ఎస్.ఎన్. చారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, రంగస్థల నటుడు, దర్శకుడు, పాత్రికేయుడు.

ఎస్.ఎన్. చారి
జననంసోమనర్సింహ్మా చారి చొల్లేటి
జూలై 10, 1957
సూరారం, రామన్నపేట మండలం యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
నివాస ప్రాంతంమోత్కూర్, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
ప్రసిద్ధిచిత్రకారుడు, రంగస్థల నటుడు, దర్శకుడు , పాత్రికేయుడు
భార్య / భర్తకళావతి
పిల్లలుశివరంజని, శ్వేత, రాంచరణ్ తేజ్, శిరీష
తండ్రిచంద్రయ్య
తల్లిలక్ష్మమ్మ

జననం మార్చు

ఎస్.ఎన్. చారి 1957, జూలై 10న చంద్రయ్య, లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని సూరారంలో జన్మించాడు. గత కొన్ని సంవత్సరాలుగా మోత్కూర్ మండల కేంద్రంలో నివసిస్తున్నాడు.

వివాహం మార్చు

ఈయనకు కళావతితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు (శివరంజని, శ్వేత, శిరీష), ఒక కుమారుడు (రాంచరణ్ తేజ్)

చిత్రకళారంగం మార్చు

తన 12వ ఏటనే చిత్రకళలపై ఉన్న ఆసక్తితో అటువైపుగా దృష్టి సారించాడు. నందమూరి తారక రామారావు. నిలువెత్తు కటౌట్ ను ప్రాథమిక దశలోనే వేశాడు. చిత్రకళలో టి.టి.సి.లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

కళారంగం మార్చు

సామాన్య కళాకారునిగా జీవితాన్ని ప్రారంభించిన చారి, అభ్యుదయ కళానిలయాన్ని ప్రారంభించాడు. తన సంస్థ ద్వారా హుష్ కాకి, పద్మవ్యూహం, గప్ చుప్, గజేంద్రమోక్షం, కోహినూర్ మొదలైన నాటికలు ప్రదర్శించాడు.

1989లో అభినయ కళాసమితిని స్థాపించి, మోత్కూర్లో కళారంగ అభివృద్ధికి కృషిచేశాడు. మోత్కూర్, ఆలేరు, దేవరుప్పుల, తుంగతుర్తి, కోదాడ, మునిపంపుల, తిర్మలగిరి, తొర్రూర్, ఖమ్మం, కొడకండ్ల, హైదరాబాద్, పాలకుర్తి, జనగాం, వరంగల్, మొండ్రాయి, సూర్యాపేట, భువనగిరి వంటి వివిధ తెలంగాణ ప్రాంత పరిషత్తులలో పాల్గొని...జాగృతి, చీకటి బతుకులు, రేపటి పౌరులు, నవతరం, సందిగ్ధ సంధ్య, కాలగర్భం వంటి నాటికలు ప్రదర్శించాడు.

నాటకరంగంలో పాత్రలను పోషించాడు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు, ప్రత్యేక బహుమతులు ప్రముఖుల చేతులమీదుగా అందుకున్నాడు. వివిధ పోటీల్లో న్యాయనిర్ణేతగా పాల్గొని సాంస్కృతిక రంగానికి సేవలు అందించాడు. గ్రామాలలో నిర్వహించే యక్షగానాలు, పౌరాణిక నాటకాలకు మేకప్ సహకారాన్ని అందించాడు.

బహుమతులు మార్చు

  • 1987లో వరంగల్ జిల్లాలో జరిగిన తెలంగాణ స్థాయి పోటీలలో కిట్టిగాడు (హుష్ కాకి), చుట్టం (పద్మవ్యూహం) వంటి హాస్య పాత్రలలో నటించి అప్పటి వరంగల్ కలెక్టర్ ఎ.చెంగప్పచే బహుమతులు అందుకున్నాడు.
  • 1989లో పోచంపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నాగభూషణం సమక్షంలో, 1984లో హైదరాబాదులో జరిగిన రాష్ట్ర వృత్తి కళాకారుల సదస్సులో అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య, గవర్నరు రాంలాల్, మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు, సినీనటులు జమున, దాసరి నారాయణరావు, ధూళిపాల సమక్షంలో రక్తకన్నీరు నాటకంలోని ఒక ఘట్టాన్ని ఏకపాత్రాభినయంగా నటించి బహుమతి అందుకున్నాడు. రక్తకన్నీరు ఏకపాత్రాభినయాన్ని 75కు పైగా ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నాడు.

పాత్రికేయరంగం మార్చు

పురస్కారాలు మార్చు

  1. తెలంగాణ ప్రతిభా పురస్కారం - 2017 (నటరాజ్ డ్యాన్స్ అకాడమీ, హైదరాబాద్, 28.07.2017) - పాత్రికేయరంగంలో కృషి[1][2]

మూలాలు మార్చు

  1. సాక్షి. "కళాకారులకు ప్రతిభా పురస్కారాలు". Archived from the original on 29 July 2017. Retrieved 29 July 2017.
  2. ఆంధ్రజ్యోతి. "పలువురికి ప్రతిభా పురస్కారాలు". Retrieved 29 July 2017.[permanent dead link]