ఎదురులేని మనిషి (1975 సినిమా)
ఎదురులేని మనిషి 1975, డిసెంబర్ 12న విడుదలైన తెలుగు చిత్రం. నిర్మాత చలసాని అశ్వినీదత్ తొలిచిత్రం. వైజయంతి మూవీస్ పతాకం పై నిర్మించబడింది. రామారావు కొత్తపంధాలో ఈ చిత్రంలో కె.బాపయ్య చూపారు. దుస్తులు, పాటలు, డాన్సులు మూడింటిలోనూ అప్పటికి ఎన్.టి.ఆర్ ఇమేజికి భిన్నంగా చిత్రంలో చూపబడ్డారు.[1] ఈ సినిమాకు మూలం "జానీ మేరా నామ్".
ఎదురులేని మనిషి (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
నిర్మాణం | అశ్వనీ దత్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, ప్రభాకర రెడ్డి |
నిర్మాణ సంస్థ | వైజయంతీ మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చుఈ చిత్రం శేఖర్ (ఎన్. టి. రామారావు) తో ప్రారంభమవుతుంది. తన బాల్యంలో అతని తండ్రి (సత్యనారాయణ) ని ఇద్దరు భయంకరమైన దుర్గార్గులైన రంగా (ప్రభాకర్ రెడ్డి) & సర్కార్ (కాంతారావు) లు హత్య చేస్తారు. ఆ హత్య జరిగినపుడు వారిని గుర్తించి తన తమ్ముడు గోపీతో సహా పారితోతాడు. కాలక్రమంలో వారు విడిపోతారు.
తండ్రిని హత్య చేసిన వారిపై పగ సాధించాలన్న పట్టుదల, తమ్ముని కలుసుకోవాలన్న ఆవేదన పట్టుదల కలిగి అతను ఎవరికీ తలఒగ్గడు.స్మగ్లర్ల కార్యకలాపాలను అడుగడుగునా అడ్డు తగులుతాడు. అతనికి లత పరిచయమవుతుంది. ఆమె గత్యంతరంలేక స్మగ్లర్ల చేతిలో బందీ అయిందని పరిచయం పెరిగిన తర్వాత తెలుసుకుంటాడు.
స్మగ్లర్ల బాధను ఆమెకు తప్పించడానికి ప్రయత్నం ప్రారంభించాడు. తన తండ్రిని హత్య చేసింది కూడా స్మగ్లర్లేనని తెలుసుకున్నాడు. చివరకు స్మగ్లర్ల అంతు చూసాడు.
తారాగణం
మార్చు- ఎన్.టి.రామారావు
- వాణిశ్రీ
- జగ్గయ్య
- కాంతారావు - ప్రతినాయకుడు
- ప్రభాకరరెడ్డి - రంగారావుగా
- రాజబాబు
- అల్లు రామలింగయ్య
- పద్మప్రియ
- నిర్మల
- గిరిజారాణి
- శశిరేఖ
- వాణి
- నాగశ్రీ
- జూనియర్ భానుమతి
- జ్యోతిలక్ష్మి
- వెంకటేశ్వరరావు
- రామదాసు
- ఆనంద్ మోహన్
- భీమరాజు
- జగ్గారవు
- కేశవరావు
- తార కృష్ణ
- నర్రా వెంకటేశ్వరరావు
- మాస్టర్ రాము
- సత్యనారాయణ
- హేమలత
సాంకేతిక వర్గం
మార్చు- పాటలు: ఆత్రేయ
- కథ, సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణమూర్తి
- నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- సంగీతం: కె.వి. మహదేవన్
- ఛాయాగ్రహణ: ఎస్.వెంకటరత్నం
- కూర్పు: అక్కినేని సంజీవి
- కళ: ఎస్.కృష్ణారావు
- పోరాటాలు: మాధవన్
- నృత్యాలు: శ్రీను
- మేకప్: మల్లిఖార్జునరావు, పీతాంబరం
- దుస్తులు: కె.సూర్యారావు
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సి.ఆర్.మోహన్
- నిర్మాత: సి.అశ్వనీదత్ - నిర్మాతగా ఇది అతని మొదటి చిత్రం
- దర్శకుడు: కె.బాపయ్య
- బ్యానర్: పల్లవి ఆర్ట్ పిక్చర్స్
- విడుదల తేదీ 1975 డిసెంబరు 12
పాటలు
మార్చు- కసిగా ఉంది, కసికసిగా ఉంది, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కంగారు ఒకటే కంగారు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. పులపాక సుశీల
- హే కృష్ణా ముకుందా మురారీ , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఎంతవాడు ఎంతవాడు , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
- ఎక్కడో ఎక్కడో తగలరాని , రచన: ఆచార్య ఆత్రేయ గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఉందా ఖలేజాఉంటే లేజా కొందరు ఇస్తామంటారు, రచన: ఆత్రేయ, గానం.పి . సుశీల.
మూలాలు
మార్చు- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (14 December 1975). "ఎదురులేని మనిషి చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 3. Retrieved 28 November 2017.[permanent dead link]
. 2. ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.