కందాల ఉపేందర్ రెడ్డి

కందాల ఉపేందర్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున పాలేరు శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

కందాల ఉపేందర్‌ రెడ్డి
కందాల ఉపేందర్ రెడ్డి


పదవీ కాలం
   2018- ప్రస్తుతం
ముందు తుమ్మల నాగేశ్వరరావు
నియోజకవర్గం పాలేరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జనవరి 9, 1960
రాజుపేట, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నర్సింహరెడ్డి - మోహినీ దేవి
జీవిత భాగస్వామి విజయ
సంతానం ఇద్దరు కుమార్తెలు
నివాసం పాలేరు, తెలంగాణ

జననం, విద్య

మార్చు

ఉపేందర్ రెడ్డి 1960, జనవరి 9న నర్సింహరెడ్డి - మోహినీ దేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ సైన్స్ కాలేజీలో 1980లో బిఎస్సీ పూర్తిచేశాడు. సొంత వ్యాపారం ఉంది.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఉపేందర్ రెడ్డికి విజయతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఉపేందర్ రెడ్డి, 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పాలేరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో చేరాడు.[5][6][7]

ఇతర వివరాలు

మార్చు

ఇటలీ, రష్యా, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు

మార్చు
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "Palair Assembly Election Results 2018: Congress' Kandala Upender Reddy wins". www.timesnownews.com. Retrieved 2021-09-15.
  3. "Kandala Upender Reddy(Indian National Congress(INC)):Constituency- PALAIR(KHAMMAM) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-15.
  4. "Kandala Upender Reddy | MLA | Rajupeta | Kusumanchi | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-04. Retrieved 2021-09-15.
  5. "Thummala Nageswara Rao: తుమ్మలకు షాక్.. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి". Samayam Telugu. Retrieved 2021-09-15.
  6. "తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్‌." Sakshi. 2019-03-14. Retrieved 2021-09-15.
  7. Eenadu (9 November 2023). "అభ్యర్థులు వారే.. గుర్తులు మారె." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.