)
- శాంతి (1952)
- దేవదాసు (1953) .... ధర్మన్న
మూలాలుసవరించు
- ↑ Sahajanata Aarani Satyanarayana, Tolinati Gramophone Gayakulu by Modali Nagabhushana Sharma, Creative Links Publications, Hyderabad, 2010, pp. 36-7.
- ↑ "అన్న నిర్మాత... తమ్ముడు నటుడు". సితార. Retrieved 2020-07-31.[permanent dead link]