జాజుల సురేందర్
జాజల సురేందర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]
జాజుల సురేందర్ | |||
| |||
పదవీ కాలం 2018 - 2023 డిసెంబర్ 03 | |||
ముందు | ఏనుగు రవీందర్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | కె. మదన్ మోహన్ రావు | ||
నియోజకవర్గం | ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1973, మార్చి 25 నల్లమడుగు, లింగంపేట్ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | నర్సయ్య - హనుమవ్వ | ||
జీవిత భాగస్వామి | భార్గవి | ||
సంతానం | ఇద్దరు కుమారులు |
జననం, విద్య
మార్చుసురేందర్ 1973, మార్చి 25న నర్సయ్య - హనుమవ్వ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, లింగంపేట్ మండలంలోని నల్లమడుగు గ్రామంలో జన్మించాడు. హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని సర్దార్ పటేల్ కాలేజ్ నుండి 1995లో గ్రాడ్యుయేషన్ (బికాం) పూర్తి చేశాడు.[4][5]
వ్యక్తిగత జీవితం
మార్చుసురేందర్ కు భార్గవితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
రాజకీయ విశేషాలు
మార్చుకాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేందర్, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో 24,000 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిపై 31,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[7][8] 2018లో శాసన సభ్యునిగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[9][10] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[11]
ఇతర వివరాలు
మార్చునేపాల్, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సందర్శించాడు.
మూలాలు
మార్చు- ↑ "Home AMP". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-21.
- ↑ "Yellareddy Election Result 2018: Yellareddy Assembly Election 2018 Results | Yellareddy Vidhan Sabha MLA Result". wap.business-standard.com. Retrieved 2021-09-21.
- ↑ News18 (2018). "Yellareddy Rural Assembly constituency (Telangana): Full details, live and past results". News18. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telangana Legislature (2018). "Member's Profile – Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ "Jajala Surender(Indian National Congress(INC)):Constituency- YELLAREDDY(NIZAMABAD) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-21.
- ↑ "Yellareddy Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Retrieved 2021-09-21.
- ↑ "Yellareddy Assembly Election result 2018: Indian National Congress' Jajala Surender wins". www.timesnownews.com. Retrieved 2021-09-21.
- ↑ "Congress MLA Jajula Surendar moves to TRS". www.deccanchronicle.com. Retrieved 2021-09-21.
- ↑ "Congress Telangana Yallareddy Constituency Jajula Surendar Resigned TRS Party Join". www.telugujournalist.com. Retrieved 2021-09-21.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.