ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు
సంక్షిప్తంగా ఐసిఐసిఐ (ICICI) అని పిలవబడే ఈ బ్యాంకు పూర్తి నామం భారత పారిశ్రామిక రుణ, పెట్టుబడి సంస్థ (Industrial Credit and Investment Corporation of India). ఇది ప్రస్తుతం భారతదేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా[1] కొనసాగుతున్నది. 1955లో దీనిని కేవలం పారిశ్రామిక రుణ అవసరాలకై ప్రారంభించిననూ దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు సంస్థలను ఆహ్వానించిన సందర్భంలో ఇది కూడా బ్యాంకుగా మారింది. ప్రస్తుతం ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా చెలామణి అవుతున్నది. అంతేకాకుండా ఆస్తుల ప్రకారం చూస్తే దేశంలో రెండో పెద్దది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 3600 శాఖలు, 11600 ఏటియాలు ఉన్నాయి. 24 మిలియన్ల ఖాతాదారులు (మార్చి 2007 నాటికి), 79 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తులతో (మార్చి 2007 నాటికి) వర్థిల్లుతోంది.
ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంకు | |
---|---|
దస్త్రం:Icici bank.gif | |
తరహా | ప్రైవేటు |
స్థాపన | 1955 లో |
ప్రధానకేంద్రము | ముంబాయి, భారతదేశం |
కీలక వ్యక్తులు | ఎన్.వాఘుల్ కె.వి.కామత్ చందా కొచ్చర్ కల్పన మొర్పారియా వి.వైద్యనాథన్ మధాబి పురి |
పరిశ్రమ | బ్యాంకింగ్ భీమా |
ఉద్యోగులు | 82,724 (2018 నాటికి). |
వెబ్ సైటు | www.icicibank.com |
ఖాతాదారుల నుండి డిపాజిట్లను స్వీకరించుట, వ్యక్తులకు, సంస్థలకు రుణాలు ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం ఈ బ్యాంకు అనేక రకాలైన సేవలను కలుగజేస్తుంది. భీమా, ఆస్తుల నిర్వహణ, షేర్లు జారీచేయడం లాంటి అనేక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు ఈక్విటీ షేర్లు దేశంలోని ప్రధాన స్టాక్‌ఎక్ఛేంజీలలో నమోదౌతున్నాయి. బాంబే స్టాక్‌ఎక్ఛేంజీ, నేషనల్ స్టాక్‌ఎక్ఛేంజీ, కోల్‌కత స్టాక్‌ఎక్ఛేంజీ, వదోదర స్టాక్‌ఎక్ఛేంజీ లలో కాకుండా న్యూయార్క్ స్టాక్‌ఎక్ఛేంజీలో కూడా దీని షేర్లు లిస్టింగ్ అవుతున్నాయి.
చరిత్ర
మార్చు1955లో భారత ప్రభుత్వం ఇతర పారిశ్రామిక సంస్థలైన "భారత పారిశ్రామిక అభివృద్ధి సంస్థ" (IDBI), "చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ" (SIDBI) లవలె దీనిని కూడా పారిశ్రామిక ఋణ అవసరాలకై స్థాపించబడింది. 1990 దశకంలో భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇవ్వవలసి వచ్చింది. దీనికి అనుగుణంగానే ఈ సంస్థ బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించి చిన్న ఖాతాదారులకు కూడా సేవలందించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన తరువాత 1994లో పేరు కూడా మారింది. కార్పోరేషన్ కాకుండా బ్యాంక్ లిమిటెడ్‌గా పిలువబడుతున్నది. 1999లో న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీలో లిస్టింగ్ అయి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంస్థగా అవతరించింది. 2001లో ఇది 1943లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ మధురను విలీనం చేసుకుంది.
2002లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై ఐ.సి.ఐ.సి.ఐ.కు సంబంధించిన అన్ని విభాగాలను ఏకం చేసి ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు ఛత్రం కిందుకు తేవాలని నిర్ణయించారు. 2002 ఇది లండన్, న్యూయార్క్ లలో తన ప్రతినిధులను కూడా నియమించింది. 2003లో ఐసిఐసిఐ కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ లలో అనుబంధ శాఖలను ఏర్పాటుచేసింది. ఇదే ఏడాది దుబాయి, షాంఘైలలో కూడా ప్రతినిధులను నియమించింది. 2004లో బంగ్లాదేశ్లో ప్రతినిధి కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. 2005లో 4 మిలియన్ అమెరిక డాలర్లు ఆస్తులు కలిగిన రష్యాకు చెందిన ఒక బ్యాంకును విలీనం చేసుకుంది. 2006లో ఐసిఐసిఐ బ్యాంకు యునైటెడ్ కింగ్‌డమ్ బెల్జియం లోని ఆంట్‌వెర్ప్లో శాఖను ఏర్పాటుచేసింది. ఇదే ఏడాది ఐసిఐసిఐ బాంకాక్, జకర్త, కౌలాలంపూర్ లలో ప్రతినిధి కార్యాలయాలను ప్రారంభించింది. 2007లో ఐసిఐసిఐ మహారాష్ట్రలో 158 శాఖలు, కర్ణాటకలో 31 శాఖలు కలిగిన సాంగ్లీ బ్యాంకును కలిపేసుకుంది. ఖతర్ ప్రభుత్వంచే దోహలో శాఖను ఏర్పాటు చేసుకోవడానికి, న్యూయార్క్‌లో కూడా శాఖను ఏర్పాటు చేసుకోవడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి అనుమతిపొందినది. 2008లో ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. అదే మొబైల్ బ్యాంకింగ్.[2] iMobile అని పిల్వబడే ఈ పథకపు ముఖోద్దేశ్యం ఖాతాదార్లు జిపిఆర్ఎస్ సౌకర్యం ఉన్న మొబైల్ ఫోన్ల నుంచి ఖాతాలను నిర్వహించుకోవచ్చు.
బయట్ లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, బిజినెస్ పేజీ, తేది 22.12.2008
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-14. Retrieved 2008-03-06.