ఇషా సింగ్
ఇషా సింగ్ (ఆంగ్లం: Esha Singh)(జననం 2005 జనవరి 1) భారతీయ అమెచ్యూర్ షూటర్. 2019లో జర్మనీలోని జూల్ నగరంలో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో రజతం సాధించింది. అలాగే ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలోనూ (AP60W), అలాగే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సడ్ టీం (APMIX)విభాగంలోనూ స్వర్ణ పతకాలు సాధించింది[1].తెలంగాణకు చెందిన ఇషా సింఘ్, 2019లో తైవాన్లో జరిగిన ఎసియన్ ఎయిర్ గన్ ఛాంపియన్ షిప్‌లో కూడా స్వర్ణం సాధించింది.[2]
2018లో 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ విభాగంలో ఆమె జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. ఆమె కేవలం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనే కాకుండా, 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్ విభాగంలోనూ పోటీ పడుతుంటారు.[3][1] ప్రస్తుతం ఆమె త్వరలో జరగబోయే టోక్యో ఒలంపిక్స్‌కు ప్రాతినిద్యం వహిస్తున్న జాతీయ జట్టుకు అందిస్తున్న శిక్షణ శిబిరానికి కూడా ఎంపికయ్యాంది.[4]
2022లో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. మే 13న జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంటులో ఇషాసింగ్, మను భాకర్, పాలక్‌తో కూడిన భారత త్రయం 16-8 తేడాతో జార్జియాపై అద్భుత విజయం సాధించింది.[5]
వ్యక్తిగత జీవితం, నేపథ్యం
మార్చుసచిన్ సింగ్, శ్రీలతల ఏకైక కుమార్తె ఇషా సింఘ్. 2005, జనవరి 1న హైదరాబాద్‌లో ఆమె జన్మించింది. సచిన్ ర్యాలీ డ్రైవర్. షూటింగ్ కన్నా ముందు ఇషాకు గో కార్టింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కేటింగ్‌లో క్రీడల్లో కూడా ప్రవేశం ఉంది. గచ్చిబౌలీ స్టేడియంలోని షూటింగ్ రేంజ్‌ను చూసిన తర్వాత షూటింగ్ పట్ల ఎక్కడ లేని ఆసక్తిని ప్రదర్శించిన ఆమె దాన్నే కెరియర్‌గా ఎంచుకుంది. స్టేడియంకి వెళ్లాలంటే గంటల కొద్దీ ప్రయాణం చెయ్యాలి. మరో దారి లేకపోవడంతో రైల్లో వెళ్ళేది. అయితే ఇంటి వద్ద ప్రాక్టీస్ కోసం ఆమె తండ్రి పేపర్ టార్గెట్ రేంజ్‌ను సిద్ధం చేశాడు. ఆ తర్వాత ఆమె మహారాష్ట్రలోని పూణెలో ఒలంపిక్ మాజీ విజేత గగన్ నారంగ్ నిర్వహిస్తున్న గ్లోరీ అకాడమీకి శిక్షణ కోసం వెళ్ళింది.[3]
షూటింగ్ కొసం తన చిన్న నాటి సరదాలను త్యాగం చెయ్యాల్సి వచ్చిందంటుంది ఇషా. అయితే ఆ క్రీడ పట్ల తనకు ఉన్న ఇష్టం తన దృష్టిని మరోవైపు మరలకుండా చేసిందని చెప్పింది.తన తల్లిదండ్రుల ప్రేరణ కారణంగా తాను ఈ స్థాయికి చేరుకోగల్గానన్నది ఆమె మాట. తన బిడ్డ నిరంతరం వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్న ఆమె తండ్రి బిడ్డ కెరియర్ కోసం తన మెటార్ స్పోర్ట్స్ కెరియర్‌ని ఫణంగా పెట్టారు. తండ్రి, కూతుళ్లు ఇద్దరూ పోటీల కోసం వెళ్లినప్పుడు ఆయన నిర్వహిస్తున్న క్రీడా సామాగ్రీ దుకాణాన్ని చూసుకుంటారు ఆమె తల్లి శ్రీలత.[3]
కోవిడ్-19పై పోరాటంలో భాగంగా పీఎం-కేర్స్ ఫండ్‌కి 30వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే 18 ఏళ్లలోపు పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ను కూడా అందుకున్నారు ఇషా.[6]
వృత్తి జీవితం
మార్చు2014లో తన షూటింగ్ కెరియర్‌ను ప్రారంభించిన ఇషా కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది . అయితే జాతీయ స్థాయిలో మాత్రం రాణించేందుకు మరో మూడేళ్లు పట్టింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 62వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కామన్ వెల్త్ గేమ్స్, యూత్ ఒలంపిక్స్‌లో స్వర్ణ పతక విజేత మను భకర్, షూటర్ హీనా సిద్ధు కన్నా మెరుగైన ప్రదర్శన చేసి స్వర్ణపతకం సాధించారు. అలా 13 ఏళ్ల వయసులోనే సీనియర్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. అటు జూనియర్ ఇటు సీనియర్ విభాగంలో మొత్తం ఐదు పతకాలు పొందింది. ఆ ప్రదర్శనతో మరింత కష్టబడితే దేశానికి పతకాలు సాధించగలనన్న విశ్వాసం ఆమెలో ఏర్పడింది.[3][7][8][6]
- 2019 జనవరిలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ అండర్-17 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలిచింది.[9]
- 2019 మార్చి – ఏప్రిల్ నెలల్లో తైవాల్ జరిగిన ఏసియన్ ఎయిర్ గన్ ఛాంపియన్ షిప్స్‌లో జూనియర్ విభాగంలో ఇషా బంగారు పతకాన్ని సాదించింది.[9]
- 2019 జులైలో జర్మనీలోని జూల్ నగరంలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకం సాదించింది. అక్కడే జరిగిన మిక్స్‌డ్ టీం ఈవెంట్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం కూడా కైవసం చేసుకుంది. ఇక 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ విభాగంలో ఆమె ర్యాంకింగ్ 22 కాగా, 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 41వ స్థానంలో ఉంది.[1] అదే ఏడాది నవంబర్లో ఖతర్‌లోని దోహాలో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జూనియర్ స్థాయిలో వ్యక్తిగత విభాగంలోనూ, మిక్స్‌డ్ విభాగంలోనూ స్వర్ణ పతకాలు గెలిచింది.[1]
- టోక్యో ఒలంపిక్స్‌కు పోటీ పడుతున్న ఇండియన్ కోర్ టీంకు కూడా ఆమె ఎంపికయింది. అయితే 2020 ఫిబ్రవరిలో జరిగిన ఒలంపిక్స్ క్వాలిఫైంగ్ పోటీల్లో టాప్ 2లో నిలవలేకపోయింది. అయితే కోవిడ్ కారణంగా ఒలంపిక్స్ వాయిదా పడటంతో ఆమెకు మరో అవకాశం వచ్చింది.[4]
- 2022లో జరగనున్న యూత్ ఒలంపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్, ఏసియా గేమ్స్, ఆ పై 2024లో జరగనున్న ఒలంపిక్స్‌పై కూడా ఆమె దృష్టి సారించింది.[6]
ముఖ్యమంత్రి సత్కారం
మార్చు- జర్మనీ వేదికగా జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో ఇషాసింగ్ హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన సందర్భంగా 2022 జూన్ 2న హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నిఖత్ జరీన్ సత్కరించబడి, 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహంతోపాటు జూబ్లీహిల్స్ (బంజారాహిల్స్) ప్రాంతంలో నివాస స్థలాలాన్ని బహుమతిగా అందుకున్నది. ఈ కార్యక్రమంలో నిఖత్ జరీన్ తల్లిదండ్రులుసచిన్ సింగ్, శ్రీలత, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[10][11]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "ISSF - International Shooting Sport Federation - issf-sports.org". www.issf-sports.org. Retrieved 2021-02-18.
- ↑ Staff, Scroll. "Asian Airgun Championships: Sarabjot Singh, Esha Singh win gold in junior air pistol". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ 3.0 3.1 3.2 3.3 "In a battle of teens, 13-year-old Esha Singh upstages Manu Bhaker at Shooting Nationals". The Indian Express (in ఇంగ్లీష్). 2018-11-30. Retrieved 2021-02-18.
- ↑ 4.0 4.1 Jun 27, B. Krishna Prasad / TNN /; 2020; Ist, 09:44. "Esha Singh makes NRAI core training group | More sports News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2022-06-03). "ప్లేయర్లకు ప్రభుత్వ అండ". Namasthe Telangana. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
- ↑ 6.0 6.1 6.2 "ఈశా సింగ్ - తెలంగాణ షూటర్: 'తుపాకీ పేలుతున్న శబ్దం నా చెవులకు సంగీతంలా వినిపిస్తుంది' - BBC ISWOTY". BBC News తెలుగు. Retrieved 2021-02-18.
- ↑ "14 साल की उम्र में रोजाना 4 घंटे शूटिंग की प्रैक्टिस और 1 घंटा योग". Dainik Bhaskar (in హిందీ). 2019-04-06. Retrieved 2021-02-18.
- ↑ Staff, Scroll. "Shooting Nationals: Teenager Esha Singh pips Manu Bhaker to clinch triple crown". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ 9.0 9.1 PTI. "Shooter Esha Singh reveals her father's sacrifice to support her career". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ telugu, NT News (2022-06-02). "నిఖత్ జరీన్, ఇషాసింగ్‌కు రెండేసి కోట్లు". Namasthe Telangana. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
- ↑ "నిఖత్ జరీన్, ఇషా సింగ్‌కు రూ.2 కోట్లు, ఇంటి స్థలం.. కేసీఆర్ బహుమతి". Samayam Telugu. 2022-06-01. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.