బొల్లారం (జిన్నారం)

సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం లోని పట్టణం, రెవెన్యూ గ్రామం.
(ఐడిఎ బొల్లారం (జిన్నారం మండలం) నుండి దారిమార్పు చెందింది)

బొల్లారం , భారతదేశం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జిన్నారాం మండలం లోని గ్రామం.[1] ఇది బొల్లారం పురపాలక సంఘానికి ప్రధాన కేంద్రంగా ఉంది.[2]దీనిని ఐడిఎ బొల్లారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ఇది ఒక భాగం.[3] దీని చుట్టూ బాచుపల్లి, మియాపూర్, అమీన్‌పూర్ ప్రాంతాలు ఉన్నాయి. మియాపూర్, కూకట్‌పల్లి నుండి ఐడిఎ బొల్లారం వరకు అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.హైదరాబాద్ పశ్చిమ అంచులలో, అద్భుతమైన ఆదిమ రాతి నిర్మాణాలు, ఆధునిక అపార్టుమెంట్లు, కర్మాగారాలు పట్టణం చుట్టూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న బొల్లారం పురపాలకసంఘంగా ఏర్పడింది.[4]

బొల్లారం
పారిశ్రామిక వాడ
ఐడిఎ బొల్లారం is located in Telangana
ఐడిఎ బొల్లారం
ఐడిఎ బొల్లారం
భారతదేశంలోని తెలంగాణలో ఐడిఎ బొల్లారం స్థానం.
ఐడిఎ బొల్లారం is located in India
ఐడిఎ బొల్లారం
ఐడిఎ బొల్లారం
ఐడిఎ బొల్లారం (India)
Coordinates: 17°32′39″N 78°20′55″E / 17.5443°N 78.3486°E / 17.5443; 78.3486
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసంగారెడ్డి జిల్లా
మండలంజిన్నారం
మహానగర పరిధిహైదరాబాదు
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్‌కోడ్+91-8458
Vehicle registrationTS

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]

గణాంకాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం బొల్లారం పట్టణ పరిధిలో మొత్తం 9,314 కుటుంబాలు నివసిస్తున్నాయి. బొల్లారం మొత్తం జనాభా 34,667, అందులో 19,385 మంది పురుషులు, 15,282 మంది మహిళలు. సగటు సెక్సు నిష్పత్తి 788.[6]

బొల్లారం నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4817, ఇది మొత్తం జనాభాలో 14%. 0-6 సంవత్సరాల మధ్య 2493 మంది మగ పిల్లలు, 2324 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బొల్లారం చైల్డ్ సెక్సు నిష్పత్తి 932, ఇది సగటు సెక్సు నిష్పత్తి (788) కన్నా ఎక్కువ.పురుషుల అక్షరాస్యత రేటు 80.43%, బొల్లారంలో స్త్రీ అక్షరాస్యత 62.89%గా ఉంది.[6]

పరిశ్రమలు

మార్చు

రాంపెక్స్ ల్యాబ్స్ , డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఖేతాన్, కోకాకోలా, సుజనా, మైలాన్, అపర్ణ, అరబిందో ఫార్మా ఇంకా అనేక ఇతర పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి.

అనుసంధానం

మార్చు

బొల్లారం పట్టణం నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించబడింది.మియాపూర్ x రహదారికి బాచుపల్లి రహదారికి అనుసంధానించబడింది.

మూలాలు

మార్చు
  1. "Bollaram (Medak, Telangana, India) - Population Statistics, Charts, Map, Location, Weather and Web Information". citypopulation.de. Retrieved 2020-10-02.
  2. "Bollaram Municipality". bollarammunicipality.telangana.gov.in. Retrieved 2020-10-02.
  3. http://www.thehindu.com/news/cities/Hyderabad/article873999.ece
  4. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 18 April 2021.
  5. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-09.
  6. 6.0 6.1 "Bollaram Population, Caste Data Medak Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-10-08. Retrieved 2020-10-02.

వెలుపలి లంకెలు

మార్చు