ఓనమాలు 2012, జూన్ 27 న విడుదలైన తెలుగు చిత్రం. స్వచ్ఛమైన మనిషి కథ' అనేది ఉప శీర్షిక. నూతన దర్శకుడు క్రాంతి మాధవ్ సహ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం. ఈచిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది.

ఓనమాలు
Onamalu j.p.g.jpg
దర్శకత్వంక్రాంతి మాధవ్
నిర్మాతక్రాంతి మాధవ్
కె.దుర్గా దేవి
రచనతమ్ముడు సత్యం
నటులురాజేంద్ర ప్రసాద్ (నటుడు)
కళ్యాణి
సంగీతంకోటి
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుగౌతం రాజు
పంపిణీదారుసన్‍షైన్ సినిమా
బ్లూ స్కై (విదేశాలు)[1]
విడుదల
జూన్ 27, 2012 (2012-06-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

నారాయణరావు మాస్టారు ఒక పల్లెటూరిలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అతడు తన విద్యార్థుల మరియు గ్రామస్థుల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ అందులోనే తృప్తిని పొందుతుంటాడు. ఆయన పదవీవిరమణ అనంతరం కొడుకు వద్దకు అమెరికా వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళ తర్వాత తిరిగి తన ఊరికి వచ్చిన అతను పూర్తిగా మారిపోయిన పరిస్థితులను ఎదురుచూశాడు. అభిమానాలు, ప్రేమల స్థానంలో స్వార్ధం, వ్యాపార దృక్పథం విజృంభించాయి. మార్పుకు చాలా బాధపడిన మాస్టారు దానిని బాగుచేయడానికి ప్రయత్నిస్తాడు. అతడు చేయాల్సిన మార్పును ప్రజలలో తీసుకొని రాగలిగాడా అనేది చిత్ర కథనం.[2]

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం - క్రాంతి మాధవ్
  • కథ - తమ్ముడు సత్యం
  • చాయాగ్రహణం - హరి అనుమోలు
  • ఎడిటింగ్ - గౌతంరాజు

పాటలుసవరించు

ఈ సినిమాలోని పాటలు అన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.

ఈ చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: సాలూరి కోటీశ్వరరావు.

సంఖ్య. పాటArtist(s) నిడివి
1. "సూరీడు"  సాలూరి కోటీశ్వరరావు  
2. "అరుదైన"  శ్రీ కృష్ణ  
3. "పండుగంటే"  చైత్ర, కృష్ణ చైతన్య  
4. "హే యమ్మ"  మాళవిక  
5. "పిల్లలు బాగున్నారా"  నిత్య సంతోషిని  

పురస్కారాలుసవరించు

  • ఈ చిత్రం 2012 సంవత్సరానికి ఉత్తమ నూతన దర్శకుడుగా క్రాంతి మాధవ్ మరియు ఉత్తమ నటుడిగా రాజేంద్ర ప్రసాద్ లు మా సినీ అవార్డులు గెలుచుకున్నారు.[3]

బయటి లంకెలుసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఓనమాలు&oldid=1979445" నుండి వెలికితీశారు