కరీంనగర్ ఐటీ టవర్

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలో ఉన్న ఐటీ టవర్

కరీంనగర్ ఐటీ టవర్ అనేది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పట్టణంలో ఉన్న ఐటీ టవర్. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశ్యంతో కరీంనగర్ లోని 80 వేల చదరపు అడుగుల స్థలంలో 34 కోట్ల వ్యయంతో 556 సీట్లతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఐటీ టవర్‌ను నిర్మించింది.[1]

కరీంనగర్ ఐటీ టవర్
కరీంనగర్ ఐటీ టవర్ భవనం
సాధారణ సమాచారం
రకంఐటీ టవర్
ప్రదేశంకరీంనగర్, తెలంగాణ
నిర్మాణ ప్రారంభం2020, జూలై 21
వ్యయం34 కోట్లు
యజమానితెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
సాంకేతిక విషయములు
నేల వైశాల్యం80,000 sq ft (7,400 మీ2)

నిర్మాణం

మార్చు

ఈ ఐటీ టవర్ నిర్మాణానికి కరీంనగర్ దిగువ మానేరు జలాశయం పరిధిలో 2018 జనవరి 8న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[2]

ప్రత్యేకతలు

మార్చు
  1. ఐదంతస్తుల్లో నిర్మించిన ఈ ఐటీ టవర్‌లో 12 చదరపు అడుగులు సెల్లార్‌ కాగా, మరో 60 వేల అడుగులు ఆఫీసు స్పేస్‌కు కేటాయించబడింది.
  2. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో స్థానిక యువత కోసం శిక్షణ కేంద్రంతోపాటు ఏసీ, నాన్‌ఏసీ క్యాంటీన్లు ఏర్పాటుచేయబడగా మొదటి అంతస్తులో కార్యాలయం, రెండు, ఐదో అంతస్తుల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటుచేయబడ్డాయి.
  3. మూడు, నాలుగో అంతస్తులు దిగ్గజ కంపెనీలకు కేటాయించబడ్డాయి.
  4. ఈ టవర్‌లో సెంట్రల్ ఏసీతోపాటు, 24 గంటల విద్యుత్ ‌సదుపాయం కల్పించేందుకు అవసరమైన జనరేటర్‌ అందుబాటులో ఉంది.
  5. 20కోట్ల రూపాయలతో టూల్‌ డిజైన్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయబడింది.

ప్రారంభం

మార్చు

2020 జూలై 21న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఐటీ టవర్‌ను ప్రారంభించి, అందులోని 12 కంపెనీల్లో ఎంపికైన 432 మందికి నియామక పత్రాలు అందజేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, బిసి సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3][4]

కార్యకలాపాలు

మార్చు

2020 జూలై నాటికే ఈ ఐటీ టవర్‌లో కార్యకలాపాలకోసం 26 కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదించగా, 15 కంపెనీలకు ఆఫీస్‌ స్పేస్‌ కేటాయించబడింది. ఈ ఐటీ టవర్‌ ద్వారా దాదాపు 3,600 మందికి ఉపాధి దక్కుతుంది.[5]

మూలాలు

మార్చు
  1. "KT Rama Rao to inaugurate Karimnagar IT Tower". The New Indian Express. 2020-07-20. Archived from the original on 2023-01-11. Retrieved 2023-03-30.
  2. "21న ఐటీ టవర్ ప్రారంభం ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్". ETV Bharat News. 2020-07-20. Archived from the original on 2023-03-30. Retrieved 2023-03-30.
  3. Sistu, Suhas (2020-07-21). "KTR inaugurates IT tower, daily water supply scheme and regional office of TASK in Karimnagar". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-03-30. Retrieved 2023-03-30.
  4. Garrepally, Rajashekhar (2020-07-21). "ఐటీ టవర్ ప్రారంభం: కరీంనగర్ మారింది, ఐటీ సంస్థలకు కేటీఆర్ పిలుపు". telugu.oneindia.com. Archived from the original on 2020-09-07. Retrieved 2023-03-30.
  5. "కరీంనగర్‌ ఐటీ టవర్‌ రెడీ". Sakshi. 2020-07-21. Archived from the original on 2020-07-23. Retrieved 2023-03-30.

వెలుపలి లంకెలు

మార్చు