కనకదుర్గ పూజామహిమ (1960 సినిమా)

ఇదే పేరుగల మరొక సినిమా కోసం కనకదుర్గ పూజామహిమ (1973 సినిమా) చూడండి

కనకదుర్గ పూజామహిమ
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి ,
ఆదోని లక్ష్మి,
మిక్కిలినేని
సంగీతం రాజన్ నాగేంద్ర
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కనకదుర్గ పూజా మహిమ 1960లో బి. విఠలాచార్య నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన జానపదకథా చిత్రం. ఇందులో కాంతారావు, కృష్ణకుమారి ముఖ్య పాత్రలు పోషించారు.

బి.విఠలాచార్య

సాంకేతికవర్గం సవరించు

 • కథ: బి.విఠలాచార్య
 • మాటలు, పాటలు: జి కృష్ణమూర్తి
 • సంగీతం: రాజన్ నాగేంద్ర
 • కళ: బి.సి.బాలు
 • ఛాయాగ్రహణం: జి.చందు
 • కోడైరెక్టర్, ఎడిటర్: జి.విశ్వనాథం
 • నృత్యం: వి.జె.శర్మ
 • పోరాటాలు: పరమశివం
 • నిర్మాత, దర్శకుడు: బి విఠలాచార్య

నటీనటులు సవరించు

కథ సవరించు

మణిశిలా దేశానికి మహరాజు మిక్కిలినేని. ఆయన పట్టపురాణి పన్నెండేళ్ల తరువాత గర్భం దాలుస్తుంది. ఆమెతో అంతఃపురంలో వీణాగానంతో పరవశిస్తుంటాడు. ఆస్థాన పురోహితుడు కనకదుర్గాదేవి పూజకు రమ్మని ప్రభువును కోరగా, తిరస్కరిస్తాడు. పూజారినే పూజలు నిర్వహించమని ఆదేశిస్తాడు. దేవికి ఆగ్రహం కలుగుతుందని మహారాణి చింతిస్తుంది. ఆపైన మహరాజు, మహారాణితో వేసిన పందెం కారణంగా -ఆమె అంతఃపురం వదలి అడవులకు వెళ్లాల్సి వస్తుంది. కొద్ది రోజులకు పశ్చాత్తాపంతో మహరాజు రాజ్యభారాన్ని బావమరిది నరేంద్రవర్మకు అప్పగించి అడవులకు వెళ్తాడు. అడవిలో మహరాణి మగబిడ్డను ప్రసవించి, మునిశాపం కారణంగా భల్లూకంగా మారుతుంది. రాణి బిడ్డను సంతానం లేని కనకదుర్గాదేవి భక్తులైన దంపతులు చేరదీసి పెంచుకుంటారు. మాధవుడని పేరు పెడతారు. భార్యను వెతుకుతూ వచ్చిన మహరాజు గాయపడి భల్లూక సాయంతో సేదదీరి అడవిలో జీవిస్తుంటాడు. నరేంద్రవర్మ కుమార్తె మాలతిని మాధవుడు ఓ ఆపదనుంచి కాపాడటంతో వారిరువురి నడుమ అనురాగం అంకురిస్తుంది. మేఘనాథుడు సర్వతాంత్రిక విద్యలు నేర్చి, తనకు విద్యనేర్పిన గురువునే బంధిస్తాడు. ఇంకా సర్వజ్ఞత సిద్ధించటంకోసం మణిశిలా దేశం ప్రవేశించి, నరేంద్రవర్మ అభిమానం పొంది రాజమందిరం చేరతాడు. అతన్ని ఎదిరించ మాధవుడు భంగపడి ఓ ఏడాది గడువులో అతన్ని ఓడిస్తానని శపథం చేస్తాడు. మాయవతి అనే కన్యను వశపరచుకొన్న మేఘనాధుడు, ఆమెను పాముగా మార్చి రాజ్యంలోని ముఖ్యులను పాము కాటుతో అంతం చేయిస్తూ ఆ నేరం రాకుమారి మాలతిపై మోపి, ఆమెను రాజ్యంనుంచి వెళ్లగొట్టిస్తాడు. మాధవుడు, తన సోదరుడు త్రిలోకం సాయంతో మేఘనాధుని గుహకు చేరి, గురువు ద్వారా విద్యలను గ్రహించి దేవిని ఉపాసిస్తాడు. నరేంద్రవర్మను బలివ్వటానికి అక్కడకు తీసుకొచ్చిన మేఘనాథుని మాధవుడు ఎదిరించి అతన్ని అంతం చేస్తాడు. కనకదుర్గాదేవి అనుగ్రహంతో అంతా కలుసుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.[1]

పాటలు సవరించు

 1. అనురాగసీమ మనమేలుదామా ఆనందాల చవిచూదమా - పి.బి.శ్రీనివాస్, జిక్కి
 2. ఓంకారపంజరసుఖీం ఉపనిషదుద్యాన - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస
 3. చుక్కల్లోంచి చందురుడు తొంగి చూశాడే తొంగి చూశాడే - ( గాయిని వివరాలు లేవు)
 4. జయజయ నమో కనకదుర్గా నమో లోకమాత - బృంద గీతం
 5. జీవనమే పావనం ఈ భువి సంతత సంతోష - ఘంటసాల, శూలమంగళ రాజ్యలక్ష్మి . జీ. కృష్ణమూర్తి.
 6. నాతిన్ గానను రాజ్యము గనను కాంతరానగాసిల్లితిన్ (పద్యం) - ఘంటసాల . జీ. కృష్ణమూర్తి.
 7. భక్తి శ్రధ్దలతోడ భయవినయమున గురులవద్ద నే ( పద్యం) - మాధవపెద్ది
 8. రారా రారా రారా మారకుమారా రావో రావో రావో - జిక్కి
 9. వరమహాలక్ష్మి కరుణించవమ్మా చరణాలే శరణంటినమ్మా - పి. లీల బృందం
 10. వసంతుడే రాడాయె వసుంధరే రాగల ఊగి తూగానే - ఎ.పి. కోమల బృందం

మూలాలు సవరించు

 1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (3 August 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 కనకదుర్గ పూజా మహిమ". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 13 ఆగస్టు 2019. Retrieved 9 June 2020.

బయటిలింకులు సవరించు