బహమనీ సామ్రాజ్యం
బహమనీ సామ్రాజ్యము దక్షిణ భారత దేశమున దక్కన్ యొక్క ఒక ముస్లిం రాజ్యము. ఈ సల్తనత్‌ను 1347లో టర్కిష్ గవర్నర్ అల్లాద్దీన్ హసన్ బహ్మన్ షా, ఢిల్లీ సుల్తాన్, ముహమ్మద్ బిన్ తుగ్లక్కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి స్థాపించాడు. అతని తిరుగుబాటు సఫలమై, ఢిల్లీ సామ్రాజ్యము యొక్క దక్షిణ ప్రాంతాలతో దక్కన్‌లో ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాడు. 1347 నుండి దాదాపు 1425 వరకు బహమనీల రాజధాని ఎహసానాబాద్ (గుల్బర్గా). ఆ తరువాత రాజధాని, మహమ్మదాబాద్ (బీదర్) కు తరలించారు. బహమనీలు దక్కన్ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ ఓరుగల్లు ముసునూరి చక్రవర్తులపై, విజయనగర వారిపై పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్ గవాన్ యొక్క వజీరియతులో (1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ సల్తనత్, దక్కన్ సల్తనత్ లుగా పేరు పొందాయి.
బహమనీ సామ్రాజ్యం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1347–1518 | |||||||||
బహమనీ సామ్రాజ్యం, 1470లో | |||||||||
రాజధాని | గుల్బర్గా, తర్వాత బీదర్ | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
చరిత్ర | |||||||||
• స్థాపన | 1347 | ||||||||
• పతనం | 1518 | ||||||||
|
సామ్రాజ్య స్థాపకుడి చరిత్రపై కథనం
మార్చుబహమనీ సామ్రాజ్య స్థాపకుడు హసన్ గంగు గురించి ఒక కథనం ప్రచారంలో ఉంది. సన్ గంగు ఒక బ్రాహ్మణుడి వద్ద పొలం పనులు చేస్తూండేవాడు. ఒకరోజు పొలం దున్నుతూండగా, అతడికి ఒక నిధి దొరికింది. ఆ నిధిని తీసుకువెళ్ళి బ్రాహ్మణునికి ఇచ్చాడు. అతడి నిజాయితీకి సంతోషించిన బ్రాహ్మణుడు, అతణ్ణి, రాజు కొలువులో పని ఇప్పించాడు. తిరుగుబాటు తరువాత, అతడు రాజైనపుడు, [1]. అయితే ఈ కథనాన్ని ధ్రువపరచే చారిత్రిక ఆధారాలు దొరకలేదు.
బహమనీ సుల్తానుల జాబితా
మార్చు- అల్లాద్దీన్ హసన్ బహ్మన్ షా 1347 - 1358
- మహమ్మద్ షా I 1358 - 1375
- అల్లాద్దీన్ ముజాహిద్ షా 1375 - 1378
- దావూద్ షా 1378
- మహమ్మద్ షా II 1378 - 1397
- ఘియాతుద్దీన్ 1397
- షంషుద్దీన్ 1397
- తాజుద్దీన్ ఫిరోజ్ షా 1397 - 1422
- అహ్మద్ షా I వలీ 1422 - 1436
- అల్లాద్దీన్ అహ్మద్ షా II 1436 - 1458
- అల్లాద్దీన్ హుమాయున్ జాలిమ్ షా 1458 - 1461
- నిజాం షా 1461 - 1463
- మహమ్మద్ షా III లష్కరి 1463 - 1482
- మహమ్మద్ షా IV (మెహమూద్ షా) 1482 - 1518
- అహ్మద్ షా III 1518 - 1521
- అల్లాద్దీన్ 1521 - 1522
- వలీ అల్లా షా 1522 - 1525
- కలీమల్లా షా 1525 - 1527
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ మద్రాసు ప్రెసిడెన్సీలో గోదావరి జిల్లా చరిత్ర - పేజీ 211