కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి
కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి 1998 లో ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం.[1] ఇందులో సురేష్, రాశి, సాయికుమార్, ఇంద్రజ ముఖ్యపాత్రల్లో నటించారు.
కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి | |
---|---|
దర్శకత్వం | ఎ. మోహన గాంధీ |
రచన | ఎ. మోహన గాంధీ (స్క్రీన్ ప్లే), జనార్ధన మహర్షి (మాటలు) |
కథ | శ్రీ సాయి చిత్ర యూనిట్ |
తారాగణం | సురేష్ , రాశి , సాయికుమార్, ఇంద్రజ |
ఛాయాగ్రహణం | డి. ప్రసాద్ బాబు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎస్. ఎ. రాజ్ కుమార్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1998 |
సినిమా నిడివి | 133 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఅందరూ పిచ్చి కాశయ్య అని వ్యవహరించే కాశయ్య బ్యాంకులో లోను తీసుకుని తన పొలంలో చేపల చెరువు తవ్వుతుండగా అతని దగ్గరికి అనాథలైన చిట్టిబాబు, రూప అనే అన్నా చెల్లెలు పనికోసం వస్తారు. ఏ సంబంధం లేకపోయినా కాశయ్యను బాబాయి అని వ్యవహరిస్తూ అతని చేరువవుతారు. అప్పటి నుంచి అతని దగ్గరే పెరిగి పెద్దవారవుతారు.
తారాగణం
మార్చు- సురేష్
- చిట్టిబాబు గా సాయికుమార్
- రూప గా రాశి
- ఇంద్రజ
- పిచ్చి కాశయ్య గా రాళ్ళపల్లి
- తనికెళ్ళ భరణి
- ఎ. వి. ఎస్
- వై. విజయ
- శివాజీరాజా
- ఆలీ
- మల్లికార్జున రావు
- శకుంతల
- మాధురి
- సి. వి. ఎల్
- వాసు
- జవ్వాది రామారావు
పాటలు
మార్చుఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాటలు ఇ. ఎస్. మూర్తి రాయగా, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, స్వర్ణలత, సుజాత గానం చేశారు.[2]
మూలాలు
మార్చు- ↑ "కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి 1998 తెలుగు సినిమా". thecinebay.com. Retrieved 30 November 2017.[permanent dead link]
- ↑ "యూట్యూబులో సినిమా". youtube.com. మ్యాంగో వీడియోస్. Retrieved 30 November 2017.