కాటసేనాని
కాటసేనాని (1070-1108) కాకతి రెండవ బేతరాజు సామంతునిగా సేవలు అందించాడు. రెండవ బేతరాజుకు సేనానిగా పనిచేసి ఉండవచ్చును. ఇతను ముదిగొండ, సబ్బిసాయిర, అనుమగొండ ప్రాంతములను పాలించి మహా మండలేశ్వరుడై ఉండెను. ఇతను కాకతి వంశీయులకు అత్యంత విధేయుడు.[1]
మల్యాల వంశీయులు కాకతీయుల సామంతులుగా ఉన్నారు. వీరు కాకతీయులకు మంత్రులుగా, సేనానాయకులుగా, దండనాథులుగా, వారి విధేయులుగ బాధ్యతలు నిర్వహించారు. ప్రభువుల అడుగుజాడల్లోనే ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. చెరువులు తవ్వించారు. ఆలయాలు నిర్మించారు.అలా నిర్మించిన ఆలయాలు, వాటి నిర్మాణరీతి, శిల్పుల అద్భుత ప్రతిభ గురించి 3 శ్లోకాలు కాటసేనాని వేయించిన కొండపర్తి శాసనంలో ఉంది.
కాటసేనాని మల్యాల వంశానికి చెందినవాడు. ఆచమల పుత్రుడు. అతను సా.శ. 1180లో కొండపర్తి గ్రామంలో రుద్రేశ్వర, కేశవదేవాలయాలను నిర్మించి వాటికి రెండు నివర్తనాల భూమిని దానమిచ్చి శాసనం వేయించాడు. ఈ శాసనం నాలుగువైపుల మొత్తం 192 పంక్తుల్లో ఉంది. వీటిలో దేవాలయ వాస్తు విశేషాలను తెలిపే శ్లోకం రాసి ఉంది.[2]
మూలాలు
మార్చు- ↑ "Telanga History Recharla Reddy Dynasty". Recruitment Topper (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-04. Archived from the original on 2020-09-27. Retrieved 2020-07-16.
- ↑ "రాళ్లెత్తిన కూలీలకు... రాజుల సలాం! - Namasthetelangaana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-16.