కంచర్ల భూపాల్ రెడ్డి

కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున నల్గొండ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

కంచర్ల భూపాల్ రెడ్డి
కంచర్ల భూపాల్ రెడ్డి


పదవీ కాలం
2018 - ప్రస్తుతం
ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నియోజకవర్గం నల్గొండ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973, మే 5
ఉరుమడ్ల, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మల్లారెడ్డి - కౌసల్య
జీవిత భాగస్వామి రమాదేవి
సంతానం శ్రీలక్ష్మి

జననం, విద్యాభాస్యం సవరించు

కంచర్ల భూపాల్‌ రెడ్డి 1973, మే 5న మల్లారెడ్డి - కౌసల్య దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, ఉరుమడ్ల గ్రామంలో జన్మించాడు. ఆయన 1990లో 10వ తరగతి వరకు ఉరుమడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి చేసి, చిట్యాల రవి జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ (1990-1993), హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బీకాం పూర్తి చేశాడు.[2]

వ్యక్తిగత జీవితం సవరించు

భూపాల్‌ రెడ్డికి రమాదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ).

రాజకీయ విశేషాలు సవరించు

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపాల్ రెడ్డి, 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై 10,547 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై 23,698 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4] ప్రస్తుతం నల్గొండ ఎమ్మెల్యే గా విధులు నిర్వహిస్తున్నాడు.[5]

మూలాలు సవరించు

  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. Sakshi (28 April 2019). "నా కూతుర్ని దేవుడు నడిపిస్తాడు: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
  3. "Kancharla Bhupal Reddy(Independent(IND)):Constituency- NALGONDA(NALGONDA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-20.
  4. "Kancharla Bhupal Reddy(TRS):Constituency- NALGONDA(NALGONDA) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-20.
  5. The Hans India (22 March 2020). "Janata curfew Live Updates: MLA kancharla Bhupal... ... Janata Curfew Live Updates: 14-hour nationwide shut down begins across India". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.