ఆర్‌ఎక్స్‌ 100 [1][2] 2018 జూలై 12 న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా హిందీలో తడప్ పేరుతో రీమేక్ చేశారు.

దస్త్రం:ఆర్ ఎక్స్ 100.jpg
ఆర్ ఎక్స్ 100

శివ(కార్తికేయ) చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోతాడు. డాడి (రాంకీ)నే తనకు సర్వస్వం. డాడికూడా శివను కన్నకొడుకులా చూసుకుంటాడు. ఆ ఊరి సర్పంచు విశ్వనాథం(రావు రమేశ్‌) వద్ద సహాయకుడిగా పనిచేస్తుంటాడు డాడి. విశ్వనాథం సర్పంచు అవ్వడానికి డాడినే మూలకారణం. అయితే ఈ విషయాలన్నీ మర్చిపోయిన విశ్వనాథం డాడికి ఇష్టంలేని పనులు కూడా చేస్తుంటాడు. విశ్వనాథం కూతురు ఇందు(పాయల్‌ రాజ్‌పుత్‌)శివను చూడగానే ఇష్టపడుతుంది. ప్రేమించమని వెంటపడుతుంది. శివను కూడా ఇందును ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు.

వీరి ప్రేమ విషయం విశ్వనాథానికి తెలుస్తుంది. అప్పటికప్పుడు ఇందును మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లైన వెంటనే ఇందు అమెరికా వెళ్లిపోతుంది. ఈ షాక్‌ నుంచి శివ ఎలా తేరుకున్నాడు? ఇందు జ్ఞాపకాలు శివను ఎలా వేధించాయి? ఇందు మళ్లీ తిరిగి వచ్చిందా? లేదా? అన్నదే మిగిలిన కథ.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • పిల్లా రా , రచన: చైతన్య ప్రసాద్, గానం.అనురాగ్ కులకర్ణి
  • నిప్పై రగిలే, రచన: చైతన్య వర్మ, గానం. రాహుల్ సింప్లీ గుంజ్
  • అదిరే హృదయం , రచన: చైతన్య ప్రసాద్ గానం.కార్తీక్
  • రెప్పల నిండా , రచన: శ్రీమణి, గానం.హరిచరన్
  • రుదిరం మరిగే, రచన:సిరశ్రీ, గానం. దీప్తి పార్ధసారథి, సాయి చరణ్
  • మనసుని పట్టి , రచన: శ్రీమణి , గానం.హరిచరన్, ఉమానేహా
  • దినకు దినా డా, రచన: చైతన్య వర్మ, గానం. వర్మ.

సాంకేతికవర్గం

మార్చు

పురస్కారాలు

మార్చు

సైమా అవార్డులు

మార్చు

2018 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ తొలిచిత్ర నటి (పాయల్ రాజ్ పుత్)
  2. ఉత్తమ నేపథ్య గాయకుడు (అనురాగ్ కులకర్ణి - పిల్లా రా)

మూలాలు

మార్చు
  1. "RX 100 movie trailer: Kartikeya's film is a violent love story. Watch video".
  2. "RX 100 release date announced".
  3. "Rao Ramesh unveils 'RX 100' trailer".
  4. "Ajay has high hopes on RX 100".

బయటి లంకెలు

మార్చు