కళ్యాణదుర్గం పురపాలక సంఘం
కళ్యాణదుర్గం పురపాలకసంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[3] దీని ప్రధాన కార్యాలయ కేంద్రస్థానం కళ్యాణదుర్గం పట్టణం. ఇది 3 తరగతికి చెందిన పురపాలకసంఘం.[4] అనంతపురం లోక్సభ నియోజకవర్గం లోని, కళ్యాణ దుర్గం శాసనసభ నియోజకవర్గం పరిధిలో నిర్వహించబడుతుంది.
కళ్యాణదుర్గం | |
---|---|
Coordinates: 14°33′00″N 77°06′00″E / 14.5500°N 77.1000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనతపురం |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• శాసనసభ్యుడు | కె.వి.ఉషశ్రీ చరణ్ |
విస్తీర్ణం | |
• Total | 34.92 కి.మీ2 (13.48 చ. మై) |
Elevation | 656 మీ (2,152 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 32,328 |
• జనసాంద్రత | 930/కి.మీ2 (2,400/చ. మై.) |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
Website | [dead link] |
చరిత్ర
మార్చుమునిసిపాలిటీ 2012 మార్చిలో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా ఏర్పడింది.[5] పురపాలకసంఘంగా స్థాపించుటకు ముందు ఇది జనగణన పట్టణం, నోటిఫైడ్ గ్రామ పంచాయితీగా ఉండేది.
భౌగోళికం
మార్చుకళ్యాణదుర్గం 14°33′00″N 77°06′00″E / 14.5500°N 77.1000°E వద్ద ఉంది.[6] దీని సగటు ఎత్తు 591 మీటర్లు (1942 అడుగులు).[7] మునిసిపాలిటీ అధికార పరిధి 34.92 చ.కి.మీ.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం కళ్యాణదుర్గం పురపాలక సంఘం పరిధిలో మొత్తం 7,220 కుటుంబాలు నివసిస్తున్నాయి.పట్టణ పరిధిలో ఉన్న జనాభా మొత్తం 32,328 మంది కాగా, అందులో 16,036 మంది పురుషులు, 16,292 మంది మహిళలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1016 మంది స్త్రీలు ఉన్నాారు. సగటు అక్షరాస్యత రేటు 21,443 మంది అక్షరాస్యతలతో 74.14% వద్ద ఉంది, ఇది రాష్ట్ర సగటు 67.41 కంటే 6.73 %ఎక్కువ ఉంది. పట్టణ జనాభా మొత్తంలో 0-6 సంవత్సరాల వయస్సుగల గల పిల్లల జనాభా 3,404 మంది ఉన్నారు.ఇది మొత్తం జనాభాలో 10.53 శాతంగా ఉంది.0-6 సంవత్సరాల వయస్సు మధ్యగల వారిలో 1,760 మంది మగ పిల్లలుకాగా 1,644 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది మగ పిల్లలకు, 979 మంది ఆడపిల్లలు ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 11 September 2014.
- ↑ "Urban Local Bodies". apdpms.ap.gov.in. Archived from the original on 2019-08-03. Retrieved 2021-03-27.
- ↑ https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf
- ↑ "DTCP". dtcp.ap.gov.in. Archived from the original on 2021-05-10. Retrieved 2021-03-27.
- ↑ "Maps, Weather, and Airports for Kalyandrug, India". www.fallingrain.com.
- ↑ "Region geography" (PDF). shodhganga. p. 48. Retrieved 12 September 2014.