తెలుగు సాహిత్యం - దాక్షిణాత్య యుగము

తెలుగు సాహిత్యంలో 1600 నుండి 1775 వరకు దాక్షిణాత్య యుగము అంటారు. 12.1. దక్షిణాంధ్రయుగ సాహిత్యం :

తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్య చరిత్రలో దక్షిణాంధ్ర యుగ సాహిత్య ఆవిర్భావం ఓ ప్రత్యేకతను సంతరించుకొని కనుపిస్తుంది. రాజులు ప్రత్యేక శ్రద్ధవహించి సాహిత్యాన్ని పెంచి పోషించిన పరిస్థితి ఇక్కడ ఉంది. విజయనగర చక్రవర్తులలో ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయలు మధురలోను, అచ్యుత దేవరాయలు తంజావూరులోను దక్షిణ దేశ పరిపాలనకు తెలుగు నాయక రాజులను తమ ప్రతినిధులుగా, సామంతులుగా నియమించారు. ఆ నాయక రాజుల రాజ్య రక్షణ కోసం తెలుగు సైనికులను, వారితో పాటు రాజ వినోదం కోసం కవులు, పండితులు, గాయకులను తెలుగు దేశం నుండి దక్షిణ దేశానికి పంపారు. క్రీ.శ. 1665 లో జరిగిన తళ్ళికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం మహమ్మదీయుల వశమయింది. దాంతో తెలుగు దేశంలో కవులకు, గాయకులకు రాజాదరణ నశించింది. దాంతో తెలుగు దేశం నుండి వివిధ కళలకు చెందిన కళాకారులు అనేకులు మధుర, తంజావూరులలోని తెలుగు నాయక రాజులను ఆశ్రయించారు. రాజ్యసాలన వ్యవహారాలలోను, కవి పండిత పోషణలోనూ, కళాభివృద్ధిలోనూ ఆ రాజులు విజయనగర రాజుల మాదిరిగానే ఎంతో శ్రద్ధ వహించారు. దాంతో తెలుగు సాహిత్యం తెలుగు దేశపు ఎల్లలు దాటి ప్రధానంగా తంజావూరు, మధుర, జింజి, మైసూరు, పుదుక్కోట లాంటి కేంద్రాలలో ఇలా వెలసిల్లింది. క్రీ.శ. 17, 18 శతాబ్దాల సాహిత్య కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రకారులు దక్షిణాంధ్ర యుగమని ప్రత్యేకించి ఆంధ్ర వాఙ్మయ పరిణామంలో దాని ప్రాధాన్యాన్ని గుర్తించారు. ప్రక్రియ వైవిధ్యంలోనూ, రచనా స్వరూపంలోనూ, భాష శైలిలోనూ, సాహిత్య ప్రయోజనంలోనూ దక్షిణాంధ్ర దేశ కవులు కొంత ప్రత్యేకతను ప్రదర్శించారు.

దక్షిణాంధ్ర యుగ సాహిత్యంలో తొలిగా చెప్పుకోదగ్గ కృషి తంజావూరు నాయక రాజులు చేసారు. క్రీ.శ. 1613 నుండి 1631 వరకూ ఉన్న ఆచ్యుతప్ప నాయకుని కుమారుడు రఘునాథ నాయకుడు తెలుగు భాషకు చేసిన సేవ చాలా గొప్పది. కవి పండిత పోషణనూ, సరస సాహితీ సృష్టిలో, సంగీత విద్య ప్రావీణ్యంలో విశిష్టాద్వైత మతాభి నివేశంలోనూ, పరమత సహనంలోనూ ఈయన కృష్ణదేవరాయలు సహిపోలినవాడు. రఘునాథ నాయకుడు రచించిన కృతులలో వాల్మీకి చరిత్ర, శృంగార సావిత్రి

<< దూర విద్యా కేంద్రము (KGGO

KEEEEEEEEEEET2 KEEEEEEEEEEEEEE ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (KCC

ప్రబంధాలు, నలచరిత్ర ద్విపద కావ్యం, రఘునాథ రామాయణం చెప్పుకోతగ్గవి. ఈయన రచించిన ఇతర రచనలు లభ్య కావటంలేదు.. ఈ రాజు ఆస్థానంలోని రామ భద్రాంబ, మధుర వాణి, చామకూర వేంకటకవి ప్రసిద్ధులు. అలాగే ఈ రాజు ఆస్థాన కవులలో విద్వత్కవి కృష్ణాధ్వరి ప్రముఖుడు, రఘునాథ భూపాలీయం, నైషధ పారిజాతా వాతారిక, కల్యాణ కౌముది, కందరర్ప నాటకం, శృంగార సంజీవని, తాళ్ళ చింతామణి అనేవి కృష్ణాధ్వరి రచించాడని చెబుతున్నా అవి లభ్యం కావటంలేదు. నైషధ పారిజాతీయం అనే నాలుగాశ్వాశాల ధ్వర్ధి కావ్యాన్ని కూడా ఈయన రాసాడు. దీనిలో నలచరిత్ర, పారిజాతాపహరణ కథ ఉన్నాయి. రఘునాథ నాయకుడి ఆస్థాన కవులలో కవి చౌడప్ప కూడా ఒకడు. రఘునాథ నాయకుడి తరువాత ఆయన కుమారుడు విజయరాఘవ నాయకుడు పాలనలోకొచ్చి తండ్రిని మించి తెలుగు సాహిత్య సేవ చేసాడు. ఈయన తన కొలువు కూటానికి రాజగోపాల విలాసం అని పేరు పెట్టాడు. విజయరాఘవ నాయకుడు తెలుగులో యాభై కృతులను రచించాడు. యక్షగాన ప్రక్రియను ఈయన విశేషంగా ఆదరించాడు. కాళీయ మర్దనం, కృష్ణ విలాసం, విప్రనారాయణ చరిత్ర, రఘునాథాభ్యుదయం, పూతనాహరణం, ప్రహ్లాద చరిత్ర అనేవి మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటిలోనూ రఘునాథాభ్యుదయం, విప్రనారాయణ చరిత్ర మాత్రం ముద్రితమయ్యాయి. రఘునాథాభ్యుదయం అనే యక్షగానాన్ని రఘునాథ నాయకాభ్యుదయం అనే పేరున ద్విపద కావ్యంగా కూడా ఈయన రాసాడు. ఈయన గొప్ప శ్రీకృష్ణ భక్తుడు. ద్విపద కావ్యాలే కాక గోపికా భ్రమర గీతాలను తెనిగించటం, పాల్గుణోత్సవ రగడను, గోపాల దండకాన్ని, వీర శృంగార సాంగత్యం, సంపంగి మన్నారు సాహిత్యం, తదితర కావ్యాలను కూడా రచించినట్లుగా ఈయన చెప్పుకొన్నాడు. విజయ రాఘవుడి దగ్గర భోగపత్నిగా రంగాజమ్మ ఉండేది. పట్టపు కవిగా కామరసు వెంకటపతి సోమయాజి ఉండేవాడు. సంగీత సాహిత్యాలు ఒక వ్యసనంగా మారి వాటితోనే ఈయన చరిత్ర అంతమైంది. ఈయన కాలంలోనే యక్షగానానికి గొప్ప ఆదరణ లభించింది. విజయరాఘవుడి ఆస్థానంలో విదుషీమణులు కూడా గొప్ప పేరు: తెచ్చుకున్నారు. చంద్రరేఖ. కృష్ణాతజీ, పసుపులేటి రంగాజమ్మ అలాంటి వారిలో ముఖ్యులు. వారు ఆశుకవితలో విశారదులు. రంగాజమ్మ విజయరాఘవుడి చేత కనకాభిషేకం కూడా పొందింది. ఆమె మన్నారుదాస విలాసం అనే యక్షగానాన్ని, మన్నారుదాస విలాస ప్రబంధాన్ని, ఉషాపరిణయ ప్రబంధాన్ని కూడా రచించింది. ఈమె రచించిన సంగ్రహ రామాయణం, భారత భాగవతాలు. దొరకటం లేదు. ఈ రాజు ఆస్థానంలోనే చెంగల్వ కాళకవి, కోనేటి దీక్షితకని చంద్రుడు, పురుషోత్తమ దీక్షితులు, కామరసు వేంకటపతి సోమయాజి అనే కవులు ఉండేవారు. విజయరాఘవ నాయకుడు ఆస్థాన కవులు, కవయిత్రులు అతడిని కథానాయకుడిగా స్వీకరించి యక్షగానాది కృతులను రచించారు. తంజావూరు నాయక రాజులలో చివరివాడు విజయరాఘవ నాయకుడి కుమారుడైన మన్నారు దేవుడు. ఈయన కూడా మంచి కవి. మన్నారు దేవుడు విజయరాఘవాభ్యుదయం, హేమాబ్జ నాయినా స్వయంవరం అనే రెండు గ్రంథాలను రచించాడు. వీటిలో విజయ రాఘవాభ్యుదయం దొరకటం లేదు. తంజావూరు నాయక రాజుల కాలంలో వెలువడిన ప్రతి రచనలోనూ ప్రజా జీవిత స్పర్శ ఉండటం విశేషం. రాజపరంగా శృంగారం, ప్రజాపరంగా హాస్యం ఆ రచనల్లో ఉన్నాయి. తంజావూరు నాయక రాజులు కవులను, గాయకులను, నాట్యగత్తెలను తమ ఆస్థానాలకు ఆహ్వానించి సత్కరిస్తూ కళా పోషణ చేసారు. విజయరాఘవ నాయకుడు క్షత్రయ్యను ఆహ్వానించి ప్రోత్సహించిన సంఘటన దీనికొక ఉదాహరణ,

రాజకీయ, సామాజిక వేపధ్యం సవరించు

ఈ యుగంలో భాష లక్షణాల

ఈ యుగంలో తెలుగు లిపి సవరించు

ముఖ్య కవులు సవరించు

ముఖ్య రచనలు సవరించు

ముఖ్య పోషకులు సవరించు

ఇతరాలు సవరించు

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

వనరులు సవరించు

బయటి లింకులు సవరించు

Dhakshinandra yugam lo vachana rachanalu శ్రీ రంగ మహాత్యం, మాఘ మాసం,జైమిని భారతం, mahaabaaratham, vachana vichitra రామాయణం.