ఎస్. రాధాకృష్ణ

సినీ నిర్మాత

చినబాబు గా సుపరిచితుడైన ఎస్.రాధాకృష్ణ ఒక భారతీయ సినిమా నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతల్లో ఒకడు. ఆయన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత. ఆయన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో అనేక సినిమాలని నిర్మించాడు.[1] ఆయన హారిక & హస్సీన్ క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ క్రింద చిత్రాలను నిర్మిస్తున్నాడు.

ఎస్. రాధాకృష్ణ
జననం
వృత్తిసినిమా నిర్మాత
తల్లిదండ్రులు
  • సూర్యదేవర నాగేంద్రమ్మ
    (మ. 2024 మే 30) (తల్లి)
వెబ్‌సైటుహారిక & హస్సైన్ క్రియేషన్స్

ఆయన చిత్రసీమలో నిర్మాతగా "ఆత్మకథ" చిత్రం ద్వారా 1988లో ప్రవేశించాడు. ఆ చిత్రం 1985లో మహేష్ భట్ తీసిన "జనమ్" చిత్రం యొక్క రీమేక్ చిత్రం.[2][3][4]

సంవత్సారాల అనంతరం ఆయన డి.వి.వి.దానయ్య నిర్మాతతో కలసి సహనిర్మాతగా సూపర్ హిట్ చిత్రాలైన జులాయి,[5] కెమెరామెన్ గంగతో రాంబాబు, నాయక్ చిత్రాలను తీసాడు. తరువాత ఆయన బాక్సాఫీసు హిట్ చిత్రాలైన సన్నాఫ్ సత్యమూర్తి (2015),, అ ఆ (2016).[6] చిత్రానను నిర్మిచాడు.

ప్రారంభ జీవితం

మార్చు

రాధాకృష్ణ తెనాలిలో పుట్టి పెరిగాడు. ఆయన పూర్వీకులంతా వ్యవసాయదారులే. ఆయన నాన్నగారు న్యాయవాదిగా పనిచేసేవారు. రాధాకృష్ణ బీకామ్‌ చదివే రోజుల్లో ఆయన తండ్రిగారు పార్ట్‌టైం లెక్చరర్‌గా ఆయన కాలేజీలో తరగతులు చెప్పేవారు. ఎందుకో తెలీదు కానీ వీలైనంత వరకూ ఆయన తరగతులకు వెళ్లకుండా ఉండటానికే ప్రయత్నించేవారాయన. ఆయన డిగ్రీలో ఉండగానే వారి అక్క కూడా కాలేజీలో లెక్చరర్‌గా చేరింది. నాన్న న్యాయవాదైనా, అక్క లెక్చరర్‌గా మారినా అవేవీ ఆయనపైన పెద్దగా ప్రభావం చూపించలేదు. అందుకే బీకామ్‌ అవగానే ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్‌ బయల్దేరాడు. హైదరాబాద్‌లో రకరకాల ప్రయత్నాలు చేస్తోన్న క్రమంలో ఇన్సూరెన్స్‌ సంస్థకు దరఖాస్తు చేశా. వాళ్లు పెట్టిన పరీక్షలో అర్హత సాధించడంతో ఇరవై రెండేళ్ల వయసులోనే ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలో ఉద్యోగిగా నా కెరీర్‌ ప్రారంభమైంది. ఆ కాలంలో ఆయన ఎక్కువగా సినిమాలు చూసేవారు. ఆయనకు ఫ్రెండ్స్‌ సర్కిల్‌ కూడా చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఏ పనైనా స్నేహితులతో మాట్లాడాక చేయడమే ఆయనకు అలవాటు. ఉద్యోగంలో ఉండగానే ఆహుతి ప్రసాద్‌ లాంటి కొందరు సినీ ప్రియులు ఆయనకు పరిచయమయ్యారు. వాళ్లంతా అప్పుడు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు చేస్తుండేవారు. ఆయనకూ సినిమాల పైన ఆసక్తి ఉండటంతో వాటి గురించి చర్చిస్తూ ఎక్కువ సమయం వాళ్లతోనే గడిపేవారు. ఆ క్రమంలోనే ఆయనకు దర్శకులు విక్టరీ మధుసూదనరావు గారితో పరిచయమైంది. ఆ పరిచయం మంచి స్నేహంగా మారి తరచూ ఆయనకు కలిసే స్థాయికి చేరింది. ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చిందీ, ఎత్తుపల్లాల్ని ఎలా ఎదుర్కొంది... ఇలా పరిశ్రమకు సంబంధించిన చాలా విషయాలు చెప్పేవారు. ఆ రోజుల్లో నిర్మాతలంటే బయట కూడా చాలా విలువుండేది. అందుకే తెలీకుండానే ఆయనక్కూడా ఓ సినిమా నిర్మించాలనిపించింది. మధుసూదనరావుగారి లాంటి దర్శకుడి అండ ఉన్నప్పుడు అదేమీ పెద్ద కష్టమైన పని కాదనుకున్నారు. ఆయన స్నేహితులు హరిప్రసాద్‌, భాస్కర్‌, రమణ, భాస్కర్‌ రెడ్డి లాంటి కొందరి సహాయంతో రిస్కయినా ఫర్వాలేదు అనుకొని సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అలా మొదలైందే ‘ఆత్మకథ’.[7]

ఆయన సినిమా రంగ ప్రవేశాన్ని 1988లో వీరమాచనేని మధుసూదనరావు గారి దర్శకత్వంలో "ఆత్మకథ"తో ప్రవేశించాడు. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, శరత్ బాబు, కుష్బూ , జయసుధ నటించారు. అనుభవం లేని కారణంగా ఈ చిత్రం విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమా అపజయాన్ని చవి చూసిన ఆయన మళ్లీ ఇరవై ఏళ్ల తరువాత మరోసారి తనను తాను నిరూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. 25 సంవత్సరాల అనంతరం ఆయన నిర్మాతగా, డి.వి.వి దానయ్యతో సహనిర్మాతగా అనేక సినిమాలను నిర్మించాడు.

అజ్ఞాతవాసి సినిమా

మార్చు

జులాయి సినిమా మొదలుకొని పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో పరాజయం ఎదురైంది.[8]

చిత్రాలు

మార్చు

నిర్మాతగా

మార్చు
సంవత్సరం సినిమా పేరు నటీనటులు వివరాలు
1988 ఆత్మకథ మంచు మోహన్ బాబు, శరత్ బాబు, జయసుధ, కుష్బూ
2012 జులాయి అల్లు అర్జున్, ఇలియానా డి.వి.వి.దానయ్యతో సహ నిర్మాణం
2012 కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్, తమన్నా వ్యాఖ్యాత
2013 నాయక్ (సినిమా) రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, అమలా పాల్ వ్యాఖ్యాత
2015 సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్, సమంతా రుథ్ ప్రభు
2016 అ ఆ నితిన్, సమంతా రుథ్ ప్రభు
2016 బాబు బంగారం వెంకటేష్, నయన తార వ్యాఖ్యాత
2016 ప్రేమం అక్కినేని నాగ చైతన్య, శ్రుతి హాసన్ వ్యాఖ్యాత
2018 అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్
2018 NTR28 ఎన్.టి.ఆర్. (తారక్), పూజా హెగ్డే
2018 వెంకీ75 (ప్రొడక్షన్ నెం. 6) దగ్గుబాటి వెంకటేష్

మూలాలు

మార్చు
  1. "A..Aa audio gets good response". timesofindia.indiatimes.com. 19 May 2016.
  2. "S. Radha Krishna Interview – 2016". idlebrain.com. 3 June 2016.
  3. "A...Aa review: Simple tale, effectively told". The Hindu. Retrieved 2016-06-03.
  4. Yellapantula, Suhas. "A..Aa Review: Please welcome Samantha the actress". The New Indian Express. Archived from the original on 2016-06-05. Retrieved 2016-06-03.
  5. "Nithiin's A.. Aa.. launched". deccanchronicle.com. 25 Sep 2015.
  6. "Babu Bangaram Movie Audio Launch Date confirmed: Venkatesh". 14 April 2016. Archived from the original on 25 జూలై 2016. Retrieved 26 మార్చి 2018.
  7. "డబ్బులు పోకపోతే చాలనుకున్నా!". www.eenadu.net. Archived from the original on 2018-03-27. Retrieved 2018-03-27.
  8. "అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూటర్లను ఖుషీ చేసిన నిర్మాత రాధాకృష్ణ". asianetnews. Retrieved 2018-03-27.

బయటి లింకులు

మార్చు