ప్రధాన మెనూను తెరువు
కుసుమ
Safflower.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: Asterales
కుటుంబం: ఆస్టరేసి
జాతి: Cynareae
జాతి: కార్థమస్
ప్రజాతి: C. tinctorius
ద్వినామీకరణం
Carthamus tinctorius
(Mohler, Roth, Schmidt & Boudreaux, 1967)
Carthamus tinctorius

కుసుమ (ఆంగ్లం: సాఫ్లవర్/Safflower ) శాస్త్రీయ నామం కార్థమస్ టింక్టోరియస్ (Carthamus Tinctorius Orange) .ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్క.దీని మొదటి ఆవాస ప్రాంతం ఐయా మత్తు ఆఫ్రికా, అలాగే మధ్యభారతం నుండి తూర్పుమధ్యధరాప్రాంతపుదాటి యుథోపియా వరకు వ్యాప్తిచెందినది[1] ఇది చాలా కొమ్మలు కలిగిన ఏకవార్షిక గుల్మం. దీని ఆకులు వాడిగా ఉన్న ముండ్లు కలిగిఉంటాయి. ఈ మొక్కలు 30 నుండి 36 అంగుళాలఎత్తు వరకూ పెరుగుతాయి[2]. కుసుమ పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఇవి ఒక్కో కొమ్మకు ఒకటి నుండి ఐదు చొప్పున వస్తాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన కుసుమ మొక్క పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కానీ కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకూ మంచును ఎంత మాత్రం సహించలేదు.కొమ్మల లేతచివరలలో విటమిన్ A, ఐరన్, ఫాస్పరన్, మరియు కాల్సియంలు అధిశాతంలో ఉన్నాయి. ఆందుచే వీటిని ఓషదులు సాలిడ్‌ డ్రస్సింగ్స్ తయారిలో వుపయోగిస్తారు.గింజలలో 30% వరకు నూనె వుండును. మిగతా నూనెగింజలలోవున్న నూనెశాతంతో పొల్చిన యిదిబాగా తక్కువ. నూనెగింజలలో నూనె 40-60% వుండును.నూనెగింజల దిగుబడి 600-700 కే.జిలు/హెక్టారుకు/భారతదేశంలో.పూలు అయ్యినచో 100 కే.జీ.లు/హెక్టరుకు[3].

కుసుమ ప్రధానంగా నూనె గింజ పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ[4] పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు[5]. కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు రంగుగా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపథ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.

సాగుకు అనువైన భూములుసవరించు

నేలయొక్క PH =6.0నుండి7.0 వుండాలి.పొడినేలలు, తేలికపాటి నేలలు, బాగా తేమ ఇంకే స్వభావమున్న భూములు కుసుమ పంటకు అనుకూలం.పంట ఎక్కువ వేసవికాలంలో పూతకు వస్తుంది.పూలు ఆరెంజి వన్నెకలిగిఉండును.పంట సమయంలో 60-700Fఉషోగ్రత ఉండాలి.ఇత్తనాన్ని భూమిలోపల ¼ అంగుళంలోతులో ఉండేలా విత్తాలి.మొక్కకు మొక్కకు ఎడం కనీసం 6-10 అంగుళాలు ఉండేలా చూడాలి.[2][6]

కుసుమ సాగుసవరించు

ప్రంపంచంలో 650-700 వేల హెక్టారులలో కుసుమ పంట సాగు అవ్వుచున్నది. భారతదేశంలో 300-360 వేల హెక్టారులలో సాగు చెయ్యుచున్నారు. ప్రపంచంలో ఇండియా, అమెరికా, మెక్సికో, యుథోపియా, కజకిస్థాన్, అస్ట్రేలియా, అర్జెంటినా, యుజెకిస్థాన్, మరియు చైనాలో అధికంగా కుసుమ ఉత్పత్తి అగుచున్నది. రష్యా, పాకిస్తాన్‌, స్పైన్‌, టర్కి, కెనడా మరియు ఇజ్రాయిల్‌లో కూడా కుసుమను సాగు చెయ్యుచున్నారు. భారతదేశంలో ఎక్కువగా మహారాష్ట్ర, మరియు కర్నాటకలో కుసుమ సాగు జరుగుచున్నది. కుసుమ పండిచు మిగతా రాష్ట్రాలు, ఆంధ్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తిస్‌గడ్‌, మరియు బీహరు.

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Safflower". britannica.com. http://www.britannica.com/EBchecked/topic/516124/safflower. Retrieved 2015-03-16. 
  2. 2.0 2.1 "Safflower Seeds". outsidepride.com. http://www.outsidepride.com/seed/flower-seed/safflower/safflower-orange.html. Retrieved 2015-03-16. 
  3. SEAHandBook-2009BySolvenyExtractorsAssociation ofIndia
  4. కుసుమ నూనె
  5. "Safflower". hort.purdue.edu. https://www.hort.purdue.edu/newcrop/afcm/safflower.html. Retrieved 2015-03-16. 
  6. కుసుమ పంట
"https://te.wikipedia.org/w/index.php?title=కుసుమ&oldid=2317299" నుండి వెలికితీశారు