ఇల్లిందల సరస్వతీదేవి
ఇల్లిందల సరస్వతీదేవి (1918-1998) తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి.
వ్యక్తిగత జీవితం
మార్చుఇల్లిందల సరస్వతీదేవి 1918 జూన్ 15 న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యవృత్తిలో కొనసాగుతున్న భర్త సహకారంతో ఆమె మెట్టినింట విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. స్వయంకృషితో ఇంగ్లీషు, హిందీ నేర్చుకున్నారు.[1] జర్నలిజంలో డిప్లమా పొందారు.[2]
రచన రంగం
మార్చుఇల్లిందల సరస్వతీదేవి 250 కథలను, 5 నవలలు రచించారు. 5 వ్యాససంపుటాలు, జీవితచరిత్రలు రచించారు. బాలసాహిత్యకారిణిగా నాటికలు, రేడియో నాటికలు రచన చేశారు. కృష్ణాపత్రికలో ఇయంగేహేలక్ష్మీ, ఆంధ్రపత్రికలో వనితాలోకం శీర్షికలు నిర్వహించారు. వివిధ భాషల్లోంచి ఎన్నో పుస్తకాలను అనువాదాలు కూడా చేశారు. కథాసంకలనాలు వెలువరించారు.[3]
- దరిజేరిన ప్రాణులు
- ముత్యాల మనసు
- స్వర్ణకమలాలు
- తులసీదళాలు
- రాజహంసలు
- కళ్యాణ కల్పవల్లి
- మనము - మన ఆహారము (అనువాదము)
- అనుపమ (నవల)
- భారతనారి - నాడూ నేడూ (భారతదేశంలో స్త్రీల ప్రతిపత్తి)
మనము మన ఆహారము
మార్చుకె.టి.అచ్చయ్య భారత ఆహార చరిత్రను గురించి సాధికారికమైన ఆంగ్ల గ్రంథాలు రచించిన ఆహార శాస్త్రవేత్త, ఆహార చరిత్రకారుడు. మనం నిత్యజీవితంలో తినే ఆహారంలో ఏ కాయగూరలు, పళ్ళు ఏయే ప్రదేశాల్లో జన్మించాయో, ఎప్పుడు భారతదేశం వచ్చాయో, ఏ కాలం నాటీ ప్రజలు ఎటువంటీ ఆహారాన్ని భారతదేశంలో స్వీకరించారో ఆహార చరిత్రలో చర్చకు వస్తుంది. ఈ గ్రంథం అంత లోతైనది కాదు. పలు ఆకరాల నుంచి భారతీయుల ఆహారంలోని న్యూట్రిషన్స్ గురించి స్వీకరించి వాటిని తేలికగా శాస్త్రంతో పరిచయం లేనివారికి కూడా అర్థమయ్యేలా చేయడం దీని లక్ష్యం. భారతదేశానికి సంబంధించిన పలు అంశాలను సవివరంగా భారత పాఠకులకు అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన శీర్షిక - భారతదేశం-ప్రజలూ. ఆ శీర్షికన నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ద్వారా ఈ అనువాద రచనను సరస్వతీదేవి రచించగా 1981లో ప్రచురితమైంది.[4]
సామాజికరంగం
మార్చుతెలుగు మహిళల కోసం 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1934లో హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలిని స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు మూడేళ్ళపాటు జైలు విజిటరుగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సినిమా అవార్డు కమిటీల్లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
పురస్కారాలు, గౌరవాలు
మార్చు- 1982లో స్వర్ణకమలాలు కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.
- స్వర్ణకమలాలు కథాసంకలనానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
- 1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి లభించింది.
మూలాలు
మార్చు- ↑ https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%7C బహుభాషాకోవిదులైన తెలుగు రచయితలు
- ↑ ఆంధ్రరచయిత్రుల సమాచార సూచిక. సం. కె. రామలక్ష్మి. ఆం. ప్ర. సాహిత్య ెకాడమీ. 1968.
- ↑ సామాజిక సాహిత్యవేత్త:తె.వె.బృందం:తెలుగు వెలుగు:మార్చి 2014:పే.22,23
- ↑ కె.టి అచ్చయ్య (1981). మనము మన ఆహారం. Translated by ఇల్లిందల సరస్వతీదేవి. నేషనల్ బుక్ ట్రస్ట్.
5. శీలా సుభద్రాదేవి.. దార్శనికకథకురాలు ఇల్లిందల సరస్వతీదేవిగారు వ్యాసం. ఏప్రిల్ 3019. పాలపిట్ట పత్రిక