ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషను

(ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి దారిమార్పు చెందింది)

ఇండోర్ జంక్షన్ (స్టేషన్ కోడ్: INDB), మధ్యప్రదేశ్ లోని అతి పెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటి, వాణిజ్య రాజధాని ఇండోర్, సెంట్రల్ భారతదేశం లకు పనిచేస్తుంది. ఇండోర్ జంక్షన్ బి.జి. రైల్వే స్టేషన్‌లో ఉన్న బ్రాడ్ గేజ్ లైన్, భారతీయ రైల్వేలు, పశ్చిమ రైల్వే జోన్ యొక్క పరిపాలనా నియంత్రణలోకి వస్తుంది. ఇది 4 ప్రధాన రైల్వే ప్లాట్‌ఫారములు కలిగి ఉంది. ఇది భారతదేశం లోని ఒక ISO సర్టిఫికేట్ స్టేషన్. ఉజ్జయినీ - ఇండోర్ రైలు మార్గం, ఇండోర్ జంక్షన్ రైలు మార్గము ఇటీవల కాలములో విద్యుద్దీకరణ చేశారు. రైల్వే స్టేషన్‌ నగర కేంద్రానికి 1 కి.మీ. దూరంలో ఉంది.

ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషన్
ఇండియన్ రైల్వే స్టేషన్
ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషన్
సాధారణ సమాచారం
Locationఇండోర్ , మధ్యప్రదేశ్
 India
Coordinates22°26′N 75°31′E / 22.43°N 75.52°E / 22.43; 75.52
Elevation550.20 మీ. (1,805 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుముంబై - ఇండోర్ (బ్రాడ్ గేజ్), జైపూర్ - అజ్మీర్ - రత్లాం - ఇండోర్ - ఖండ్వా - అకోలా - పూర్ణ (బ్రాడ్ గేజ్):: మోహో - అకోలా తప్ప
ఫ్లాట్ ఫారాలు3 BG
పట్టాలు4 BG
Connectionsటాక్సీ స్టాండ్, ఆటో స్టాండ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషన్ లో) ప్రామాణికం
పార్కింగ్అందుబాటులో
Bicycle facilitiesఅందుబాటులో
Disabled accessHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషను కోడుINDB
Fare zoneపశ్చిమ రైల్వే
History
Opened1893; 131 సంవత్సరాల క్రితం (1893)
Rebuilt1921; 103 సంవత్సరాల క్రితం (1921)
విద్యుత్ లైను2012
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
ఇండోర్ జంక్షన్ బిజిలో 3వ నంబరు ప్లాట్‌ఫారం

చరిత్ర

మార్చు

హోల్కర్ స్టేట్ రైల్వే

మార్చు

1870 లో, హిజ్‌ హైనెస్ ఇండోర్ మహారాజు హోల్కర్ సవై శ్రీ తుకోజిరావు హోల్కర్ II, అతనికి భారత రాజధాని ఇండోర్‌కు రైలు మార్గం నిర్మాణం కోసం 10 మిలియన్ స్టెర్లింగ్ రుణం పొందాడు, ఇది గ్రేట్ ఇండియన్ పెనిన్సులా (జి.ఐ.పి.) రైల్వే మెయిన్ లైన్ నుంచి తీసుకున్నది.[1] శీఘ్ర సర్వే జరిగింది. ఖాండ్వా ఆన్ జి.ఐ.పి. రైలు మార్గము మీద ఉన్న ఖాండ్వా జంక్షన్ పాయింట్‌గా ఎంపిక చేయబడింది. ఈ మార్గము నర్మదా మీద సనావాడ్, ఖేరీ ఘాట్ గుండా, తరువాత దారిలో చోరి లోయ ద్వారా వాలుగా ఉన్నవింధ్య పర్వతాలు మీదుగా ఇండోర్ వరకు వెళుతుండేది. మహారాజా హోల్కర్ యొక్క సహకారం మాల్వా ప్రాంతంలో రైలు మార్గాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. 1870 వ దశకంలో, హోల్కర్ స్టేట్ రైల్వే యొక్క మీటర్ గేజ్ రైలు మార్గం ఖాండ్వా, ఇండోర్ మధ్య మౌ ఘాట్ మీదుగా మంజూరు చేయబడింది.[2] వింధ్య పర్వతాలు చాలా నిటారుగా, అతి ఎక్కువ గ్రేడియంట్ (1 నుండి 40 వరకు) కలిగి ఉండటం కారణంగా హోల్కర్ రైల్వే చాలా భారీ పనులు చేపట్టవలసిన అవసరం ఏర్పడింది. ఇందులో 510 గజాల పొడవుతో 4 సొరంగాల త్రవ్వించి, లోతైన కోత తవ్వకాలు, భారీ రిటెయినింగ్ (ఆధార) గోడలు కట్టడం వంటి పనులు ఉన్నాయి. నర్మదా నటిని దాటేందుకు, 14 స్పానులతో 197 అడుగుల పొడవైనది, తక్కువ నీటి మట్టం స్థాయి నుండి 80 అడుగుల ఎత్తైన వంతెన నిర్మాణం కూడా ఉంది. అక్కడ 14 ఇతర పెద్ద వంతెనలు అధిక స్తంభాలతో కూడా ఉన్నాయి. ఇందులో క్రింద భాగం నుండి అత్యధిక ఎత్తైన స్తంభం 152 అడుగులతో ఉంది. మొదటి విభాగం ఖాండ్వా-సనావాద్ రైలు మార్గం 1.12.1874 న ట్రాఫిక్ కోసం ప్రారంభించబడింది. అలాగే 5.10.1876 న, నర్మదా వంతెనను, హోల్కర్-నర్మదా వంతెన పేరుతో హిజ్‌ హైనెస్ హోల్కర్ మహారాజా చేత ట్రాఫిక్ కోసం ప్రారంభించ బడింది.[3]

సింధియా - నీముచ్ రైల్వే

మార్చు

ఇండోర్, నీముచ్ మధ్య సర్వేలు 1871-72లో కాలంలో ప్రారంభమయ్యాయి, మొత్తం ప్రాజెక్టుకు ప్రణాళిక, అంచనాలు 1872-73లో భారత ప్రభుత్వానికి సమర్పించబడ్డాయి. గ్వాలియరుకు చెందిన మహారాజా జయజిరావు సింధియా ప్రాజెక్ట్ కోసం సంవత్సరానికి 4.5 శాతం వడ్డీతో రూ. 7.5 మిలియన్లు గ్రాంటు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. అలాగే రైల్వేను 'సింధియా నీముచ్ రైల్వే' గా మార్చారు. ఇందులో ఇండోర్ నుండి ఉజ్జయినీకి ఒక బ్రాంచ్ లైన్ కూడా ఉంది. ఇండోర్ - ఉజ్జయిన్ బ్రాంచ్ లైన్ 1876 ఆగస్టులో ప్రారంభించబడింది. 1879-80లో ఈ రైలుమార్గం పూర్తయింది.

బాంబే, బరోడా, సెంట్రల్ భారతదేశం రైల్వే

మార్చు

1881-82 సంవత్సరంలో హోల్కర్ రైల్వే, సింధియా నీముచ్ రైల్వే ఒకే నిర్వహణలో సమీకృతం అయ్యాయి. తరువాత, రాజపుతానా మాల్వా రైల్వే గా పేరు మార్చబడింది. 1882 లో, ఖాండ్వా-ఇండోర్ రైలుమార్గం అజ్మీర్ వరకు విస్తరించింది. రాజపుతానా మాల్వా రైల్వే యొక్క గుర్తింపు చాలా కొద్దికాలం కొనసాగింది. 1885 జనవరి 1 న భారతదేశం స్వాతంత్ర్యం వచ్చే వరకు దాని నిర్వహణను బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే కంపెనీ స్వాధీనం చేసుకుంది, నిర్వహించింది.[4]

పశ్చిమ రైల్వే

మార్చు

ఇండోర్ రైల్వే స్టేషన్ 1921 లో బాంబే, బరోడా, మధ్య భారత రైల్వే చేత పునఃనిర్మించబడింది. బాంబే, బరోడా, మధ్య భారత రైల్వేతో పాటుగా, ఇతర రాష్ట్ర రైల్వేలతో విలీనంతో పశ్చిమ రైల్వే, ముంబాయి లోని ప్రధాన కార్యాలయాలతో ఏర్పడింది. ఈ విధంగా ఇండోర్ జంక్షన్ పరిపాలన పశ్చిమ రైల్వేకు ఏర్పడింది. 1964-66 లో ఉజ్జయినీ నుండి మాక్సి మీదుగా ఇండోర్ వరకు బ్రాడ్ గేజ్ భాగం పొడిగించబడింది. ఇండోర్-భోపాల్ విభాగాల మధ్య రెండు రైలు మార్గములు ఏర్పాటు 1993-2001 మధ్యలో పూర్తయింది.

కనెక్టివిటీ

మార్చు
 
ఇండోర్ యొక్క కోచ్ సెంటర్

ఇండోర్ జంక్షన్ బిజి అనే పేరు బ్రాడ్ గేజ్ స్టేషన్‌కు చెందినది. దీని మార్గంలో వాయువ్యాన ఉన్న ఉజ్జయినీ జంక్షన్‌తో, దక్షిణాన మౌ కంటోన్మెంట్, ఉత్తరాన దివాస్ జంక్షన్, దక్షిణ తూర్పు వైపు ఖాండ్వా జంక్షన్‌తో అనుసంధానించబడి ఉంది. ఇది ఒక జంక్షన్ స్టేషన్‌గా ఉన్నది కాబట్టి, భోపాల్, ఉజ్జయినీ, గ్వాలియర్, జబల్పూర్, కట్ని, ఖాండ్వా, రత్లాం, బీనాకు రాష్ట్రంలో బాగా అనుసంధానించబడి ఉంది. అదేవిధంగా భారత దేశము లోని దాదాపు ప్రతి ఇతర రాష్ట్రాలకు జంక్షన్ స్టేషనుగా ఉంది.  

ఎలక్ట్రిఫికేషన్

మార్చు

పశ్చిమ రైల్వే 2007-08 కాలం నాటికి ఉజ్జయిని-ఇండోర్, దేవాస్-మాక్సీ విద్యుద్దీకరణను ప్రారంభించింది. ఇది జూన్ 2012 లో పూర్తి అయ్యింది. సుమారుగా రూ. 70 కోట్ల వ్యయంతో కొత్తగా వేయబడిన ఈ వ్యవస్థ నిర్మాణంపై ప్రత్యేక దర్యాప్తు పరీక్షను నిర్వహించారు.[5]

ట్రాక్ గేజ్

మార్చు

ఇండోర్ జంక్షన్ ట్రాక్ గేజ్ కలిగి ఉంది: 1,676 మి.మీ. (5' 6) బ్రాడ్ గేజ్ (బిజి). బ్రాడ్ గేజ్ నెట్వర్క్ విద్యుద్దీకరణ, సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్,, ఫాస్ట్ ప్యాసింజర్‌లకు ఉపయోగించబడుతుంది.

అండర్ కన్స్ట్రక్షన్

మార్చు

రెండు కొత్త ప్లాట్‌ఫారముల నిర్మాణం పురోగతిలో ఉంది. ఇది పశ్చిమ రైల్వే చే ముందే ఆమోదించబడింది. ఇండోర్ రైల్వే స్టేషన్ రాజ్‌కుమార్ రైల్వే ఓవర్ వంతెనకు సమీపంలో పశ్చిమ రైల్వే యొక్క రత్లాం డివిజను అభివృద్ధి చేసిన ఒక ఆధునిక స్టేషన్ సముదాయాన్ని కలిగి ఉంది. ఈ ఎలివేటేడ్ నిర్మాణం భూమి (గ్రౌండ్) అంతస్తులో ప్రయాణికుల స్థలాన్ని అందిస్తుంది. అలాగే, టికెట్ బుకింగ్ కౌంటర్లు, వేచి ఉండే హాళ్ళు మొదలైనవి మొదటి అంతస్తులో ఉంటాయి. ఈ సముదాయం తగినంత పార్కింగ్ సౌకర్యాలను అందిస్తుంది.[6] ఈ సదుపాయం డివిజను యొక్క మొదటి అండర్‌పాస్‌తో ఉంటుంది. ఈ స్టేషన్ ప్రాంగణంలో ఒక బహుళ అంతస్తుల పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది.

ముఖ్యమైన రైళ్లు

మార్చు
 
నర్మదా ఎక్స్‌ప్రెస్ ఇండోర్ నుంచి బయలుదేరింది
  • ఈ కింది రైళ్లు ఇండోర్ జంక్షన్ నుండి ప్రారంభమవుతాయి. బ్రాడ్‌గేజ్:

సూపర్ ఫాస్ట్ రైళ్లు

మార్చు
  • 12228/12227 ఇండోర్ - ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
  • 12415/12416 ఇండోర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  • 12465/12466 రణతంబోర్ ఎక్స్‌ప్రెస్‌ - ఇండోర్, జోధ్పూర్ మధ్య
  • 12913/12914 ఇండోర్ త్రి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ - ఇండోర్, నాగ్పూర్ రైల్వే స్టేషన్ మధ్య
  • 12919/12920 మాల్వా ఎక్స్‌ప్రెస్ - ఇండోర్, జమ్మూ తావి మధ్య
  • 12923/12924 ఇండోర్ - నాగ్పూర్ ఎక్స్‌ప్రెస్
  • 12962/12961 అవంతికా ఎక్స్‌ప్రెస్ - ఇండోర్, ముంబై మధ్య
  • 12973/12974 ఇండోర్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్
  • 22185/22186 ఇండోర్ - భూపాల్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
  • 22187/22188 హబీబ్‌గంజ్ ఇండోర్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
  • 22911/22912 ఇండోర్ - హౌరా శిప్రా ఎక్స్‌ప్రెస్
  • 22941/22942 ఇండోర్ - జమ్మూ తావి ఎక్స్‌ప్రెస్

22646/22645 అహల్యానగరి ఎక్స్‌ప్రెస్ - ఇండోర్, త్రివేండ్రం మధ్య

మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లు

మార్చు
  • 11125/11126 ఇండోర్ - గౌలియార్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  • 11471/11472 ఇండోర్ - జబల్పూర్ ఎక్స్‌ప్రెస్
  • 11701/11702 ఇండోర్ - జబల్పూర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
  • 11703/11704 ఇండోర్ - రేవా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
  • 14317/14318 ఇండోర్ - డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్
  • 19301/19302 ఇండోర్ - యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్
  • 19309/19310 శాంతి ఎక్స్‌ప్రెస్ - ఇండోర్, గాంధీనగర్ మధ్య
  • 19311/19312 ఇండోర్ - పూనే ఎక్స్‌ప్రెస్
  • 19313/19314 ఇండోర్ - పాట్నా ఎక్స్‌ప్రెస్
  • 19323/19324 ఇండోర్ - భూపాల్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
  • 19307/19308 ఇండోర్ - చండీగఢ్ ఎక్స్‌ప్రెస్
  • 19801/19802 ఇండోర్ - కోటా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్
  • 21125/21126 ఇండోర్ - బింద్ ఎక్స్‌ప్రెస్
  • 19321/19322 ఇండోర్ - రాజేంద్ర నగర్ వయా. ఫైజాబాద్ ఎక్స్‌ప్రెస్
  • 19325/19326 ఇండోర్ - అమృత్సర్ ఎక్స్‌ప్రెస్
  • 19711/19712 ఇండోర్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్ వయా. అజ్మీర్
  • 19329/19330 ఇండోర్ - ఉదయపూర్ సిటీ ఎక్స్‌ప్రెస్
  • 14319/14320 ఇండోర్ - బారెల్లీ ఎక్స్‌ప్రెస్

ఎక్స్‌ప్రెస్ / ప్యాసింజర్ రైళ్లు

మార్చు

ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు

మార్చు

ప్యాసింజర్ రైళ్లు

మార్చు
  • 59388/59387 ఇండోర్ - రత్లాం ప్యాసింజర్
  • 59379/59380 ఇండోర్ - మక్షి ప్యాసింజర్
  • 59307/59308 ఇండోర్ - ఉజ్జయినీ ప్యాసింజర్
  • 79306/79305 ఇండోర్ - రత్లాం ప్యాసింజర్

డెమో రైళ్లు

మార్చు
  • 79312 / 79311 ఇండోర్ - రత్లాం డెమో

సబర్బన్ రైళ్లు

మార్చు
ఇండోర్ సబర్బన్ రైల్వే వ్యవస్థ
కోరల్
పాతాల్‌పాని
మోహో
పితంపూర్
రావ్
ఇండోర్ న్యూ రాజేంద్ర నగర్ టెర్మినస్
రాజేంద్ర నగర్
ఇండోర్ లోకమాన్య నగర్
ఇండోర్ సైఫీ నగర్
ఇండోర్ జంక్షన్ ఎంజి
ఇండోర్ లక్ష్మిబాయి నగర్
శిప్రా
దేవస్
 
ఇండోర్ జంక్షన్ ఎంజి వద్ద ఒక మీటర్ గేజ్ రైలు

ఇండోర్ సబర్బన్ రైల్వే ఇండోర్ మెట్రోపాలిటన్ రీజియన్లో పనిచేసే ప్రయాణికుల రైలు వ్యవస్థ. ఇది భారత రైల్వే జోనల్ పశ్చిమ రైల్వేచే నిర్వహించ బడుతోంది. ఇది మధ్య ప్రదేశ్ లోనే అత్యధిక ప్రయాణీకుల సాంద్రత కలిగిన పట్టణ రైల్వే వ్యవస్థ. దీని మార్గాల్లో ప్రయాణించే రైళ్లు సాధారణంగా స్థానిక రైళ్ళు లేదా స్థానికులు (లోకల్) గా సూచిస్తారు. ఇండోర్ అనేది విస్తృతమైన రేడియల్ కమ్యూటర్ రైల్వే నెట్వర్క్ కేంద్రంగా ఉంది. ఇది పరిసర మెట్రోపాలిటన్ ప్రాంతాలకు సేవలు అందిస్తోంది. రత్లాంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతీయ నెట్‌వర్క్ నకు విరుద్ధంగా, రెండురైలు మార్గాలు ప్రస్తుతం ఇండోర్‌ను క్రాస్‌ అవుతున్నాయి: ఉత్తర మధ్య, దక్షిణ శివారు ప్రాంతాల మధ్య నడుపుతున్న నగర కేంద్రం గుండా మీటర్ గేజ్ మార్గం వెళుతుంది, ఉత్తరాన ఉన్న ఉజ్జయినీలోని సుదూర పట్టణాల మధ్య దక్షిణాన ఖాండ్వా ఉన్నాయి.

ఇండోర్ సబ్-అర్బన్ స్టేషన్లు

మార్చు

ఇండోర్ నగరంలో 9 ఇతర రైల్వే స్టేషన్లు ఉన్నాయి అవి:

స్టేషన్ పేరు స్టేషన్ కోడ్ రైల్వేజోన్ మొత్తం ఫ్లాట్‌ఫారములు
ఇండోర్ జంక్షన్ INDM పశ్చిమ రైల్వే 4
లక్ష్మిబాయి నగర్ రైల్వే స్టేషన్ ILBN పశ్చిమ రైల్వే 3
రాజేంద్ర నగర్ రైల్వే స్టేషన్ RJQ పశ్చిమ రైల్వే 3
లోకమాన్య నగర్ రైల్వే స్టేషన్ ILN పశ్చిమ రైల్వే 2
మోహో రైల్వే స్టేషన్ MHOW పశ్చిమ రైల్వే 2
రావ్ రైల్వే స్టేషన్ RAU పశ్చిమ రైల్వే 2
సైఫీ నగర్ రైల్వే స్టేషన్ SFN వెస్ట్రన్ రైల్వే 1
పాతాల్‌పాని రైల్వే స్టేషన్ PTP వెస్ట్రన్ రైల్వే 1

ఇవి కూడా చూడండి

మార్చు
  • ఉజ్జయినీ జంక్షన్ రైల్వే స్టేషన్
  • భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్
  • భూపాల్ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్
  • జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్

మూలాలు

మార్చు
  1. "Holkars Of Indore". Archived from the original on 2013-10-30. Retrieved 2015-04-07.
  2. "IR History: Part - II (1870 - 1899)". IRFCA. Retrieved 2012-11-21.
  3. "History of Ratlam Division" (PDF). Western Railway.
  4. "A Parsi engine driver's wage slip of 1932". Railways of Raj Blog. Archived from the original on 2016-06-01. Retrieved 2015-04-07.
  5. "Electric trains to run on new Indore-Ujjain track". The Economic Times. Archived from the original on 2014-12-20. Retrieved 2012-06-23.
  6. "Indore to get a modern station complex". Daily News and Analysis. Retrieved 2014-01-09.

బయటి లింకులు

మార్చు