ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు

కొంగరపి వెంకటరమణ దర్శకత్వంలో 2004లో విడుదలైన తెలుగు కామెడీ సినిమా.

ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు, 2004 మే 28న విడుదలైన తెలుగు కామెడీ సినిమా.[2] సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానరులో[3] దమ్మలపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకి కొంగరపి వెంకటరమణ దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రాశి, గుర్లిన్ చోప్రా నటించగా,[4] వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చాడు.[5]

ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు
Oka Pellam Muddu Rendo Pellam Vaddu Movie Poster.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంకొంగరపి వెంకటరమణ
కథా రచయితమరుధూరి రాజా (మాటలు)
దృశ్య రచయితకొంగరపి వెంకటరమణ
కథకొంగరపి వెంకటరమణ
నిర్మాతదమ్మలపాటి శ్రీనివాసరావు
తారాగణంరాజేంద్ర ప్రసాద్
రాశి
గుర్లిన్ చోప్రా
ఛాయాగ్రహణంశరత్
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
సాయి కృష్ణ ప్రొడక్షన్స్[1]
విడుదల తేదీ
28 మే, 2004
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

హరిశ్చంద్ర (రాజేంద్ర ప్రసాద్) చాలా నమ్మకమైన, నిజాయితీగల మధ్యతరగతి వ్యక్తి. కానీ అతని భార్య సత్య (రాశి) తనను తాను ధనవంతురాలిగా ఊహించుకుంటుంది. వారికి ఒక కొడుకు. సత్య సోదరుడు శరత్ (సూర్య) ఒకసారి ఇంటికి వచ్చి, ఒక అమ్మాయికి జన్మనిస్తే ఆ దంపతులకు 1 కోటి రూపాయలు వస్తాయని చెప్తాడు. సత్య ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, ఆడపిల్ల పుట్టడానికి ఆశీర్వాదం కోరుతుంది; ప్రతిఒక్కరికీ అబద్ధాలు చెప్పే ప్రతిజ్ఞను ప్రారంభించాలని అతను ఆమెకు సలహా ఇస్తాడు. మొదట్లో హరి దానికి అంగీకరించడు, కాని సత్య ఆత్మహత్యకు ప్రయత్నించగా అతను కూడా ప్రతిజ్ఞకు అంగీకరిస్తాడు. హరి తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణ (కృష్ణ భగవాన్) ను కలిసినపుడు, ప్రతిజ్ఞ కారణంగా తాను వివాహం చేసుకోలేదని అబద్ధం చెప్తాడు. దాంతో, కృష్ణ తన సోదరి మీనా (గుర్లిన్ చోప్రా) వివాహం హరితో ఏర్పాటు చేసుకుంటాడు. మీనా తండ్రి చివరి దశలో ఉన్నందున, హరి అనుకోకుండా మీనాను వివాహం చేసుకోవలసి వస్తుంది. మీనాను ఇంటికి తీసుకువచ్చి సత్యను పనిమనిషిగా పరిచయం చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు
వందేమాతరం శ్రీనివాస్ స్వరపరచిన సినిమా
విడుదల2004
సంగీత ప్రక్రియపాటలు
నిడివి22:48
రికార్డింగ్ లేబుల్సుప్రీమ్ మ్యూజిక్
నిర్మాతవందేమాతరం శ్రీనివాస్

ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6]

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "నీ వయసు తక్కువ (రచన: పైడిశీటి రామ్)"  ఉదిత్ నారాయణ్, కౌసల్య 4:40
2. "గోవిందా గోవిందా (రచన: తైదలబాపు)"  హరిహరన్, కౌసల్య 4:45
3. "ఇరువురి భార్యల (రచన: జయసూర్య)"  హరిహరన్, ఉష 4:40
4. "అడదానికి ఆస్తులంటే (రచన: తైదలబాపు)"  రవివర్మ 4:37
5. "నా ట్రంకు పెట్టె (రచన: పైడిశీటి రామ్)"  మాలతి 4:06
మొత్తం నిడివి:
22:48

మూలాలుసవరించు

  1. "Telugu cinema Review - Oka Pellam Muddu Rendo Pellam Vaddu". www.idlebrain.com. Retrieved 2021-03-18.
  2. "Oka Pellam Muddu Rendo Pellam Vaddu Movie Review". IndiaGlitz.com. Retrieved 2021-03-18.
  3. WoodsDeck. "Oka Pellam Muddu Rendo Pellam Vaddu Telugu Movie Reviews". WoodsDeck. Retrieved 2021-03-18.
  4. "Oka Pellam Muddu Rendo Pellam Vaddu Review". fullhyderabad. Retrieved 2021-03-18.
  5. "Oka Pellam Muddu Rendo Pellam Vaddu (2004)". FilmiBeat. Retrieved 2021-03-18.
  6. "Oka Pellam Muddu Rendo Pellam Vaddu (Songs)". Cineradham. Retrieved 2021-03-18.[permanent dead link]