ఓటర్ 2019 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రామా రీల్స్ పతాకంపై పూదోట సుధీర్ కుమార్ నిర్మించాడు. జి.ఎస్. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, సురభి, సుప్రీత్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని సమకూర్చగా, రాజేష్ యాదవ్ ఛాయాగ్రహణం అందించాడు.[1][2][3][4]

ఓటర్
దర్శకత్వంజి.ఎస్. కార్తీక్
రచనజి.ఎస్. కార్తీక్
నిర్మాతజాన్ సుధీర్ పూదోట
తారాగణంమంచు విష్ణు
సురభి
సుప్రీత్
పోసాని కృష్ణ మురళి
బ్రహ్మాజీ
ఛాయాగ్రహణంరాజేష్ యాదవ్
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
రామా రీల్స్
విడుదల తేదీ
21 జూన్ 2019 (2019-06-21)
సినిమా నిడివి
117 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

యూఎస్‌లో జాబ్ చేస్తోన్న గౌతమ్ (మంచు విష్ణు) ఓటు వేయడానికి ఇండియా వస్తాడు. ఈ క్రమంలో సురభిని చూసి ప్రేమలో పడతాడు. అయితే సురభి తను ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తేనే ప్రేమను అంగీకరిస్తానంటుంది. అయితే ఆ టాస్క్ ను గౌతమ్ పూర్తి చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సెంట్రల్ మినిస్టర్ (సంపత్ రాజ్) పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టే స్థలాన్ని కబ్జా చేస్తాడు. ఆ స్థలాన్ని తిరిగి పేదలకు వచ్చేలా చేస్తానని గౌతమ్ ఆ పేదలకు మాట ఇస్తాడు. సెంట్రల్ మినిస్టర్ నుండి ఆ ల్యాండ్ లాక్కోవటానికి గౌతమ్ ఎటువంటి స్కెచ్ వేశాడు ? ఈ మధ్యలో రీకాల్ ఎలెక్షన్ ఎందుకు వచ్చింది ? చివరికి ఆ స్థలం పేదలకు దక్కేలా చేయగలిగాడా ? లేదా అనేది మిగిలిన కథ......

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "6 ఫీట్ టాల్"  రాహుల్ నంబియార్ 3:05
2. "నీ మాటేరా శాసనం"  సాయిచరణ్ భాస్కరుణి 2:40
3. "శివం థీమ్"  శ్రీ క్రిష్ణ, ఆదిత్య, రఘురాం 3:25
4. "టచ్ కరో"  మేఘ, శృతి, అమల 3:05
12:15

మూలాలు

మార్చు
  1. "Voter". Times of India. 21 June 2019.
  2. "Vishnu Manchu's Voter Movie Release in April". MovieGalleri.
  3. "Reason behind Vishnu Manchu's silence on 'Voter'". Gulte. 12 June 2019.
  4. kavirayani, suresh (20 June 2019). "Voter in trouble?". Deccan Chronicle.
  5. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.